హీరోయిన్‌తో పెళ్లి.. విడాకులకు సిద్ధమైన టీమిండియా క్రికెటర్‌? | Is Manish Pandey Wife Ashrita Shetty Heading For Divorce, Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

Manish Pandey Divorce Rumours: హీరోయిన్‌తో పెళ్లి.. విడాకులకు సిద్ధమైన టీమిండియా క్రికెటర్‌?

Published Sat, Jun 22 2024 2:26 PM | Last Updated on Sat, Jun 22 2024 2:52 PM

Is Manish Pandey Wife Ashrita Shetty Heading For Divorce Rumours Goes Viral

టీమిండియా క్రికెటర్‌ మనీశ్‌ పాండే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. భార్య, కన్నడ నటి ఆశ్రిత శెట్టితో అతడికి అభిప్రాయ భేదాలు వచ్చాయి.. ఈ జంట విడాకులకు సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది.

మనీశ్‌ పాండే- ఆశ్రిత శెట్టి సోషల్‌ మీడియాలో తమ పెళ్లి ఫొటోలను తొలగించడమే ఇందుకు కారణం. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు విడాకుల విషయం నేరుగా చెప్పకుండా.. ఇలా ఫొటోలు డిలీట్‌ చేసి సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఉత్తరాఖండ్‌ అబ్బాయి-కర్ణాటక అమ్మాయి
ఈ నేపథ్యంలో మనీశ్‌- ఆశ్రితల విడాకుల గురించి నెట్టింట చర్చ మొదలైంది. కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన మనీశ్‌ పాండే 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

34 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ భారత్‌ తరఫున మొత్తంగా 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 566, 709 పరుగులు చేశాడు. మనీశ్‌ పాండేకు జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా ఐపీఎల్‌లో మాత్రం మంచి రికార్డు ఉంది.

ఇప్పటి వరకు 171 మ్యాచ్‌లు ఆడిన మనీశ్‌ పాండే 3850 పరుగులు సాధించాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ చాంపియన్‌గా నిలవడంలో తన వంతు సాయం చేశాడు.

హీరోయిన్‌గా నటిస్తూ
మరోవైపు.. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆశ్రిత శెట్టి తొలుత మోడల్‌గా రాణించింది. అనంతరం సినీ రంగంలో అడుగుపెట్టింది. తులు భాషలో ‘తెలికెడ బొల్లి’ అనే మూవీతో 2012లో నటిగా అరంగేట్రం చేసింది.

అదే విధంగా.. ఉదయం ఎన్‌హెచ్‌4(హీరోయిన్‌గా), ఒరు కన్మియుమ్‌ మూను కలావానికలుమ్‌ వంటి తమిళ సినిమాల్లో కూడా ఆశ్రిత నటించింది.

కాగా తమ తమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మనీశ్‌ పాండే- ఆశ్రిత శెట్టి కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేశారు. 2019లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎప్పటికప్పుడు తమ ఫొటోలను అభిమానులతో పంచుకునే ఈ జంట.. అకస్మాత్తుగా తమ పెళ్లి ఫొటోలు డిలీట్‌ చేసి ఇలా షాకిచ్చింది.

చదవండి: షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement