
'రెండొందల స్కోరును చేయాల్సింది'
కోల్కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఎదురైన ఓటమి తమకు ఓ గుణపాఠమని కోల్కతా నైట్ రైడర్స్ టాపార్డర్ ఆటగాడు మనీష్ పాండే స్పష్టం చేశాడు. ఆ మ్యాచ్లో 180 పరుగులకు పైగా స్కోరు నమోదు చేసినా పరాజయం చెందడం ఒకింత నిరాశకు గురి చేసిందన్నాడు. మరో 20కు పైగా పరుగులు సాధిస్తే మ్యాచ్ ఫలితం తమకు అనుకూలంగా ఉండేదన్నాడు.
'ముంబైతో మ్యాచ్లో 200 పరుగులు చేస్తామనుకున్నాం. అదే దిశగా మా బ్యాటింగ్ కూడా కొనసాగింది. అయితే కీలక సమయాల్లో వికెట్లను చేజార్చుకోవడంతో అనుకున్న పరుగులు సాధించడంలో విఫలమయ్యాం. కెప్టెన్ గౌతం గంభీర్, ఆండ్రీ రస్సెల్లు చివరి వరకూ క్రీజ్లో ఉంటే మరిన్ని పరుగులు వచ్చేవి. ఏది ఏమైనా ఈ ఓటమి మాకు ఒక గుణపాఠం. మేము మరింత పుంజుకోవడానికి నిన్నటి పరాజయం దోహదం చేస్తుంది' అని పాండే పేర్కొన్నాడు.