షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి | Sania Mirza Father Breaks Silence On Getting Married To Mohammed Shami Rumours | Sakshi
Sakshi News home page

షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి

Published Fri, Jun 21 2024 10:51 AM | Last Updated on Fri, Jun 21 2024 2:11 PM

Sania Mirza Father Breaks Silence On Getting Married To Mohammed Shami Rumours

భారత క్రీడా రంగంలో సానియా మీర్జా, మహ్మద్‌ షమీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. చిన్ననాటి నుంచే టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్న సానియా అంతర్జాతీయ స్థాయిలో అనేక టైటిల్స్‌ సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు.

మరోవైపు.. టీమిండియా ప్రధాన పేస్‌ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన మహ్మద్‌ షమీ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇద్దరికీ చేదు అనుభవమే
అయితే, సానియా- షమీ వృత్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. హసీన్‌ జహాన్‌ అనే మోడల్‌ను పెళ్లాడిన షమీకి ఒక కూతురు ఉంది.

కొన్నాళ్లపాటు సజావుగా సాగిన షమీ కాపురం.. హసీన్‌ సంచలన ఆరోపణల నేపథ్యంలో విచ్ఛిన్నమైంది. మరోవైపు.. పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియా మీర్జాకు కూడా చేదు అనుభవమే మిగిలింది.

సానియా కెరీరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో షోయబ్‌ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని పాక్‌ మీడియా కథనాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు గుప్పుమనగా.. నటి సనా జావెద్‌ను పెళ్లాడి.. సానియాతో తన బంధం ముగిసిపోయిందని చెప్పకనే చెప్పాడు షోయబ్‌.

ఇవన్నీ అబద్దాలు
కాగా సానియా కుటుంబం సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్‌కు పూర్తి సమయం కేటాయించి అతడి ఆలనాపాలనా చూసుకుంటూనే వృత్తిపరంగానూ బిజీ అయ్యారు.

ఇదిలా ఉంటే.. సానియా మీర్జా- మహ్మద్‌ షమీ గురించి కొన్నాళ్ల క్రితం వదంతులు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని జాతీయ మీడియా చానెళ్లలో ప్రచారం జరిగింది.

ఈ విషయంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా తాజాగా స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇవన్నీ అబద్దాలు. ఆమె కనీసం అతడిని నేరుగా ఒక్కసారి కూడా కలవనే లేదు’’ అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు.

కాగా సానియా మీర్జా హజ్‌ యాత్రకు వెళ్తున్నట్లు ఇటీవల తన సోషల్‌ మీడియా అకౌంట్లో పోస్ట్‌ చేశారు. మరోవైపు.. వన్డే ప్రపంచకప్‌-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన మహ్మద్‌ షమీ చీలమండ గాయానికి సర్జరీ చేయించుకుని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

చదవండి: రూ. 2 కోట్ల కారు.. బాబర్‌ ఆజంపై సంచలన ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement