సెంట్రో షోరూమ్‌లో మనీశ్ పాండే, అలెక్స్ హేల్స్, భువనేశ్వర్
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు బంజారాహిల్స్‌లోని సెంట్రో షోరూమ్‌లో సందడి చేశారు. క్రికెటర్లు భువనేశ్వర్, మనీశ్ పాండే, అలెక్స్ హేల్స్ శనివారం 30 మంది వర్ధమాన క్రీడాకారులతో ముచ్చటించారు. ‘జస్ట్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు చిన్నారులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ఆటగాళ్లను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
క్రికెట్ ఆడకపోయి ఉంటే ఏం చేసేవారని ఓ చిన్నారి భువనేశ్వర్ కుమార్‌ను ప్రశ్నించగా... తాను ఆర్మీలో చేరేవాడినని అతను తెలిపాడు. మిగతా ప్రశ్నలకు సమాధానమిస్తూ భువీ ‘క్రీడాకారులుగానే కాకుండా జీవితంలో ఎదగాలంటే కష్టపడేతత్వం ఉండాలి. శ్రమిస్తేనే ఏదైనా సాధించగలం. నాకే కాదు ప్రతీ క్రికెటర్‌కు సచిన్ టెండూల్కరే మార్గదర్శి’ అని చెప్పాడు. తన 13వ ఏటనే క్రికెట్‌లోకి అడుగుపెట్టానన్న భువీ... అండర్–19లో ఆడుతున్నప్పుడే భారత జట్టుకు ఆడతాననే నమ్మకం కలిగిందని గుర్తుచేసుకున్నాడు. సన్‌రైజర్స్ జట్టులో చిలిపి చేష్టలు ఎవరు చేస్తారని మరో చిన్నారి ప్రశ్నించగా, బిపుల్ శర్మ కామెడీ బాగా చేస్తాడని, అందరినీ ఆటపట్టిస్తుంటాడని మనీశ్ పాండే సమాధానమిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment