Imran Mirza
-
షమీతో ఆమె పెళ్లి?.. స్పందించిన సానియా మీర్జా తండ్రి
భారత క్రీడా రంగంలో సానియా మీర్జా, మహ్మద్ షమీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. చిన్ననాటి నుంచే టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్న సానియా అంతర్జాతీయ స్థాయిలో అనేక టైటిల్స్ సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు.మరోవైపు.. టీమిండియా ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన మహ్మద్ షమీ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు.ఇద్దరికీ చేదు అనుభవమేఅయితే, సానియా- షమీ వృత్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. హసీన్ జహాన్ అనే మోడల్‌ను పెళ్లాడిన షమీకి ఒక కూతురు ఉంది.కొన్నాళ్లపాటు సజావుగా సాగిన షమీ కాపురం.. హసీన్ సంచలన ఆరోపణల నేపథ్యంలో విచ్ఛిన్నమైంది. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియా మీర్జాకు కూడా చేదు అనుభవమే మిగిలింది.సానియా కెరీరీర్లో బిజీగా ఉన్న సమయంలో షోయబ్ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని పాక్ మీడియా కథనాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు గుప్పుమనగా.. నటి సనా జావెద్‌ను పెళ్లాడి.. సానియాతో తన బంధం ముగిసిపోయిందని చెప్పకనే చెప్పాడు షోయబ్.ఇవన్నీ అబద్దాలుకాగా సానియా కుటుంబం సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్‌కు పూర్తి సమయం కేటాయించి అతడి ఆలనాపాలనా చూసుకుంటూనే వృత్తిపరంగానూ బిజీ అయ్యారు.ఇదిలా ఉంటే.. సానియా మీర్జా- మహ్మద్ షమీ గురించి కొన్నాళ్ల క్రితం వదంతులు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని జాతీయ మీడియా చానెళ్లలో ప్రచారం జరిగింది.ఈ విషయంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇవన్నీ అబద్దాలు. ఆమె కనీసం అతడిని నేరుగా ఒక్కసారి కూడా కలవనే లేదు’’ అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు.కాగా సానియా మీర్జా హజ్ యాత్రకు వెళ్తున్నట్లు ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. మరోవైపు.. వన్డే ప్రపంచకప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన మహ్మద్ షమీ చీలమండ గాయానికి సర్జరీ చేయించుకుని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.చదవండి: రూ. 2 కోట్ల కారు.. బాబర్ ఆజంపై సంచలన ఆరోపణలు -
సన్‌రైజర్స్ యాజమాన్యంపై సానియా మీర్జా తండ్రి ఫైర్..
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ జట్టులో స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే హైదరాబాద్ ఈ సీజన్లో ఎక్కువ విజయాలు నమోదు చేసే అవకాశాలు కనిపించట్లేదన్నాడు. సన్‌రైజర్స్ వరుస పరాజయాలపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన.. టీం మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు. తుది జట్టులో ఆడేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆటగాడు కూడా కనిపించలేదా అని ప్రశ్నించాడు. గత సీజన్లో భావనక సందీప్‌ను తీసుకున్నా.. అతనికి తుది జట్టులో ఆడే అవకాశం ఇవ్వకపోగా.. ఈ సీజన్లో ఏకంగా వదిలించుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు రాష్ట్రాల నుంచి మహ్మద్ సిరాజ్ ఆర్సీబీకి ఆడుతుంటే.. అంబటి రాయుడు, హరిశంకర్ రెడ్డి చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. అంతే కాకుండా ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా విజృంభిస్తున్న వేళ అత్యంత సురక్షితమైన హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించకపోవడం ఏంటని ఆయన నిలదీశాడు . సన్‌రైజర్స్ ఆటతీరు చూస్తుంటే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేలా కనిపించట్లేదని, దీని వల్ల సొంత అభిమానులు దూరమవుతున్నారని పేర్కొన్నాడు. ఈ విషయమై సన్‌రైజర్స్ యాజమాన్యం ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఓ దశలో 16 ఓవర్లలో 115/2 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేయడంతో హైదరాబాద్ మ్యాచ్‌ను చేజార్చుకుంది. చదవండి: అరుదైన క్లబ్లో చేరికకు వికెట్ దూరంలో.. -
ఇక సినిమా స్టార్ కూడా...
సినిమా స్టార్లకు ఏమాత్రం తీసిపోని అందం టెన్నిస్ స్టార్ సానియా మీర్జాది. ఇప్పటి వరకు టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన సానియా మీర్జా ఇక వెండితెరపైనా తన మెరుపులు మెరిపించనున్నారా? ఆ సమయం ఆసన్నమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సానియాకు టాలీవుడ్లో కంటే బాలీవుడ్లోనే ఎంతోమంది స్నేహితులున్నారు. వారి ఫంక్షన్లకు సానియా వెళ్లడం, తన ఫంక్షన్లకు వారిని ఆహ్వానించడం తెలిసిందే. సానియా సినిమా రంగ ప్రవేశం గురించి గతంలో చాలా వార్తలు వినిపించినా, ఆమె ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కానీ, తాజాగా బాలీవుడ్ దర్శక, నిర్మాత ఫర్హాన్ అక్తర్ చేసిన ట్వీట్‌కు సానియా స్పందించిన తీరు చూస్తుంటే బాలీవుడ్ ఎంట్రీకి ఈ బ్యూటీ ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ‘‘సానియా, ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జాల మధ్య అనుబంధం నేపథ్యంలో బాలీవుడ్లో ఓ సినిమా త్వరలోనే రాబోతోంది. ఇందులో సానియా, ఆమె తండ్రి కలిసి నటించబోతున్నారు’’ అని పర్హాన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు సానియా ధన్యవాదాలు చెప్పడంతో చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆ సినిమాలో నటించడం లేదంటే సానియా ‘అదేం లేదు’ అని స్పందించేవారు కదా! థ్యాంక్స్ చెప్పడంతో సానియా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం ఖాయం అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
జూలైలో సానియా జీవిత చరిత్ర
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవిత చరిత్ర పుస్తకం జూలైలో మార్కెట్లోకి రానుంది. ‘ఏస్ ఎగెనెస్ట్ ఆడ్స్’ పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ ప్రచురించింది. ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి.... ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ క్రీడాకారిణిగా ఎదిగిన వైనాన్ని సానియా ఇందులో వివరించింది. తన తండ్రి ఇమ్రాన్ మీర్జాతో కలిసి టెన్నిస్ ప్లేయర్ ఈ పుస్తకాన్ని రాసింది. జీవితంలో తాను సాధించిన విజయాలు, స్ఫూర్తిదాయక సంఘటనలు, ఆటగాళ్లతో కోర్టు బయట జరిగిన విషయాలను ఇందులో పొందుపర్చనుంది. ఈ పుస్తకం కోసం సానియాతో కలిసి పనిచేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని హార్పర్ కొలిన్స్ చీఫ్ ఎడిటర్ వీకే కార్తీకా అన్నారు. 16 ఏళ్ల వయసులో వింబుల్డన్ జూనియర్ బాలికల డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా ఆ తర్వాత భారత టెన్నిస్ నంబర్‌వన్ క్రీడాకారిణిగా ఎదిగింది. ‘వచ్చే తరం టెన్నిస్ ప్లేయర్లకు ఈ పుస్తకం ఓ రోడ్మ్యాప్లాగా ఉపయోగపడుతుందని భావి స్తున్నా. నా స్ఫూర్తితో భవిష్యత్‌లో ఒక్కరైనా గ్రాండ్‌స్లామ్ గెలిస్తే చాలు’ అని సానియా పేర్కొంది.