నేటినుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు | India v England, 4th Test: Injured Ajinkya Rahane out of series | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 8 2016 7:18 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

వరుసగా రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ పని పట్టిన భారత్ ఇప్పుడు సిరీస్ సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు (గురువారం) ఇక్కడి వాంఖెడే మైదానంలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు మరో గెలుపుపై పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా సిరీస్ కోహ్లి సేన సొంతమవుతుంది. మరోవైపు రాజ్‌కోట్ టెస్టు తర్వాత ఇంగ్లండ్ ఆట దిగజారింది. ఇప్పటికే భారీ తేడాతో రెండు మ్యాచ్‌లు కోల్పోయిన ఆ జట్టు, పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement