సెమీస్‌లో కర్ణాటక | Ranji Trophy 2018/19: Manish Pandey 87* propels Karnataka to semi-final, join Kerala | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో కర్ణాటక

Published Sat, Jan 19 2019 12:24 AM | Last Updated on Sat, Jan 19 2019 12:24 AM

Ranji Trophy 2018/19: Manish Pandey 87* propels Karnataka to semi-final, join Kerala - Sakshi

బెంగళూరు: కెప్టెన్‌ మనీశ్‌ పాండే (75 బంతుల్లో 87 నాటౌట్‌; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ (129 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకాలతో మెరవడంతో మాజీ చాంపియన్‌ కర్ణాటక రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ ముగిసిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ను ఓడించింది. 184 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 45/3తో  రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక... ఆరంభంలోనే రోనిత్‌ మోరె (8) వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో మనీశ్, కరుణ్‌ దూకుడుగా ఆడారు. ఐదో వికెట్‌కు 24.5 ఓవర్లలోనే 129 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. 

సంక్షిప్త స్కోర్లు: రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 224; కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌: 263; రాజస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌: 222; కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌: 185/4. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement