క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) ప్రారంభం కావాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. టాస్ కూడా సాధ్యపడలేదు. తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ప్రకటించారు. బెంగళూరులో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో కవర్లు తీసేందుకు కూడా సాధ్యపడలేదు.
చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ వర్షం ఆగితే ఏమైనా చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు చేసేదేమీ లేక తొలి రోజు ఆటను రద్దు చేశారు. రేపు కూడా ఇదే పరస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందో లేక పేలవమైన డ్రాగా ముగుస్తుందో వేచి చూడాలి.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో (అక్టోబర్ 24-28).. మూడో టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో (నవంబర్ 1-5) జరుగనున్నాయి.
చదవండి: అరంగేట్రం బ్యాటర్ సెంచరీ.. 366 పరుగులకు ఆలౌటైన పాక్
Comments
Please login to add a commentAdd a comment