Ashrita Shetty: విరాట్ కోహ్లి- అనుష్క శర్మ, యువరాజ్ సింగ్- హాజిల్‌కీచ్, హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్, కేఎల్ రాహుల్- అతియా శెట్టి.. హర్భజన్ సింగ్- గీతా బస్రా, జహీర్ ఖాన్- సాగరిక ఘట్కే... గత దశాబ్దకాలంలో పెళ్లితో ఒక్కటైన క్రికెట్- సినీ సెలబ్రిటీల్లో ముందు వరుసలో ఉంటారు.
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగోర్ నుంచి నేటి దాకా ఇలా క్రికెట్- సినీ రంగాలను ప్రేమతో ముడివేసిన జంటలెన్నో ఉన్నాయి. వారిలో మనీశ్ పాండే- ఆశ్రిత షెట్టి కూడా ఉన్నారన్న సంగతి కొంత మందికి మాత్రమే తెలుసు.
నైనిటాల్ అబ్బాయి
ఉత్తరాఖండ్‌కు చెందిన మనీశ్ పాండే 2015లో జింబాబ్వేతో వన్డే ద్వారా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీ20లలోనూ అరంగేట్రం చేశాడీ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడిన మనీశ్ పాండే.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 566, 709 పరుగులు సాధించాడు.
కాగా 2021లో శ్రీలంకతో చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగిన 33 ఏళ్ల మనీశ్‌కు ఇప్పటి వరకు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉన్నాడు మనీశ్. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన అతడు క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
కర్ణాటక అమ్మాయిని ప్రేమించి
ఇక మనీశ్ పాండే వ్యక్తిగత విషయానికొస్తే... నటి, మోడల్ ఆశ్రిత శెట్టిని ప్రేమించిన అతడు 2019, డిసెంబరు 2న ఆమెను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల నడుమ నైనిటాల్ అబ్బాయి- కర్ణాటక అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా ముంబైలో విద్యనభ్యసించిన ఆశ్రిత తమిళ సినిమాలతో నటిగా గుర్తింపు పొందింది.
సిద్ధార్థ్ సినిమాలో హీరోయిన్
సిద్ధార్థ్ హీరోగా నటించిన ఉదయం ఎన్‌హెచ్14తో పాటు బుల్లెట్ బాస్య వంటి సినిమాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకుంది. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఆశ్రితకు ఇన్‌స్టాలో రెండున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పుటికప్పుడు తన ఫొటోలు, లైఫ్ అప్‌డేట్లు పంచుకుంటూ ఉంటుంది.
బర్త్‌డే విషెస్
కాగా ఆదివారం(జూలై 16) ఆశ్రిత తన ముప్పైవ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆశ్రితకు విషెస్ చెప్పడంతో పాటు మనీశ్ పాండే గురించి అడుగుతూ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టడం విశేషం. ఇక ఆశ్రిత కూడా తనకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేసింది.
చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా..
‘సెహ్వాగ్ నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’
Comments
Please login to add a commentAdd a comment