విజృంభించిన మనీశ్‌ పాండే.. రాణించిన కరుణ్‌ నాయర్‌ | Maharaja Trophy KSCA T20 2023: Hubli Tigers Beat Mysuru Warriors To Win Title - Sakshi
Sakshi News home page

విజృంభించిన మనీశ్‌ పాండే.. రాణించిన కరుణ్‌ నాయర్‌

Published Tue, Aug 29 2023 9:35 PM | Last Updated on Wed, Aug 30 2023 9:34 AM

Maharaja Trophy KSCA T20 2023: Hubli Tigers Wins The Title By Beating Mysore Warriors In Finals - Sakshi

కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన మహారాజా టీ20 ట్రోఫీ-2023ని హుబ్లీ టైగర్స్‌ గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్‌ 29) జరిగిన ఫైనల్స్‌లో టైగర్స్‌ టీమ్‌..  మైసూర్‌ వారియర్స్‌ను 8 పరుగుల తేడాతో ఓడించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హుబ్లీ టైగర్స్‌.. మొహమ్మద్‌ తాహా (40 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మనీశ్‌ పాండే (23 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 

టైగర్స్‌ ఇన్నింగ్స్‌లో తాహా, మనీశ్‌లతో పాటు కృష్ణణ్‌ శ్రీజిత్‌ (31 బంతుల్లో 38; 5 ఫోర్లు), మాన్వంత్‌ కుమార్‌ (5 బంతుల్లో 14; 2 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మైసూర్‌ వారియర్స్‌ బౌలర్లలో కార్తీక్‌ 2, మోనిస్‌ రెడ్డి, సుచిత్‌, కుషాల్‌ వధ్వాని తలో వికెట్‌ పడగొట్టారు.  

204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మైసూర్‌ వారియర్స్‌.. ఇన్నింగ్స్‌ ఆరంభంలో రవికుమార్‌ సమర్థ్‌ (35 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్‌ నాయర్‌ (20 బంతుల్లో 37; 6 ఫోర్లు) ధాటిగా ఆడటంతో సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారు.

అయితే ఆఖర్లో హుబ్లీ టైగర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మైసూర్‌ వారియర్స్‌ నిర్ణీత ఓవర్లలో 195 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. హుబ్లీ బౌలర్లలో మాన్వంత్‌ కుమార్‌ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్‌ కావేరప్ప 2, మిత్రకాంత్‌, కరియప్ప చెరో 2 వికెట్లు పడగొట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement