దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి మ్యాచ్ ముంబైతో తలపడిన విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలువాల్సిన ఈ ఆటలో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది. అయితే తమ జట్టు విజయాల క్రెడిట్ ఫ్రాంచైజీ యజమానులదేనని, ఫలితాలతో సంబంధం లేకుండా అండగా నిలవడంతోనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. చదవండి: ముంబై చిత్తు: ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్
ప్రస్తుతం వార్నర్ సేన సన్‌రైజర్స్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో జట్టు సభ్యులంతా టాలీవుడ్‌లో సెన్సేషన్ హిట్ సాధించిన ‘బుట్ట బొమ్మ’ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది ఈ వీడియోలో వార్నర్, మిగిలిన వారంతా బుట్టబొమ్మ మార్కు స్టెప్పును అచ్చంగా దించేశారు. ఆరెంజ్ ఆర్మీ అంతా కలిసి ఆడి పాడుతూ ఆనందంలో తేలియాడారు. ఇక డేవిడ్ వార్నర్ బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. లాక్‌డౌన్ సమయంలో టిక్‌టాక్‌లో తన కుటుంబంతో కలిసి పలు తెలుగు పాటలకు కాలు కదిపారు. ఇందులో మైండ్ బ్లాక్, రాములో రాముల, బుట్ట బొమ్మ పాటలు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. చదవండి: వార్నర్.. నీ డ్యాన్స్ వీడియోలు పెట్టు: యువీ
Comments
Please login to add a commentAdd a comment