Sunrisers Hyderabad team
-
IPL 2024 SRH Vs MI: ఆరెంజ్ఆర్మీతో సన్‌రైజర్స్.. బెస్ట్ ఫొటోలు
-
‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్ తీరే వేరు
ఐపీఎల్ వేలం వేదిక వద్ద సన్‌రైజర్స్ హైదరాబాద్ బృందం ఏం చేస్తోంది? సగటు అభిమానికి రెండు రోజులుగా ఇదే సందేహం వచ్చింది. ఇతర జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్ వేలం దశ దిశ లేకుండానే సాగినట్లుగా అనిపిస్తోంది. అసలు వేలానికి ముందు ఏదైనా ‘హోం వర్క్’ చేసి వచ్చారా లేక టేబుల్‌పైనే నిర్ణయాలు తీసుకున్నారా అని అనిపించింది. వ్యూహాత్మకంగా డబ్బులను ఉపయోగించడంలో ఆ జట్టు బాగా విఫలమైంది. మొదటి నుంచి టీమ్ మిడిలార్డర్ బ్యాటింగ్ బలహీనం. కొన్ని బంతుల్లోనే మ్యాచ్ రాత మార్చే ఒక్క విధ్వంసక ఆటగాడు ఈసారి కూడా జట్టులో లేడు. చదవండి: IPL 2022 Auction: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు తాజా ఫామ్, నిలకడను బట్టి చూస్తే విండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌కు రూ. 10 కోట్ల 75 లక్షల చాలా ఎక్కువ. విండీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌కు మరీ రూ. 7 కోట్ల 75 లక్షలు ఇచ్చి తీసుకోవడం అనూహ్యం. బౌలింగ్‌లో అతని అంతర్జాతీయ టి20 కెరీర్ ఎకానమీ 11.33 అంటే ఎంతో అధ్వానం! ఫ్రాంచైజీ యజమానులు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రదర్శనపైనే ఆధారపడ్డారా అనిపించింది. ఎవరూ పట్టించుకోని న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్‌కు రూ. కోటీ 50 లక్షలు, ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అఫ్గానినిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హఖ్‌కు రూ. 50 లక్షలు, ఫామ్ కోల్పోయి చాలా కాలంగా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్క్రమ్కు రూ. 2 కోట్ల 60 లక్షలు, అసలు సీన్లోనే లేని సీన్ అబాట్ (ఆస్ట్రేలియా)కు రూ. 2 కోట్ల 40 లక్షలు... ఇలా సన్‌రైజర్స్ ఖర్చు చేసింది. వరుస గాయాలతో బాధపడుతున్న విలియమ్సన్ కోలుకొని జట్టుకు బ్యాటింగ్‌పరంగా ఎంతగా ఉపయోగపడతాడనేది ఒక సందేహం కాగా... మిగిలిన ఏడుగురు విదేశీ ఆటగాళ్లలో ఒక్కరు కూడా వార్నర్, రషీద్ ఖాన్ల తరహాలో సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నవారు లేరు! వీళ్లూ అంతంతే... భారత క్రికెటర్లకు ఎంచుకునే విషయంలో కూడా సన్‌రైజర్స్ ఎక్కడా దూకుడు కనిపించలేదు. తొలి రోజే రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మలకు స్థాయికి మించి మొత్తాలు ఆఫర్ చేసిన టీమ్ రెండో రోజు కూడా పెద్దగా గుర్తింపు లేని ఆటగాళ్లనే వరుసగా ఎంచుకుంది. ఓపెనర్‌గా కెరీర్ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ కనీసం 100 కూడా లేని ఆర్.సమర్థ్ సామర్థ్యంపై రైజర్స్ నమ్మకముంచింది! సౌరభ్ దూబే (విదర్భ), శశాంక్ సింగ్ (ఛత్తీస్‌గఢ్), విష్ణు వినోద్ (కేరళ), జె. సుచిత్ (కర్ణాటక), ప్రియమ్ గార్గ్ (యూపీ)... వీరంతా జట్టు విలువను పెంచగలరా! చదవండి: IPL 2022 Mega Auction: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇదే హైదరాబాదీలు లేని టీమ్... ఒక్క హైదరాబాద్ క్రికెటర్... పోనీ దేశవాళీలో ఆంధ్ర జట్టుకు ఆడుతున్నా సరే, ఒక తెలుగు ఆటగాడు... సన్‌రైజర్స్ టీమ్‌కు తమ జట్టులో చేర్చుకునేందుకు ఎవరూ దొరకలేదు. హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి కనీసం ‘నామ్‌కే వాస్తే’గానైనా ఒకరిని హైదరాబాద్ టీమ్‌లో తీసుకునే సాహసం చేయలేదు! హోం సిటీ ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకునే విషయంలో మొదటినుంచీ సన్‌రైజర్స్ వ్యవహార శైలి ఇలాగే ఉంటోంది. నిజమైన హైదరాబాద్ అభిమానులు ఇతర ఫ్రాంజైజీల తరహాలో ‘ఇది మా టీమ్’ అంటూ గర్వంగా ఎప్పుడూ చెప్పుకునే అవకాశం ఫ్రాంచైజీ ఇవ్వలేదు. ఈసారి కూడా 25 మంది సభ్యుల టీమ్‌లో హైదరాబాద్ లేదా ఆంధ్రకు చెందిన ఒక్క ప్లేయర్ కూడా సన్‌రైజర్స్ టీమ్‌లో లేడు. గొప్ప ఆటగాళ్లు, అద్భుత ప్రదర్శనల సంగతి తర్వాత... ఐపీఎల్ ఫ్యాన్స్ టీమ్‌తో కనెక్ట్ కావడానికి లోకల్ ప్లేయర్స్ కూడా ఒక కారణం అవుతారు. కానీ సన్‌రైజర్స్ మాత్రం అలా ఎప్పుడూ ఆలోచించలేదు. ‘షాక్‌కు గురి చేసింది’ భారత క్రికెటర్ హనుమ విహారి పేరు కూడా వేలంలో వినిపించకపోవడం దురదృష్టకరం. ఎంతో మంది అనామకులకు లీగ్‌లో అవకాశం దక్కిన చోట భారత టెస్టు జట్టు సభ్యుడికి కనీసం అవకాశం లభించకపోవడం నన్ను చాలా బాధపెట్టింది. ఫ్రాంచైజీలు ఏం ఆలోచించాయో తెలీదు. ఏదో ఒక జట్టుకు ఎంపికవుతాడని నేను ఊహించిన దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ టాప్ స్కోరర్ తన్మయ్ అగర్వాల్‌ను కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. ప్రతిభ గల ఆంధ్ర క్రికెటర్లు రికీ భుయ్, స్టీఫెన్, పృథ్వీరాజ్లకు కూడా అవకాశం దక్కకపోవడం నిరాశ కలిగించింది. –ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ చీఫ్ సెలక్టర్ -
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్..లీగ్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఊహించని ఈ పరిణామంతో జట్టు యాజమాన్యంతో సహా సన్‌రైజర్స్ అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కరోనా నేపథ్యంలో బయో బబుల్‌లో ఉండటం కష్టంగా భావించిన మిచెల్ మార్ష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి తెలియజేశాడని సమాచారం. ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్‌లో ఉండాల్సి ఉంది. దీన్ని కష్టంగా భావించిన ఆయన లీగ్ నుంచి తప్పుకున్నాడు. మార్ష్.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2020 వేలంలో సన్‌రైజర్స్ అతన్ని కనీస ధర రూ.2 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. కాగా, మిచెల్ మార్ష్ స్థానంలో ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్‌ని తీసుకునేందుకు సన్‌రైజర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాయ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో వేళంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇదిలా ఉండగా కెప్టెన్ వార్నర్ త్వరలో జట్టుతో కలువనుండగా, స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రాకపై ఇంకా స్పష్టత లేదు. ఏప్రిల్ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోలకతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: పుజారా ఆన్ ఫైర్.. సిక్సర్లు బాదుతున్న నయా వాల్ -
‘బుట్టబొమ్మ’కు ఆడిపాడిన వార్నర్ సేన
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి మ్యాచ్ ముంబైతో తలపడిన విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలువాల్సిన ఈ ఆటలో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది. అయితే తమ జట్టు విజయాల క్రెడిట్ ఫ్రాంచైజీ యజమానులదేనని, ఫలితాలతో సంబంధం లేకుండా అండగా నిలవడంతోనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. చదవండి: ముంబై చిత్తు: ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్ ప్రస్తుతం వార్నర్ సేన సన్‌రైజర్స్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో జట్టు సభ్యులంతా టాలీవుడ్లో సెన్సేషన్ హిట్ సాధించిన ‘బుట్ట బొమ్మ’ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది ఈ వీడియోలో వార్నర్, మిగిలిన వారంతా బుట్టబొమ్మ మార్కు స్టెప్పును అచ్చంగా దించేశారు. ఆరెంజ్ ఆర్మీ అంతా కలిసి ఆడి పాడుతూ ఆనందంలో తేలియాడారు. ఇక డేవిడ్ వార్నర్ బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. లాక్డౌన్ సమయంలో టిక్‌టాక్‌లో తన కుటుంబంతో కలిసి పలు తెలుగు పాటలకు కాలు కదిపారు. ఇందులో మైండ్ బ్లాక్, రాములో రాముల, బుట్ట బొమ్మ పాటలు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. చదవండి: వార్నర్.. నీ డ్యాన్స్ వీడియోలు పెట్టు: యువీ -
ఆ మాటన్నది ఇషాంతేనా!
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే సమయంలో తాను వర్ణ వివక్షకు గురయ్యానంటూ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ చేసిన వ్యాఖ్యల వివాదం ముదిరింది. 2013–14 సీజన్లలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు సహచర ఆటగాళ్లు తనను ‘కాలూ’ (నల్లోడు) అంటూ పిలిచారని, అప్పట్లో దాని అర్థం తనకు తెలీదన్న స్యామీ... ఇప్పుడు వారంతా తనకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాడు. పాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను బట్టి చూస్తే ఈ మాటలన్నది భారత పేసర్ ఇషాంత్ శర్మ అని తెలుస్తోంది. సహచరులతో కలిసి దిగిన నాటి ఫోటోలో ఇషాంత్... ‘నేను, భువీ, కాలూ, గన్ సన్‌రైజర్ (స్టెయిన్)’ అంటూ పోస్ట్ చేశాడు. ‘నన్ను అప్పట్లో ఆ మాట ఎవరెవరు అన్నారో వారందరూ నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీలో చాలా మంది దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది. ఇతర సోషల్ మీడియా కూడా ఉంది. మీరేం అన్నారో మీకు తెలుసు. రంగు గురించి మాట్లాడటం అంటే అది ఏ రూపంలోనైనా వివక్షగానే భావించాలి. నేను చాలా బాధపడుతున్నాను. వేర్వేరు జట్లకు ఆడిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించి నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అందరినీ నా సోదరుల్లా భావించాను. ఈ అంశంలో మీరు నాకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు. విండీస్ ఆటగాడి ఆరోపణలపై ఇషాంత్ గానీ, సన్‌రైజర్స్ యాజమాన్యం గానీ స్పందించలేదు. -
ఆలస్యంగా తేరుకున్న మనీశ్‌పాండే..
గత నాలుగేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. ఈ నాలుగేళ్లలోనూ ప్లే ఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్ ఒకసారి టైటిల్‌ను గెలవడంతో పాటు మరోసారి రన్నరప్‌గా నిలిచింది. అదృష్టం కలిసిరావడంతో ఈసారి కూడా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకున్న సన్ జట్టు రాణించలేకపోయింది. బ్యాట్స్‌మన్, బౌలర్లు కీలక సమయంలో చేతులెత్తేయడంతో ఎలిమినేటర్స్తోనే లీగ్‌లో తన ప్రయాణాన్ని ముగించింది. అంతంతమాత్రంగానే ఉన్న బ్యాటింగ్ లైనప్‌తో సన్ ఇక్కడివరకు చేరడంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ ప్రధాన పాత్ర పోషించారు. వీరితో పాటు ఈ సీజన్లో హైదరాబాద్ ప్రదర్శనను ప్రభావితం చేసిన అంశాలను కూలంకషంగా పరిశీలిద్దాం... వార్నర్, బెయిర్‌స్టోనే వెన్నెముక ఎలిమినేటర్స్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడటం హైదరాబాద్ యాజమాన్యాన్ని తీవ్రంగా బాధించి ఉండవచ్చు. ఎందుకంటే అదృష్టవశాత్తు ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకున్న హైదరాబాద్ తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. లీగ్ చరిత్రలోనే కేవలం 12 పాయింట్లతో ఒక జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడం ఇదే తొలిసారి. మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా కేవలం ఆరు విజయాలే సాధించినప్పటికీ హైదరాబాద్‌కు అది సాధ్యమైంది. దీనికి కారణం వార్నర్, బెయిర్ స్టో జోడీ. సన్ సాధించిన మొత్తం పరుగుల్లో వీరిద్దరి వాటానే 61 శాతం కావడం జట్టు విజయాల్లో వీరి పాత్రను చూపిస్తోంది. వీరిద్దరూ ప్రపంచకప్ కోసం తమ దేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత సన్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకోలేకపోయింది. భాగస్వామ్యమే నిలిపింది సన్‌రైజర్స్ సాధించిన విజయాలన్నీ వార్నర్– బెయిర్ స్టో అద్భుత భాగస్వామ్యాల కారణంగా వచ్చినవే. లీగ్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 100కు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఈ జంట జట్టు విజయానికి బాటలు వేసింది. ఇందులో బెంగళూరుపై 185 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా ఉంది. ఈ సీజన్లో వీరిద్దరూ జంటగా 10 ఇన్నింగ్స్‌లలో 791 పరుగుల్ని జోడించారు. ఐపీఎల్లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా... టి20ల చరిత్రలో మూడో రికార్డు భాగస్వామ్యంగా నిలిచింది. ఈ సీజన్లో వార్నర్ 692 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానంలో ఉండగా... బెయిర్ స్టో 445 పరుగులతో పదో స్థానంలో నిలిచాడు. రషీద్ మాయాజాలం సన్‌రైజర్స్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన మరో ఆటగాడు రషీద్ ఖాన్. గతేడాదితో పోలిస్తే రషీద్ ఈ సీజన్లో రాణించలేదనేది పలువురి అభిప్రాయం. అయితే గణాంకాలు మాత్రం ఇది నిజం కాదంటున్నాయి. గతంతో పోలిస్తే వికెట్లు తీయడంలో వెనుకబడినప్పటికీ ఈసారి అతను మరింత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈసీజన్లో 6.28 ఎకానమీతో 17 వికెట్లను రషీద్ దక్కించుకున్నాడు. 2018లో 21 వికెట్లు తీసిన రషీద్ 6.73 ఎకానమీని నమోదు చేశాడు. నిజం చెప్పాలంటే రషీద్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తెలివిగా వ్యవహరించడం వల్లే అతని ప్రదర్శన కాస్త వెనకబడినట్లుగా సగటు ప్రేక్షకునికి అనిపిస్తోంది. ఈ మిస్టరీ బౌలర్ బౌలింగ్‌లో పరుగులు సాధించడం కంటే వికెట్‌ను కాపాడుకోవడానికే బ్యాట్స్‌మెన్ మొగ్గుచూపడంతో ఈసారి రషీద్ వికెట్ల సంఖ్య తగ్గింది. ఆలస్యంగా తేరుకున్న మనీశ్‌పాండే ప్రారంభ మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకోని ఆల్‌రౌండర్ మనీశ్ పాండే... లీగ్ చివరి దశలో ఫామ్‌లోకి వచ్చాడు. బెయిర్ స్టో జట్టుకు దూరమయ్యాక వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పాండే విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. విజయ్ శంకర్ పరిస్థితి దీనికి భిన్నం. లీగ్ ఆరంభ మ్యాచ్‌ల్లో కొంత మెరుగ్గా ఆడిన విజయ్ శంకర్ కీలక మ్యాచ్‌ల్లో రాణించలేకపోయాడు. కేవలం 126.42 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు సాధించాడు. కేన్ విలియమ్సన్ ఒకటీఅరా మ్యాచ్‌ల్లో మినహా మునుపటి మెరుపులు మెరిపించలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్నా అతను తన ధాటిని ప్రదర్శించలేకపోయాడు. దీంతో ఓపెనింగ్ నుంచి తప్పుకుని వేరే స్థానంలో బరిలో దిగినా మెప్పించలేకపోయాడు. గతేడాది ఓపెనర్‌గా ఆడిన విలియమ్సన్ టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు జట్టును రన్నరప్‌గా నిలిపాడు. రాణించని ఐదో బౌలర్ అఫ్గాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, మొహ్మమద్ నబీ... పేసర్లలో భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ తమ అద్భుత ప్రదర్శనలు నమోదు చేశారు. కానీ ఐదో బౌలర్‌గా తమకు వచ్చిన అవకాశాలను సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బాసిల్ థంపి సమర్థంగా వినియోగించుకోలేకపోయారు. ఓవర్‌కు 8 పరుగులకు మించి ఇస్తూ ప్రత్యర్థికి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మిడిలార్డర్ సమస్య సన్‌రైజర్స్‌ను సీజన్ ఆసాంతం వేధించిన సమస్య మిడిలార్డర్ వైఫల్యం. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ అయిన మనీశ్ పాండే, విజయ్ శంకర్ మిడిలార్డర్లో రాణించలేకపోయారు. నం.3 స్థానంలో వీరిద్దరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. యూసుఫ్ పఠాన్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 40 పరుగులు... దీపక్ హుడా 11 మ్యాచ్‌ల్లో 64 పరుగులతో చెత్త ప్రదర్శనను కనబరిచారు. చాలా ఆలస్యంగా అభిషేక్ శర్మను ఆడించినా అతనికి ఎక్కువ అవకాశాల్లేక కుదురుకోలేకపోయాడు. మిడిలార్డర్లో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ లేకపోవడం సన్ను దెబ్బతీసింది. మొహమ్మద్ నబీ 8 మ్యాచ్‌లలో 6.65 ఎకానమీతోనే పరుగులు ఇవ్వడంతో పాటు 151.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించి ఈ సీజన్లో రైజర్స్ ‘స్టార్’గా నిలిచాడు. -
'ఫైనల్' నీదా... నాదా?
సన్‌రైజర్స్ హైదరాబాద్... లీగ్‌కు ముందే నాయకుడు దూరమై డీలా... కొత్త సారథి ఎలా నడిపిస్తాడోనని ఆందోళన... అంతంతమాత్రం బ్యాటింగ్ లైనప్‌పై బెంగ... బౌలర్ల సామర్థ్యంపై భారంవేసి బరిలో దిగింది..! చెన్నై సూపర్‌కింగ్స్... రెండేళ్ల నిషేధం వీడి పునరాగమనం... ‘సీనియర్ల’ జట్టంటూ వ్యంగ్యాస్త్రాలు... ఒక్క మ్యాచ్‌కే దూరమైన సొంత మైదానం... వెయ్యేనుగుల బలమైన కెప్టెన్‌పైనే భరోసా ఉంచింది! ముంబై: ఐపీఎల్–11 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్, సూపర్ కింగ్స్ రెండింటి పయనంపై అనుమానాలు, అనిశ్చితి. అయితే, వాటిని లీగ్ ప్రారంభం నుంచే పటాపంచలు చేస్తూ రెండు జట్లు పోటీకి ఎదురొడ్డాయి. కఠిన పరిస్థితులను తట్టుకుని టాప్–2లో నిలిచాయి. స్వల్ప స్కోర్లే చేసినా కట్టుదిట్టంగా బంతులేసే భీకర బౌలింగ్ దళం హైదరాబాద్‌ను గెలిపించగా, ఎంతటి భారీ లక్ష్యాన్నైనా కొట్టిపడేసే దుర్బేధ్యమైన బ్యాటింగ్ బలగం చెన్నైని ముందుకు నడిపించింది. మంగళవారం ముంబైలోని వాంఖెడేలో జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను బంతికి, బ్యాట్‌కు మధ్య సిసలైన సమరంగా పేర్కొనవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్ రూపంలో ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు మరో అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాలేమిటి? బలహీనతలేమిటి? అని విశ్లేషిస్తే...! దుమ్మురేపే బ్యాటింగ్ దన్నుగా... బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు, బౌలింగ్ ఆల్‌రౌండర్లతో ఆడుతున్నది పదకొండు మందా..? లేక పదముగ్గురా? అన్నట్లుంటుంది చెన్నైను చూస్తే. ఆదివారం పంజాబ్‌పై మ్యాచ్‌లో పేసర్ దీపక్ చహర్ ఇన్నింగ్సే ఇందుకో ఉదాహరణ. జట్టుగానే అత్యంత పటిష్ఠం అనుకుంటే... దానికి కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యూహాలు తోడైతే తిరుగేముంటుంది? ఓపెనర్లు వాట్సన్, అంబటి రాయుడు తిరుగులేని ఫామ్‌లో ఉండగా, రైనా సరైన సమయంలో జోరందుకున్నాడు. బిల్లింగ్స్, ధోని, బ్రేవోలతో మిడిలార్డర్ నిండుగా కనిపిస్తోంది. జడేజా, హర్భజన్‌ల స్పిన్, చహర్, శార్దుల్ ఠాకూర్, ఇన్‌గిడిల పేస్‌ను తట్టుకోవడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. అయితే, బ్యాట్స్‌మన్‌గా డు ప్లెసిస్, బిల్లింగ్స్‌లో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఈ ఒక్కటి తప్ప మిగతా పేర్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. దీనికి తగ్గట్లే క్వాలిఫయర్స్‌కు సన్నాహకమా? అన్నట్లు చివరి లీగ్ మ్యాచ్‌లో వనరులన్నింటినీ పరీక్షించుకుని సంసిద్ధమైంది సూపర్ కింగ్స్. బలాబలాల రీత్యా సమంగా కనిపిస్తున్నా, పెద్దగా లోపాలు లేనందున చెన్నై వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. కట్టిపడేసే బౌలింగ్ తోడుగా... జట్టుగా అంత బలంగా కనిపించకున్నా, మైదానంలో అనూహ్య ప్రదర్శనతో నెగ్గుకొచ్చింది సన్‌రైజర్స్. మిగతా జట్లు ప్లే ఆఫ్స్ చేరేందుకే ఆపసోపాలు పడుతుంటే... చివరి మూడు లీగ్ మ్యాచ్‌లలో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి అర్హత సాధించడం హైదరాబాద్ సత్తాను చాటుతోంది. ఈ ఘనతంతా బ్యాటింగ్‌లో చుక్కల్లో చంద్రుడిలా నిలిచిన కెప్టెన్ విలియమ్సన్కు, బౌలింగ్‌లో ప్రత్యర్థులను కట్టిపడేసిన పేసర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, స్పిన్నర్లు రషీద్ ఖాన్, షకీబ్ హసన్లదే. అద్భుత ఇన్నింగ్స్‌లతో తనలోని మరో కోణాన్ని చూపిన విలియమ్సన్కు... బ్యాటింగ్ కంటే జట్టు బౌలింగ్ వనరులే పెద్ద బలం. అయితే, అన్ని రంగాల్లోనూ రాణిస్తేనే చెన్నైలాంటి ప్రత్యర్థిని ఓడించగలదు. కీలక మ్యాచ్ కాబట్టి శిఖర్ ధావన్‌కు తోడుగా హేల్స్‌ను ఓపెనింగ్‌కు పంపే అవకాశం ఉంది. మిడిలార్డర్ మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తోంది. మనీశ్‌పాండే నుంచి మెరుపుల్లేకపోగా, యూసుఫ్ పఠాన్ ఫామ్ సరేసరి అన్నట్లుంది. దీంతో భారమంతా టాప్ ఆర్డర్‌దే అవుతోంది. షకీబ్ లోటును కొంత తీరుస్తున్నా అది అన్నిసార్లు కుదరదు. వికెట్ కీపర్ గోస్వామిని మిడిలార్డర్లో దింపితే ప్రయోజనం ఉండొచ్చు. చివరి మూడు మ్యాచ్‌ల వైఫల్యాలను సరిదిద్దుకుంటే భువీ ఆధ్వర్యంలోని బౌలింగ్ బృందం ప్రత్యర్థికి కొరకరాని కొయ్య కావడం ఖాయం. తుది జట్లు (అంచనా) చెన్నై: ధోని (కెప్టెన్), రైనా, రాయుడు, వాట్సన్, బిల్లింగ్స్/డు ప్లెసిస్, బ్రేవో, జడేజా, హర్భజన్, చహర్, శార్దుల్, ఇన్‌గిడి. హైదరాబాద్: విలియమ్సన్ (కెప్టెన్), ధావన్, హేల్స్/బ్రాత్‌వైట్, మనీశ్ పాండే, గోస్వామి, యూసుఫ్ పఠాన్, షకీబ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్. ►ఐపీఎల్–11లో 4 శతకాలు నమోదైతే మూడు సన్‌రైజర్స్‌పైనే వచ్చాయి. ఇందులో రెండు చెన్నై ఓపెనర్లు వాట్సన్, రాయుడు చేసినవే. ►అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ రేసులో విలియమ్సన్ (661) రెండో స్థానంలో ఉండగా, అతడిని అందుకునే అవకాశం రాయుడి (586)కి మాత్రమే ఉంది. ►రెండు జట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సిద్ధార్థ్ కౌల్ (17) కాగా, రషీద్ ఖాన్ (16) తర్వాత ఉన్నాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ (14) ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. ► పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు లీగ్ విజేత కావడం రెండుసార్లు మాత్రమే జరిగింది. 2008లో రాజస్తాన్, 2017లో ముంబై ఈ ఘనత సాధించాయి. ►ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్‌పై చెన్నైదే గెలుపు. రాయుడు (79, 100 నాటౌట్) రెండుసార్లూ మెరిశాడు. -
సందడి చేసిన సన్‌రైజర్స్
-
‘సన్‌రైజర్స్’లో చిలిపి చేష్టలు ఎవరివి?
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు బంజారాహిల్స్‌లోని సెంట్రో షోరూమ్‌లో సందడి చేశారు. క్రికెటర్లు భువనేశ్వర్, మనీశ్ పాండే, అలెక్స్ హేల్స్ శనివారం 30 మంది వర్ధమాన క్రీడాకారులతో ముచ్చటించారు. ‘జస్ట్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు చిన్నారులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ఆటగాళ్లను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. క్రికెట్ ఆడకపోయి ఉంటే ఏం చేసేవారని ఓ చిన్నారి భువనేశ్వర్ కుమార్‌ను ప్రశ్నించగా... తాను ఆర్మీలో చేరేవాడినని అతను తెలిపాడు. మిగతా ప్రశ్నలకు సమాధానమిస్తూ భువీ ‘క్రీడాకారులుగానే కాకుండా జీవితంలో ఎదగాలంటే కష్టపడేతత్వం ఉండాలి. శ్రమిస్తేనే ఏదైనా సాధించగలం. నాకే కాదు ప్రతీ క్రికెటర్‌కు సచిన్ టెండూల్కరే మార్గదర్శి’ అని చెప్పాడు. తన 13వ ఏటనే క్రికెట్లోకి అడుగుపెట్టానన్న భువీ... అండర్–19లో ఆడుతున్నప్పుడే భారత జట్టుకు ఆడతాననే నమ్మకం కలిగిందని గుర్తుచేసుకున్నాడు. సన్‌రైజర్స్ జట్టులో చిలిపి చేష్టలు ఎవరు చేస్తారని మరో చిన్నారి ప్రశ్నించగా, బిపుల్ శర్మ కామెడీ బాగా చేస్తాడని, అందరినీ ఆటపట్టిస్తుంటాడని మనీశ్ పాండే సమాధానమిచ్చాడు. -
సన్‌రైజర్స్‌దే విజయం
-
సన్‌రైజర్స్‌దే విజయం
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. రాజస్తాన్ రాయల్స్ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 15.5 ఓవర్లలోనే ఛేదించింది. శిఖర్ ధావన్(77 నాటౌట్; 13ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్(36 నాటౌట్; 3ఫోర్లు,1సిక్స్) సమయోచితంగా ఆడటంతో సన్‌రైజర్స్ సునాయాసంగా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 125 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను అజింక్యా రహానే, డీఆర్సీ షార్ట్‌లు ఆరంభించగా వారికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డీ ఆర్సీ షార్ట్(4) నిరాశపరిచడంతో రాజస్తాన్ ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కేన్ విలియమ్సన్ రనౌట్ చేయడంతో డీ ఆర్సీ షార్ట్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. అటు తర్వాత రహానే-సంజూ సామ్సన్ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకుంది. అయితే జట్టు స్కోరు 52 పరుగుల వద్ద రహానే(13) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెన్ స్టోక్స్(5) కూడా పెవిలియన్ బాట పట్టడంతో రాజస్తాన్ 63 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సామ్సన్(49; 42 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో రాజస్తాన్ తిరిగి తేరుకుంది. సామ్సన్ పరుగు దూరంలో హాఫ్ సెంచరీని కోల్పోయిన తర్వాత మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. రాహుల్ త్రిపాఠి(17), శ్రేయస్ గోపాల్(18)లు మాత్రమే సామ్సన్ తర్వాత అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లు. దాంతో 126 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే రాజస్తాన్ నిర్దేశించింది. సన్ రైజర్స్ బౌలర్లలో సిద్ధార్ధ్ కౌల్, షకిబుల్ హసన్ చెరో రెండు వికెట్ల తీసి ఆకట్టుకోగా, భువనేశ్వర్ కుమార్, బిల్లీ స్టాన్లేక్, రషీద్ ఖాన్లు తలో వికెట్ తీశారు. -
బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో సన్‌రైజర్స్ అదుర్స్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో అదుర్స్ అనిపించింది. టాస్ ఓడి తొలుత రాజస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రైజర్స్.. అందుకు తగ్గట్టుగానే రాణించింది. రాజస్తాన్ రాయల్స్‌ను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసి భారీగా పరుగులు చేయకుండా నియంత్రించింది. సన్ రైజర్స్ బౌలర్లలో సిద్ధార్ధ్ కౌల్, షకిబుల్ హసన్ చెరో రెండు వికెట్ల తీసి ఆకట్టుకోగా, భువనేశ్వర్ కుమార్, బిల్లీ స్టాన్లేక్, రషీద్ ఖాన్లు తలో వికెట్ తీశారు. అయితే సన్ రైజర్స్ బౌలింగ్ విభాగాన్ని పంచుకున్న ఐదుగురు బౌలర్లూ 30 పరుగులు మించకుండా బౌలింగ్ వేయడం మ్యాచ్‌లో విశేషం. మరొకవైపు రెండు రనౌట్లు చేసి ఫీల్డింగ్‌లో సన్‌రైజర్స్ సత్తాచాటింది. దాంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 125 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను అజింక్యా రహానే, డీఆర్సీ షార్ట్‌లు ఆరంభించగా వారికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డీ ఆర్సీ షార్ట్(4) నిరాశపరిచడంతో రాజస్తాన్ ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కేన్ విలియమ్సన్ రనౌట్ చేయడంతో డీ ఆర్సీ షార్ట్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. అటు తర్వాత రహానే-సంజూ సామ్సన్ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకుంది. అయితే జట్టు స్కోరు 52 పరుగుల వద్ద రహానే(13) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెన్ స్టోక్స్(5) కూడా పెవిలియన్ బాట పట్టడంతో రాజస్తాన్ 63 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సామ్సన్(49; 42 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో రాజస్తాన్ తిరిగి తేరుకుంది. సామ్సన్ పరుగు దూరంలో హాఫ్ సెంచరీని కోల్పోయిన తర్వాత మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. రాహుల్ త్రిపాఠి(17), శ్రేయస్ గోపాల్(18)లు మాత్రమే సామ్సన్ తర్వాత అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లు. దాంతో 126 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే రాజస్తాన్ నిర్దేశించింది. -
వైరల్ వీడియో: ధావన్ సర్ప్రైజ్
టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటాడు. ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న తన కొడుకు జోరావర్ స్కూల్‌ను సందర్శించిన ధావన్ సర్ప్రైజ్ చేశాడు. మరొకవైపు తన ఇద్దరి కూతుళ్లు వెళుతున్న కారును ఆపి వారిని షాక్‌కు గురి చేశాడు. ఇదంతా వీడియోలో రికార్డు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. తనను చూసిన తర్వాత పిల్లలకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ పేర్కొన్న ధావన్.. ఇక సమయం వృథా చేయకుండా వారం రోజులు కుటుంబంతో సంతోషంగా గడపాలి అంటూ పోస్టులో తెలిపాడు. తాజాగా అతను పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మంచి బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. మంచి భర్త, తండ్రి అని అందరిచే కితాబులు అందుకున్న ధావన్ తాజా వీడియో అభిమానుల హృదయాలు హత్తుకునేలా ఉంది. శిఖర్ ధావన్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వచ్చే వారం ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకు ముందు కుటుంబంతో సేద తీరాలనే ఉద్దేశంతో ధావన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో గడుపుతున్నాడు. -
శిఖర్ ధావన్ సర్ప్రైజ్
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విజయం సాధించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు, హైదరాబాద్ టీమ్ అభిమానులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సన్ రైజర్స్ సరదాలు
-
సన్ రైజర్స్ కెప్టెన్‌గా వార్నర్
హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ‘కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్‌కు శుభాకాంక్షలు. బెస్టాఫ్ లక్’ అంటూ రైజర్స్ టీమ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గత సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన భారత స్టార్ ధావన్‌ను కాకుండా... వార్నర్‌ను రైజర్స్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం.