మనీష్ పాండే.. భారత జట్టు తరపున కంటే ఐపీఎలోనూ ఎక్కువగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఐపీఎల్-2014 సీజన్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలవడంలో పాండేది కీలక పాత్ర. ఫైనల్‌తో పాటు లీగ్ ఆసాంతం పాండే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే మళ్లీ 6 ఏళ్ల తర్వాత కేకేఆర్‌తో పాండే జతకట్టాడు.
ఐపీఎల్-2024 వేలంలో అతడిని కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ గత సీజన్లలో కోట్లు పలికిన పాండే.. ఈసారి మాత్రం రూ.50 లక్షల కనీస ధరకే అమ్ముడుపోయాడు. ఫస్ట్ రౌండ్‌లో వేలానికి వచ్చిన పాండేను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు. అనంతరం రెండో సారి వేలంలోకి వచ్చిన పాండేను కనీస ధరకు కేకేఆర్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో పాండే ఐపీఎల్ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.
ముంబైతో ఎంట్రీ..
మనీష్ పాండేను 2008 అరంగేట్ర సీజన్‌లో రూ. 6లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అనంతరం 2009 సీజన్‌లో ఈ కర్ణాటక బ్యాటర్‌ను రూ.12 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా పూణేవారియర్స్(రూ.20 లక్షలు), కేకేఆర్(రూ.1.70 కోట్లు)కు ప్రాతినిథ్యం వహించాడు.
2018 సీజన్‌కు ముందు కేకేఆర్ అతడిని విడిచిపెట్టింది. దీంతో మెగా వేలానికి వచ్చిన అతడిని రూ.11 కోట్ల భారీ ధరకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. మూడు సీజన్ల పాటు సన్‌రైజర్స్ తరపున ఆడిన మనీష్.. ఐపీఎల్-2022 మెగా వేలంలోకి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని రూ.4.60 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో ఎల్‌ఎస్‌జీ విడిచిపెట్టింది. దీంతో ఐపీఎల్-2023 వేలంలో ఢిల్లీ రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ అవకాశాన్ని కూడా పాండే సద్వినియోగపరచుకోలేకపోయాడు. ఢిల్లీ కూడా విడిచి పెట్టింది. దీంతో ఈసారి కేకేఆర్ ప్రాంఛైజీలో చేరాడు. మరి ఈసారి ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. ఇప్పటివరకు 178 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పాండే.. 3808 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది.
చదవండి: IPL 2024: టెన్త్ క్లాస్‌తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్?
Comments
Please login to add a commentAdd a comment