రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. దేవ్‌దత్ పడిక్కల్, మనీశ్ పాండే శతకాల మోత మోగించారు. పడిక్కల్ 216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 193 పరుగుల భారీ శతకం బాదగా.. మనీశ్ పాండే సైతం మెరుపు శతకంతో (165 బంతుల్లో 118; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వీరిద్దరికి తోడు శ్రీనివాస్ శరత్ (76) కూడా రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసి, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
కర్ణాటక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా.. ఓపెనర్ ఆర్ సమర్థ్ 38, నికిన్ జోస్ 8, శుభంగ్ హేగ్డే 27, విజయ్ కుమార్ వైశాఖ్ 19, రోహిత్ కుమార్ 22 నాటౌట్, విధ్వత్ కవేరప్ప 4 నాటౌట్ పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రేరిత్ దత్, నమన్ ధిర్ తలో 2 వికెట్లు, సిదార్థ్ కౌల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ సైతం పరుగుల వరద పారిస్తుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (85), ప్రభసిమ్రన్ సింగ్ (83) శతకాల దిశగా సాగుతున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి పంజాబ్ స్కోర్ 169/0గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment