ఇక సినిమా స్టార్‌ కూడా... | Tennis Star Sania mirza Bollywood Entry | Sakshi
Sakshi News home page

ఇక సినిమా స్టార్‌ కూడా...

Published Tue, Jun 20 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

ఇక సినిమా స్టార్‌ కూడా...

ఇక సినిమా స్టార్‌ కూడా...

సినిమా స్టార్లకు ఏమాత్రం తీసిపోని అందం టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాది. ఇప్పటి వరకు టెన్నిస్‌ కోర్టులో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన సానియా మీర్జా ఇక వెండితెరపైనా తన మెరుపులు మెరిపించనున్నారా? ఆ సమయం ఆసన్నమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. సానియాకు టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లోనే ఎంతోమంది స్నేహితులున్నారు. వారి ఫంక్షన్లకు సానియా వెళ్లడం, తన ఫంక్షన్లకు వారిని ఆహ్వానించడం తెలిసిందే.

 సానియా సినిమా రంగ ప్రవేశం గురించి గతంలో చాలా వార్తలు వినిపించినా, ఆమె ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కానీ, తాజాగా బాలీవుడ్‌ దర్శక, నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌ చేసిన ట్వీట్‌కు సానియా స్పందించిన తీరు చూస్తుంటే బాలీవుడ్‌ ఎంట్రీకి ఈ బ్యూటీ ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ‘‘సానియా, ఆమె తండ్రి ఇమ్రాన్‌ మీర్జాల మధ్య అనుబంధం నేపథ్యంలో బాలీవుడ్‌లో ఓ సినిమా త్వరలోనే రాబోతోంది.

ఇందులో సానియా, ఆమె తండ్రి కలిసి నటించబోతున్నారు’’ అని పర్హాన్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు సానియా ధన్యవాదాలు చెప్పడంతో చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆ సినిమాలో నటించడం లేదంటే సానియా ‘అదేం లేదు’ అని స్పందించేవారు కదా! థ్యాంక్స్‌ చెప్పడంతో సానియా సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించడం ఖాయం అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement