ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అత్యధికంగా రూ.12.5 కోట్ల ధర పలికాడు. గత రెండు సీజన్లలో నిషేధం ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్.. తాజా సీజన్ ఆరంభంలో భారీ ధరకు స్టోక్స్‌ను సొంతం చేసుకుంది. భారత యువ క్రికెటర్లు మనీశ్ పాండే, కేఎల్ రాహుల్‌లు రూ.11 కోట్లకు కొనుగోలు కాగా, సీనియర్ క్రికెటర్లు హర్భజన్, గంభీర్, టీ20 స్పెషలిస్టులు యువరాజ్, యూసఫ్ పఠాన్‌లు తక్కువ ధర పలకడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి లోను చేసింది. అత్యల్పంగా స్టూవర్ట్ బిన్నీని రూ.50 లక్షల ధర పలికాడు. కనీస ధరకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.