వైరల్‌ వీడియో: ధావన్‌ సర్‌ప్రైజ్‌ | Shikhar Dhawan Surprise Visit To His Kids In Australia | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: శిఖర్‌ ధావన్‌ సర్‌ప్రైజ్‌

Published Thu, Mar 29 2018 4:04 PM | Last Updated on Thu, Mar 29 2018 4:04 PM

Shikhar Dhawan Surprise Visit To His Kids In Australia - Sakshi

టీమిండియా డాషింగ్ ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ క్రికెట్‌ మైదానంలోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ తనదైన  శైలిలో అభిమానులను ఆకట్టుకుంటాడు.  ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న తన కొడుకు జోరావర్‌ స్కూల్‌ను సందర్శించిన ధావన్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. మరొకవైపు తన ఇద్దరి కూతుళ్లు వెళుతున్న కారును ఆపి వారిని షాక్‌కు గురి చేశాడు. ఇదంతా వీడియోలో రికార్డు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

తనను చూసిన తర్వాత పిల్లలకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ పేర్కొన్న ధావన్‌.. ఇక సమయం వృథా చేయకుండా వారం రోజులు కుటుంబంతో సంతోషంగా గడపాలి అంటూ పోస్టులో తెలిపాడు. తాజాగా అతను పోస్ట్‌ చేసిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. మంచి బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. మంచి భర్త, తండ్రి అని అందరిచే కితాబులు అందుకున్న ధావన్‌ తాజా వీడియో అభిమానుల హృదయాలు హత్తుకునేలా ఉంది.

శిఖర్‌ ధావన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వచ్చే వారం ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకు ముందు కుటుంబంతో సేద తీరాలనే ఉద్దేశంతో ధావన్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో గడుపుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement