ఆ జట్టుకు ధోనియే కెప్టెన్
ముంబై: టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనికి మరోసారి సారథ్య బాధ్యతలు దక్కాయి. ప్రధాన పోటీలో కాదు వార్మప్ మ్యాచ్‌లో. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ లకు సెలక్షన్ కమిటీ శుక్రవారం జట్టును ఎంపిక చేసింది. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని రెండు ఫార్మాట్లలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తో జరగనున్న మొదటి వార్మప్ మ్యాచ్ కు కెప్టెన్ గా ధోనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. భారత్ ‘ఎ’ జట్టుకు ధోని నాయకత్వం వహిస్తాడు.
టీమిండియా టెస్టు జట్టుకు నాయకుడిగా ఉన్న విరాట్ కోహ్లికే వన్డే, టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లండ్ తో జరగనున్న రెండో వార్మప్ మ్యాచ్ కు అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మొదటి వార్మప్ మ్యాచ్ కు భారత్ ‘ఎ’ జట్టులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు కల్పించారు.
మొదటి వార్మప్ మ్యాచ్ కు భారత్ ‘ఎ’ జట్టు
ధోని (కెప్టెన్), ధావన్, మన్‌దీప్, రాయుడు, యువరాజ్, హార్ధిక్ పాండ్యా, సంజూ శామ్సన్, కుల్దీప్ యాదవ్, చాహల్, నెహ్రా, మొహిత్ శర్మ, సిద్ధార్థ కాల్
రెండో వార్మప్ మ్యాచ్ కు భారత్ ‘ఎ’ జట్టు
రహానే(కెప్టెన్), పంత్, రైనా, దీపక్ హుడా, ఇషాన్ కిషన్, షెల్డాన్ జాక్సన్, వి.శంకర్, నదీం, పర్వేజ్ రసూల్, వినయ్ కుమార్, పదీప్ సాంగ్‌వాన్, అశోక్ దిండా