సిరాజ్‌కు మూడు వికెట్లు | Three wickets for Siraj | Sakshi
Sakshi News home page

సిరాజ్‌కు మూడు వికెట్లు

Published Wed, Aug 2 2017 12:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

సిరాజ్‌కు మూడు వికెట్లు

సిరాజ్‌కు మూడు వికెట్లు

ప్రిటోరియా: ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ ‘ఎ’ జట్టు రెండో విజ యాన్ని సాధించింది.  అఫ్ఘానిస్తాన్‌ ‘ఎ’తో జరి గిన వన్డేలో భారత్‌ ‘ఎ’ 113 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా భారత్‌ ‘ఎ’.. మనీష్‌ పాండే (86 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (59 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో 50 ఓవర్లలో 5 వికెట్లకు 322 పరుగుల భారీ స్కోరు సాధించింది.

చివర్లో కృనాల్‌ పాండ్యా (27 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఆటతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్‌ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 209 పరుగులు చేసి ఓడింది. హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (3/49) అఫ్ఘానిస్తాన్‌ను కట్టడి చేశాడు. విజయ్‌ శంకర్, సిద్ధార్థ్‌ కౌల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement