టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటాడు. ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న తన కొడుకు జోరావర్ స్కూల్‌ను సందర్శించిన ధావన్ సర్‌ప్రైజ్ చేశాడు. మరొకవైపు తన ఇద్దరి కూతుళ్లు వెళుతున్న కారును ఆపి వారిని షాక్‌కు గురి చేశాడు. ఇదంతా వీడియోలో రికార్డు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.