
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగనున్న రెండు అనధికారిక టెస్టుల్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును జాతీయ సెలెక్టర్లు సోమవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి బెల్గామ్, 10 నుంచి బెంగళూరులో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్న ‘ఎ’ జట్టులో హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్, ఆంధ్ర ఆటగాళ్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ కోహ్లి సూచన మేరకు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేశారు.
ఆగస్టు 17 నుంచి విజయవాడ వేదికగా దక్షిణాఫ్రికా ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’లతో జరిగే నాలుగు జట్ల వన్డే టోర్నీలో తలపడే భారత్ ‘ఎ’ జట్టుకు అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే సారథ్యం వహిస్తారు. ఇక దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్... ‘రెడ్’కు అభిమన్యు మిథున్... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ‘రెడ్’ జట్టులో ఆంధ్ర పేసర్ ఎర్రా పృథ్వీరాజ్‌కు స్థానం దక్కింది. అయితే, డోపింగ్‌లో పట్టుబడి సెప్టెంబరు 14 వరకు నిషేధంలో ఉన్న పంజాబ్ కీపర్ అభిషేక్ గుప్తాను కూడా ‘రెడ్’కు ఎంపిక చేయడం ఆశ్చర్యపరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment