టీమిండియా వ్యూహం ఫలించింది..
ముంబై: వెస్టిండీస్తో టి-20 ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియా వ్యూహం ఫలించింది. ఈ టోర్నీలో రాణించలేకపోతున్న ఓపెనర్ శిఖర్ ధవన్ను పక్కనబెట్టి అతని స్థానంలో అజింక్యా రహానెను తుది జట్టులోకి తీసుకోవడం సత్ఫలితాన్నిచ్చింది.
ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానె శుభారంభాన్నందించారు. రోహిత్, రహానె తొలి వికెట్కు 62 పరుగులు జోడించారు. కాగా 31 బంతుల్లో మూడేసి ఫోర్లు, సిక్సర్లతో హాఫ్ సెంచరీకి చేరువవుతున్న రోహిత్ (43).. బద్రీ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇక రహానె తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రహానె భారీ షాట్లకు ప్రయత్నించకున్నా.. రోహిత్కు, ఆ తర్వాత కోహ్లీకి అండగా ఉంటూ వేగంగా పరుగులు రాబట్టాడు. రహానె 35 బంతుల్లో 40 పరుగులు చేశాడు.