బెంగళూరు: టీమిండియా ఆటగాడు, కర్ణాటక బ్యాట్స్ మన్ మనీశ్ పాండే త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. సినీ నటి అశ్రిత షెట్టిని అతను వివాహం చేసుకోనున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 2న వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. ముంబైకి చెందిన అశ్రిత(26) 2012లో తుళు భాషలో నిర్మితమైన ‘తెళికెద బొల్లి’ద్వారా తెరంగేట్రం చేసింది. అనంతరం ఉదయం ఎన్‌హెచ్ 4 ద్వారా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. తమిళంలోనే ‘ఒరు కన్నియమ్ మూను కలవానికుళుమ్’, ‘ఇంద్రజిత్’ సినిమాల్లోనూ నటించింది. కాగా, మనీశ్ పాండే ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకకు సారథ్యం వహిస్తున్నాడు. మనీశ్–అశ్రిత పెళ్లి అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment