vihari
-
భరత్, విహారి పోరాడినా...
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్‌లోనూ అది దక్కలేదు. ఊరించే లక్ష్య ఛేదనలో మిడిలార్డర్ రాణించినా... కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బ కొట్టింది. మొత్తానికి పరాజయాల హ్యాట్రిక్ అనంతరం తాజా సీజన్లో ఆంధ్ర జట్టు ఓటమినుంచి తప్పించుకుంటూ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. 321 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 8/1తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు... చివరకు 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (90 బంతుల్లో 92; 12 ఫోర్లు, ఒక సిక్సర్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా... హనుమ విహారి (189 బంతుల్లో 66; 6 ఫోర్లు, ఒక సిక్సర్), కరణ్ షిండే (171 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. ఓపెనర్లు అభిషేక్ రెడ్డి (6), మారంరెడ్డి హేమంత్ రెడ్డి (2) త్వరగానే ఔటవడంతో ఆంధ్ర జట్టుకు మరో ఓటమి తప్పదనిపించినా... కెపె్టన్ షేక్ రషీద్ (31; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు. అతడు వెనుదిరిగిన తర్వాత కరణ్ షిండే , హనుమవిహారి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. విహారి అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆలరించగా.. శ్రీకర్ భరత్ ఎడాపెడా బౌండ్రీలతో మైదానాన్ని హోరెత్తించాడు. అతడున్నంతసేపు ఆంధ్ర జట్టు విజయం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా... అతడు పెవిలియన్ చేరడంతో ఆంధ్ర జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ ధాపోలా 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఉత్తరాఖండ్ ఓపెనర్ ప్రియాన్షు ఖండూరికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ 338; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 146; ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్ 128/9 డిక్లేర్డ్; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (బి) దీపక్ ధాపోలా 6; హేమంత్ రెడ్డి (ఎల్బీ) (బి) దీపక్ ధాపోలా 2; షేక్ రషీద్ (ఎల్బీ) (బి) దీపక్ ధాపోలా 31; కరణ్ షిండే (సి) అవనీశ్ సుధ (బి) దీపక్ ధాపోలా 65; హనుమ విహారి (బి) దీపక్ ధాపోలా 66; శ్రీకర్ భరత్ (సి) ఆదిత్య తారె (బి) దేవేంద్ర సింగ్ బోరా 92; శశికాంత్ (నాటౌట్) 7; విజయ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 16, మొత్తం (93 ఓవర్లలో 6 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–56, 4–140, 5–276, 6–282, బౌలింగ్: దీపక్ ధాపోలా 21–3–75–5, మయాంక్ మిశ్రా 16–5–34–0; స్వప్నిల్ సింగ్ 19–3–52–0, అభయ్ నేగీ 17–4–57–0, దేవేంద్ర సింగ్ బోరా 14–2–46–1, అవనీశ్ సుధ 5–1–6–0, రవికుమార్ సమర్థ్ 1–0–1–0. -
స్నేహమే ఆదివిష్ణు మహా వాక్యం
ఆదివిష్ణు విఘ్వేశ్వర్రావు 1940లో సరిగ్గా వినాయకచవితి నాడు బందర్లో పుట్టాడు. బందరంటే, బందరు మనుషులంటే, బందరు వీధులంటే అతనికి ప్రాణం. ఇంటిపేరునే తన పేరు చేసుకుని 1959 నుంచీ కథలు రాయటం మొదలెట్టాడు. 1960ల్లో ఆదివిష్ణు అంటే నడుస్తున్న ‘కథా’నాయకుడు. అతనితోపాటు నలుగురైదుగురు మిత్రులూ, అతని చుట్టూ ఇద్దరు, ముగ్గురు ఔత్సాహిక రచయితలూ కదులుతూ ఉండేవారు. అతను ఫైనల్ ఇయర్ చదువులో ఉండగా ‘అగ్గిబరాటా’ అని వొక ‘బాయ్ మీట్స్ గళ్’ కథని రాశాడు. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో సెంటర్ స్ప్రెడ్‌గా, బాపుగారి అందమైన ‘పేద్ద’ బొమ్మతో వచ్చింది. ఆ కథ ఒక ట్రెండ్ సెట్టర్. అతనొక హీరో. అక్కణ్ణుంచీ అతను కలంవీరుడైపోయాడు. ఆర్టీసీ ఉద్యోగంలో విజయవాడలో చేరినా బందరూ, బందరు బ్యాచ్ చైతన్యం అలాగే నిలి చింది. పెద్దిభొట్ల సుబ్బరామయ్య, విహారి శాలివాహన, నందం రామారావు, హవిస్, దొండపాటి దేవదాసు, చందు సోంబాబు.. ఇలా ఎంతోమందికి అతను స్ఫూర్తిప్రదాత. పత్రికల్లో దీపావళి కథల పోటీ అంటే బందరు రచయితల్లో ఒకరో ఇద్దరో బహుమతి పొందుతూ ఉండేవారు ఆ కాలంలో. ఆదివిష్ణు నవల ‘మనిషీ–మిథ్య’కి ఆంధ్ర పత్రికలోనే ప్రథమ బహుమతి వచ్చింది. కథల విషయం చెప్పనే అక్కర్లేదు. ఆ తర్వాత అతను రాసిన ‘ఎందుకు’ నవల పత్రిక పాఠకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. మంచి తాత్విక స్ఫురణ కలిగిన నవల. ‘సగటు మనిషి’ ప్రభలో వచ్చింది. ఆ నవలలో అతనొక కొత్త టెక్నిక్‌ని వాడేడు. కథా నాయకుడు తన మనసులో అనుకొనే మాటల్ని బ్రాకెట్లో రాసేడు. అతని కథల్లో ముత్యాలూ–పగడాలూ అనదగిన ఎన్నో కథలు ‘భారతి’లో వచ్చాయి. ‘శ్రేయోభిలాషులు’, ‘శ్రీమతి రాధమ్మ’, ‘బ్రతకనివ్వండి’ వంటివి. ‘మంచుతెర’ నాటిక భారతిలో వచ్చింది. అది అతని కొత్త అవతారానికి నాంది. ఆ రచనని ఎందరో ఆడారు, కొనియాడారు, బహుమతులు పొందారు. ఆదివిష్ణు నాటిక అంటే హాస్యానికి పెద్దపీట. ఆ తర్వాత ఎందరో నటులూ, దర్శకులూ అతన్ని గురు స్థానంలో కూచోపెట్టేశారు. ఆదివిష్ణు తన సినిమారంగ ప్రస్థానాన్ని ‘కన్నెవయసు’తో ఆరంభించాడు. అయితే జంధ్యాల ‘అహనా పెళ్లంట’తో పెద్ద ‘బ్రేక్’ వచ్చింది. ‘చూపులు కలసిన శుభవేళ’, ‘హైహై నాయకా’ వంటివి మంచి విజయాల్ని సాధించాయి. సుమారు 40 చిత్రాలకు అతను పేరు కనపడీ, కనపడక రచనా సహకారాన్ని అందించాడు. ఆదివిష్ణు స్నేహశీలి. బాగా కలుపుగోలు మనిషి. కథ రాద్దామని ఉంది అంటే, ఎవరినైనా సరే ‘రాసేయండి గురువుగారూ’ అనేది అతని ‘స్టాండర్డ్ డైలాగ్’. బందరు పార్కులో సాయంవేళ ఎన్నెన్నో సంభాషణలూ, చర్చలూ, కొండొకచో వాదాలు. మేమంతా ముమ్మరంగా కథా వ్యవసాయం చేస్తున్న రోజులు. 1964లో ‘భారతి’లో కథల్ని గురించి మాట్లాడుకుంటుంటే, ఒక రచయిత కథని ఒక నెల వేస్తే, అదే రచయిత కథని వెంటనే తర్వాతి నెలలో వెయ్యరు అన్నాడతను. ‘కథ బాగుంటే వేస్తార్లే గురూ’ అన్నాన్నేను. ‘సరే చూడు... చాలెంజ్’ అన్నాడు. ఆ రాత్రి నలభై పేజీల చిన్న నవల రాసి భారతి వారికి అందవలసిన తేదీలోగా పంపితే, మే సంచికలో ‘సాగర సంగీతం’ అచ్చయింది. అతనికి ఎంత సంతోషమో, ఎంత ఆశ్చర్యమో! ‘రాయగలవు అందుకే మరి నేను రెచ్చగొట్టింది..’ అని భోళాగా నవ్వేశాడు. ఆ తర్వాత చాలాసార్లు ఈ విషయాన్ని ఉదహరిస్తూ ‘విహారితో మాత్రం పోటీపడకూడదు గురూ’ అని నవ్వుతూ చెప్పేవాడు. ఉద్యోగంలో బదిలీలతో నేను ఊరెళుతూ, తిరుగుతూ చాలాకాలం అతన్ని కలుసుకోలేదు. రిటైరయిన తర్వాత హైదరాబాదులో కలిశాను. అప్పటికే అతను మనిషి ‘జమికాడు’. నడక సరిగా లేదు. వేదగిరి రాంబాబు పట్టుపట్టి 2013లో ‘ఆదివిష్ణు కథానికలు’ సంపుటిని ప్రచురించి అతనికి సమర్పించాడు. రాంబాబుకీ ఆదివిష్ణు గురుస్థానీయుడే. దాని ఆవిష్కరణ ఎంతో శోభాయమానంగా జరిగింది. పత్రికల్లో కథలకీ, నవలలకీ లెక్కలేనన్ని బహు మతులొచ్చాయి ఆదివిష్ణుకి. నాటికల్లో, నాటకాల్లో సరేసరి. సినిమాల్లో కూడా అతను ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా బహుమతిని పొందాడు. సినిమా రంగంలో జంధ్యాల అతనికి ఆరాధనీయుడు. కథా సాహిత్యపరంగా సింగరాజు రామచంద్రమూర్తి అతని గురువు. కుటుంబపరంగా మొదటినుంచీ అతనికి తనవారిపట్ల ప్రేమ, వాత్సల్యం. అతని తండ్రి, అన్నయ్య, పెదనాన్న (నాగభూషణం)లతో మాకు మంచి పరిచయమే ఉండేది. ఆదివిష్ణు కథనశైలి ఎంతో విశిష్టమైనది. అతను ఒకటి, రెండు పదాల్లో గుండె లోతుల్లోకి భావాన్ని చేరవేసేవాడు. అతి చిన్నదైన అతని వాక్య నిర్మాణం తెలుగు కథకుల్లో ఏ ఒకరిద్దరిలోనో చూస్తాం. ఆదివిష్ణు కథలు సంకలనాల్లో చోటు చేసుకోకపోవటం తెలుగుకథ చేసుకున్న దురదృష్టాల్లో మరీ పెద్ద దురదృష్టం. కథ ద్వారా పాఠకుడికి మంచి అనుభూతిని అందించటం ఎలాగో అతని కథలు చెబుతాయి. రచయితగా చైతన్య శిఖరం ఆదివిష్ణు. అతని మరణం కథక లోకానికి తీరనిలోటు! విహారి వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత మొబైల్ : 98480 25600 -
విహారి గారి వసుధైక కుటుంబం
విహారి గారి కథలన్నీ చదివాక, ప్రత్యేకంగా ఆయన వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే కథేమిటని ప్రశ్నించుకుంటే, అందుకు సమాధానంలా, ‘వలయం’ నాముందు నిటారుగా నిలబడింది. తాను ఎన్నికచేసిన కథల సంపుటికి, ఆ కథనే మొదటి కథగా తీసుకోవడం వెనక, ఆ కథ తన సాహితీ జీవనానికి ముందుమాటగానో, భూమికగానో ఆయన భావించినట్టుగా తోచింది. కొడుకు జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా వాడికి తోడ్పడటం తండ్రి బాధ్యత. కొడుకు సమస్యల్ని తండ్రి పరిష్కరించడంలో ఆశ్చర్యమేముంటుంది? ‘వలయం’లోని కథకుడు దూరపు బంధువుల ఇబ్బందులకే గాదు, పరిచితులైన వాళ్ళెవరడిగినా, వాళ్ళకు తోడ్పడటం తన బాధ్యతగా భావిస్తారు. తన సహాయం వల్ల సుఖపడ్డవాళ్ళు, తనపట్ల కృతజ్ఞతల్ని వెల్లడించబోతే, అందులో తాను చేసిన పనేమీ పెద్దదిగాదని నమ్ముతాడు. ఎదుటి మనిషి మనస్సుకు నొప్పి కలగకుండా జాగ్రత్తపడుతూ, అతను అప్పజెప్పిన బాధ్యతను చిరునవ్వుతో, ఆత్మవిమర్శ చేసుకుంటూనే, చేసుకుపోతాడు. ఈ బాధ్యతల వలయం నుంచి ఆ కథకుడు బయటపడాలని ఎప్పుడూ అనుకోడు. కథకుడుగా విహారి బాధ్యత గుర్తెరిగిన రచయిత అనీ, ఆ కర్తవ్య నిర్వహణ నుంచీ తప్పుకోవడం ఆయనకు అసాధ్యమనీ చెప్పడానికి అయిదు దశాబ్దాల ఆయన రచనలే పెద్ద సాక్ష్యం. 1970, 80ల మధ్యలో ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రభ, యువ, జ్యోతి వంటి పత్రికల్లో మధ్య తరగతికి చెందిన రచయితలే పుంఖానుపుంఖాలుగా కథలు రాశారు. వాళ్ళందరిలోనూ ఇప్పటి వరకూ ఆపకుండా రాస్తున్న కథకులు విహారిగారొక్కరే! కథ చెప్పడంలో ఆయనది ప్రసన్నకథా కవితార్థయుక్తే! స్నేహంగా, ఆర్ద్రంగా, భుజంపైన చెయ్యేసుకుని నడుస్తున్న స్నేహితుడు కథ చెప్తున్నట్టుగా ఉంటాయి ఆయన కథలు. తొలినాటి కథకులందరిలాగే ఆయనది కూడా మౌఖిక ధోరణి. చాలా కథల్లో కథ చెప్పేవ్యక్తి కథలోని పాత్రే అయివుంటాడు. కొన్ని సార్లు ప్రధాన పాత్రగానూ, మరికొన్నిసార్లు చిన్న పాత్రగానూ ఉంటాడు. సర్వసాక్షి కథనం ఉన్న కథల్లో, రచయిత స్వభావం, వ్యక్తిత్వం, కథనంతా తీర్చిదిద్దుతుంది. అలా ఆయన కథలన్నింటిలోనూ పరుచుకున్న విహారి వ్యక్తిత్వం ‘వలయం’ కథలోని కథకుడి స్వభావానికి దగ్గరగా ఉంటుంది. తన ప్రేమను తన కుటుంబానికి పంచినంత నిబద్ధతతోనే మొత్తం సమాజానికీ పంచుతాడు. మధ్యతరగతి పునాదులపైన విస్తరిల్లిన మన దేశపు సౌభాగ్యానికి, మధ్య తరగతి వాళ్ళ మానవీయ విలువలే ఆధారమని చాటిస్తాడు. మధ్యతరగతిలో ఉండే కుహనా విలువల్ని వదులుకునే మార్గాల కోసం అన్వేషిస్తాడు. విహారిగారి స్వాభావికమైన ఈ జీవన విధానానికి పెరిగిన కొమ్మలూ, ఆకులూ, పువ్వులూ, పళ్లే ఆయన రచనలు. విహారి కథా ప్రపంచంలోకి అడుగుపెట్టడమంటే అది సమకాలీన సమాజపు కోణాలన్నింటినీ పరామర్శించడమే. కథకుడుగా ఆయన చాలా అప్రమత్తంగా ఉంటాడు. తన తరువాతి తరాలనూ సానుభూతితో అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు. అధో జగత్ సోదరులనూ, కింది మధ్య తరగతి వాళ్లనూ ‘డబ్బు’ ఎంతగా వేధిస్తుందో ఆయనకు బాగా తెలుసు. మధ్య తరగతి మనుషుల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్న వ్యాపార సంబంధాల్ని నిరసిస్తున్న కథల్లో గూడా ఆయన మానవ సంబంధాల మాధుర్యాన్ని నొక్కి చెప్పడం మరిచిపోరు. ఎదిగిన కూతుర్ని రాబందుల బారి నుంచీ తప్పించడం కోసం నానా బాధలు పడే తల్లులూ, పుస్తకాన్ని కొనగలిగే అయిదు రూపాయల కోసం ప్రమాదకరమైన పందెపు బరిలో దిగే కుర్రాళ్ళూ, బతుకు బరువు మోయడానికి ఇష్టంలేని పాతరోత పనులలోనే ముడుచుకుపోవడానికి సిద్ధపడే నిర్భాగ్యులూ, కూతుళ్ళకు పెళ్ళి చేయాల్సిన వయస్సులో గూడా నిస్సిగ్గుగా బిడ్డల్ని కనే తండ్రులూ, ఈ మధ్య తరగతి విలాపాలూ, విలాసాలూ విహారి సాహిత్య ప్రపంచంలో మనకెదురౌతారు. విహారి గారికి ధర్మాగ్రహం. పీడనలోంచి పీడనే పుడుతుందని ఆయన హెచ్చరిస్తారు. సమాజంలో ఇంత దుర్మార్గముండడానికున్న కారణాలను ఆయన కథలన్నీ తరచి చూస్తాయి. ఈ లోకాన్ని మరింత అందంగా తయారుచేయడమెలాగో సూచిస్తాయి. -మధురాంతకం నరేంద్ర -
క్షణక్షణం ఉత్కంఠ
విహారి, షెర్రీ అగర్వాల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వీర గనమాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా వీర గనమాల మాట్లాడుతూ– ‘‘వినూత్నమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఎవరూ ఊహించని ట్విస్ట్‌లతో, క్షణక్షణం ఉత్కంఠగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఉండే ఈ చిత్రంలో ప్రతి మలుపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిపిన షూటింగ్‌తో ఇప్పటి వరకు 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ని నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్. -
థ్రిల్లర్ నేపథ్యంలో...
విహారి, షెర్రీ అగర్వాల్‌ని హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు చిత్రపరిశ్రమలో కొరియోగ్రాఫర్, దర్శకత్వ శాఖలో పని చేసిన వీర గనమాల స్వీయ దర్శకత్వంలో వీజీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వీర గనమాల మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. గురువారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అజయ్, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
అబ్రస్
ఆదివారం ఉదయం. సమయం ఏడున్నర. ఆనందరావు గారింట్లో నుండి పెద్ద కేక. ఆ ఇంటి పనిమనిషి మంగది. సమాచారం కొద్ది క్షణాల్లోనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు చేరింది. ‘‘గురివిందగింజ అంటే ఎలా ఉంటుంది నాన్నా?’’ అడిగాడు హన్సాల్, ఇన్స్పెక్టర్ విహారి ఏకైక పుత్రుడు. ‘‘గురివింద గింజ అంటే, ఒకవైపు ముదురు ఎరుపు రంగులో, మరొక వైపు తక్కువ భాగంలో నలుపు రంగు.......’’ చెప్పాడు విహారి. హన్సాల్ అనుమానం తీరిన కొద్దిసేపటికే విహారి మొబైల్ మోగింది. మరుక్షణంలో విహారి జీప్ ఆనందరావు ఇంటివైపు పరుగు తీసింది. అనాథ అయిన ఆనందరావు ఒక బంగారు షాపులో పనివాడిగా పని చేస్తూ, అంచెలంచెలుగా ఎదిగి ఒక మోస్తరు జ్యూయెల్లర్స్ షాప్ యజమాని అయ్యాడు. ఆనందరావు ఇప్పుడు మంచం మీద విగత జీవుడై ఉన్నాడు.మృతదేహాన్ని మొదట చూసింది మంగ. ఆ ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తోంది. నమ్మకమైన మనిషి. యజమాని ఇంటికి వెనుక వైపు, రేకుల షెడ్లోనే ఉంటుంది. ఉదయాన్నే రావుగారి గది ఊడ్వటానికని వచ్చి, ఆనందరావుని చూసి అనుమానం వచ్చి కదిపింది. భయంతో అరచింది. విహారిని గదిని నిశితంగా పరిశీలించాడు. సహజంగా మరణించినట్టే కనపడుతోంది. పెనుగులాట జరిగిన దాఖలాలు గాని, వంటి మీద గాయాలూ లేవు.అయితే గుండెపోటు వచ్చి ఉండాలి. లేదా? ?..... విహారికి ఇంట్లో మంగ తప్ప వేరే ఎవరూ కనిపించలేదు. ప్రాథమిక పరిశీలన పూర్తయ్యేసరికి ఉదయం 12 గంటలు దాటింది. ఆ ఇంటికొచ్చిన వారిని కలియచూశాడు. సాధారణంగా జరిగింది హత్య అయితే, ఎక్కువ సందర్భాలలో హంతకుడు ఘటనా స్థలానికి వచ్చే అవకాశాలు ఎక్కువ. తోటి బంగారు షాపు యజమానులు, పనివాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరితో పాటు విహారి దృష్టిని ఆకర్షించింది ఆ టౌన్లో ఉన్న అనా««థాశ్రమం నుండి ఎక్కువ మంది పిల్లలు విషణ్ణ వదనాలతో అక్కడ ఉండటం. వాకబు చేస్తే ఆనందరావు పెరిగింది ఆ ఆశ్రమంలోనే అని తెలిసింది. ఆశ్రమ నిర్వహకుడు కూడా వచ్చాడు. ప్రాథమిక విచారణలో ఎక్కడా అనుమానాస్పదమైన విషయాలు కనపడలేదు. ఆనందరావు భార్య పేరు సుందరి. మూడు రోజుల కింద సుందరి పుట్టింటికి వెళ్లింది. ఇలా చిన్నా చితకా విషయాలు తప్ప ఎటువంటి క్లూ దొరకలేదు.క్లూస్ టీం వచ్చింది. వీలైన అన్ని చోట్లా వేలిముద్రలు సేకరించారు. క్రైమ్ సీన్ మ్యాపింగ్, పరిధి నిర్ణయం జరిగింది. డెడ్ బాడీని పోస్ట్‌మార్టం కొరకు తరలించడానికి సిద్ధమవుతుండగా సుందరి, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు వచ్చారు. సుందరితో విడిగా మాట్లాడాడు విహారి. వారు ఎవరి మీదా అనుమానం వ్యక్తం చేయలేదు. వెనుకా ముందు ఎవరూ లేకున్నా వృద్ధిలోకొస్తున్నాడని, ఆనందరావుకి సుందరినిచ్చి పెళ్లి చేశారు. ఆరేళ్లు దాటినా పిల్లలు లేరు. తీరా ఇప్పుడు ఈ ఘోరం జరిగిపోయింది. పోస్ట్‌మార్టం కూడా అవసరం లేదని, మా అమ్మాయి తలరాత ఇంతే అని సరిపెట్టుకుంటామని విలపించారు. ‘‘మా డ్యూటీ ప్రకారం మేం నడుచుకోవాలని’’ బదులిస్తూ, తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేశాడు విహారి. క్రైమ్ సీన్ డాక్యుమెంటేషన్ కూడా పూర్తయింది. ఇంటికి సీల్ వేశారు. సాయంత్రానికి పోస్ట్‌మార్టం అయింది. మృతదేహాన్ని సుందరి వాళ్ళూరికే తీసుకెళ్లారు.ఇది సహజ మరణమే, కేస్ క్లోజ్ అవుతుందనుకున్న విహారి అంచనా తలకిందులైంది. విషప్రయోగం వల్ల ఆనందరావు చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టు తేల్చింది. అతని మరణం ముందురోజు(శనివారం) రాత్రి 11 గంటలకు జరిగి ఉండొచ్చనేది దాని సారాంశం. విహారి వద్దనున్న సమాచారం ప్రకారం ఆనందరావు భార్య సుందరి అంతకు మూడు రోజుల కిందనే పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అప్పుడప్పుడు అలా వెళ్ళడం మామూలే అనేది మంగ తెలిపిన విషయం. మరి విషప్రయోగం ఎవరు చేసి ఉంటారు? ఉంటే గింటే ఆ అవకాశం మంగకే ఉంది. ఒక వేళ ఆమే చేసి ఉంటే అందువల్ల మంగకేమి లాభం? ఎటూ తేల్చుకోలేక పోయాడు. ఆనందరావుకున్న రోజువారీ అలవాట్లను కూడా మంగ ద్వారా సేకరించాడు. రోజూ రాత్రి ఇంటికి రాగానే రెండు పెగ్గులు మందుతాగడం తప్ప ఇతర అలవాట్లేమీ లేవు. పలు దఫాల విచారణ అనంతరం మంగను నిర్దోషిగా నిర్థారించుకున్నాడు విహారి. ఈ సంఘటనలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినా ఏం లాభం లేదనిపిస్తోంది. విహారి మరోసారి ఆనందరావు ఇంటికి చేరుకున్నాడు. క్రైమ్ సీన్ అలాగే ఉంది. ఇల్లంతా శోధించాడు. అల్మరాలో చాలా నగల పెట్టెలు ఉన్నాయి. కెంపులు, పగడాలు, ముత్యాలు అలాగే రకరకాల పూసలతో చుట్టబడిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. నగల వ్యాపారి కాబట్టి అందులో విచిత్రమేమీ అనిపించలేదు. ఎందుకైనా మంచిదని వాటిని ఫొటోస్ తీయించాడు. అందులో ఒక పూసలు చుట్టి ఉన్న నగ అతని దృష్టిని ఆకర్షించింది. రెండు వైపులా సమాన సంఖ్యలో పూసలు లేకపోవడమూ విహారి దృష్టిని దాటిపోలేదు. ఒక పూసను జాగ్రత్తగా సేకరించాడు. ఒక షెల్ఫ్‌లో అతను రోజూ తాగే ఆల్కహాలు సీసాలు రెండు కనపడ్డాయి. ఖరీదైన విదేశీ మద్యం. అందులో ఒకటి సీల్ తీయనిది. విహారికి అనుమానం వచ్చింది. ఇంతలో మరో విషయం గుర్తొచ్చింది. ఫ్రిజ్ తెరచి చూశాడు. ఏవీ అనుమానాస్పదంగా కనిపించలేదు. ఫ్రిజ్ మీద ఖాళీ ఐస్ క్యూబ్ ట్రే పెట్టి ఉంది. వెనుకకు మళ్లిన వాడల్లా ఆగి, ఆ ట్రేను కూడా ఒక ఎవిడెన్స్‌గా తీసుకున్నాడు. సేకరించిన వాటిని ల్యాబ్‌కు పంపాడు. పంచనామా అనంతరం ఆభరణాలను కూడా సుందరికి అప్పగించాడు. కొద్దిరోజుల్లోనే ఇల్లు కూడా సుందరికి హ్యాండోవర్ చేశారు.కేసు ఒక పట్టాన కొలిక్కి రావడం లేదు. సమాజంలో మంచి పేరు ఉన్నవాడు కావడంతో పై అధికారుల నుండి కేసు పరిష్కారానికి ఒత్తిడి పెరిగింది. ఆలోచనలో ఉన్న విహారికి ఉన్నట్టుండి అనాథాశ్రమం గుర్తొచ్చింది. అరగంటలో అక్కడున్నాడు. ఆశ్రమ నిర్వహణకు ఒక స్థిర ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పిన ఆనందరావు ఈ లోపులోనే మరణించడాన్ని ఆశ్రమ నిర్వాహకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆనందరావు బావమరిది శ్యాంసుందర్‌కి ఈ విషయం గుర్తు చేస్తే, అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దని సూచించిన సంగతి బయటికి వచ్చింది. విహారి, ఆనందరావు షాపులోకి అడుగుపెట్టాడు. సుందరి, ఆమె తమ్ముడు శ్యాంసుందర్ షాపు నిర్వహణ చూసుకుంటున్నారు. సుందరిని యోగక్షేమాలు అడిగాడు. శ్యాంసుందర్ ఉండబట్టి గానీ, లేకపోతే ఈ వ్యాపారం మూతపడేదని, తమ్ముడిని చూపిస్తూ చెప్పింది. ఆమె మాటలు వింటున్న విహారి చూపు, సుందరి వేసుకున్న నగపై పడింది. అది పూస సేకరించిన నగ. నగకు అన్ని పూసలు ఉన్నాయి.అనుమానం వచ్చిన విహారి, ఆమె వైపు పరిశీలనగా చూస్తూ ‘‘మీతో ప్రైవేటుగా మాట్లాడాలి’’ అన్నాడు. ఇది విన్న శ్యాంసుందర్ ‘‘ అసలే బావ పోయిన బాధలో ఉంది. మీకు కావలసిన వివరాలు నేను చెబుతాను..’’ అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. విహారి సున్నితంగా తిరస్కరించి, సుందరిని ప్రక్క గదిలోకి తీసుకెళ్ళాడు. వారిద్దరూ అర గంట తరువాత బయటికి వచ్చారు. విహారి జీప్ వెళ్లిపోయింది.ఉదయాన్నే స్టేషన్‌కు వచ్చేసరికి విహారి ఎదురుచూస్తున్న రిపోర్టులు ఆఫీస్‌లో టేబుల్ మీద ఉన్నాయి. వాటిని చూసిన విహారి పెదాలపై నవ్వు చోటు చేసుకుంది. అదే రోజు విహారి ఆనందరావు అత్తగారి ఊరు వెళ్ళాడు. అక్కడ, తిరిగి వచ్చి టౌన్‌లోనూ అవసరమైన అన్ని వివరాలు సేకరించాడు. విహారి ఊహకు ఆధారం దొరికింది. మరుసటి గంటలోనే ఆనందరావు ఇంట్లో, సుందరి తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మకొగ్నసీ స్పెషలైజేషన్‌తో పీజీ చేసిన శ్యాంసుందర్‌కి ఎక్కడా ఉద్యోగం దొరకక ఖాళీగా ఉన్నాడు. చిన్నా చితకా ఉద్యోగాలు చేయడం కాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం కోసం చూస్తున్నాడు. పెళ్లీడు వచ్చినా ఎటూ స్థిరపడక పోవడంతో ఇంట్లోనూ ఈసడింపులు ఎక్కువయ్యాయి.మరోవైపు పిల్లలు లేని ఆనందరావు ఆస్తిలో ఎక్కువ మొత్తాన్ని అనా«థ శరణాలయానికి, కేటాయించే ఉద్దేశంలో ఉన్న సంగతి శ్యాంసుందర్ పసిగట్టాడు. ఆనందరావు పట్టుదల తెలిసిన వాడు కావడంతో, బావను అడ్డు తొలగిస్తే అతని వ్యాపారం, ఆస్తి తన చేతిలోకి వస్తాయని ఆలోచించాడు. సుందరికి ఆభరణాలు అంటే ఇష్టం. శ్యాంసుందర్ ఒక నెల క్రితం పూసలతో చేసిన ఒక నగను అక్కకు బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే కొన్ని పూసలు తక్కువ ఉండటం గమనించింది. తమ్ముడిని అడిగితే, తెగిపోయి ఉంటాయనీ, సూటయ్యే పూసలు దొరికినప్పుడు రిపేర్ చేయిస్తానని చెప్పాడు. కానీ నిజానికి ఆ పూసలను కావాలని తొలగించి చూర్ణం చేసి దగ్గర పెట్టుకున్నాడు.అనుకున్న రోజు రాగానే, సుందరి వద్దకు వచ్చి ఇంటికి రమ్మని కోరాడు. తరచుగా పుట్టింటికి వెళ్ళడం సాధారణంగా జరిగేదే కాబట్టి సుందరికి అనుమానం రాలేదు. సుందరి రెడీ అవుతున్న సమయంలోనే ఫ్రిజ్‌లో ఉన్న ట్రేని తీసి అందులో ఒక వరుసలో తన వద్దనున్న పౌడర్ని చల్లి నీళ్ళు పోసి య«థావిధిగా ఫ్రిజ్‌లో పెట్టేశాడు. ఇందుకోసం మంగ ఉండని సమయాన్ని ఎంచుకున్నాడు.ప్రతి రోజూ, ఐసు ముక్కలతో మందు తాగే ఆనందరావు అలవాటు తెలిసిన శ్యాంసుందర్ లెక్క ప్రకారం ఆ ఐస్ ముక్కలు అయిపోయే సరికి ఆనందరావు మరణం సంభవిస్తుంది. అది ఏ రోజైనా కావచ్చు. మూడో రోజులకి ఆ ట్రేలోని పౌడర్ కలిపిన ఐసు ముక్కలు కలుపుకొని ఆల్కహాలు సేవించాడు. అదే రాత్రి మరణించాడు.బావ మరణించిన రోజూ కూడా, శ్యాంసుందర్ పరిస్థితి తెలుసుకోవడానికే అక్కతో వచ్చాడు. కోర్టులో విచారణ తుది దశకు చేరుకుంది.పూసలు తక్కువగా ఉన్న నగ ఫొటో, ఆ పూసల తాలూకూ ఎనాలసిస్ రిపోర్టు, ఐస్ ట్రే ఎక్స్ట్రాక్ట్స్ రిపోర్ట్, శ్యాంసుందర్ తాలూకూ విద్యార్హతల పత్రాలు, సుందరిని ఇంటికి తీసుకెళ్లిన రోజు సిసి టీవి ఫుటేజ్, సుందరి, ఆశ్రమ నిర్వహకుల సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెట్టబడ్డాయి. ఆనందరావును హత్య చేసినందుకుగాను శ్యాంసుందర్‌కి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. విహారి వస్తూనే ‘‘నీ వల్ల ఒక కేసు సాల్వ్ అయిందిరా’’ అంటూ కొడుకు హన్సాల్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. సాక్ష్యంగా ఉన్న నగ గురివింద గింజలతో ఉన్న తీగ అల్లకం. ‘‘గురివింద గింజల శాస్త్రీయ నామం అబ్రస్ ప్రికాటోరియస్. దీనిని ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడతారు. వీటిలో ఉండే అబ్రస్ అత్యంత విషపూరితం. ఒక గింజను పూర్తిగా సేవిస్తే, మనిషి మరణం త«థ్యం. డెబ్బై కేజీల మనిషి చనిపోవడానికి ఒక గ్రాము కన్నా తక్కువ అబ్రస్ చాలు.’’ వికీపీడియాలో గురువింద గింజల గురించి శోధించిన సమాచారం విహారి కళ్ళముందు అలా..అలా... కదిలిపోయింది. ఒకవేళ నేరస్తుడు నగనుండి కాకుండా, విడిగా గింజలను సేకరించి ఈ హత్య చేసి ఉంటే.... ఏం జరిగి ఉండేది విహారి ఊహకు అందలేదు.‘నేరస్తుడు క్లూ వదలకుండా నేరం చేయలేడు’ క్రిమినాలజీలో ముఖ్య సూత్రం తలపుకి వచ్చి, ఇలా కాకపోతే మరో విధంగానైనా పట్టుబడేవాడు అనుకుంటూ, ఎదురుగా ఉన్న ఫైల్ అందుకున్నాడు. - బి. హన్మంతరావు -
ఎటువైపో ఈ ‘టెస్టు’
ఓపెనింగ్ శుభారంభం ఇవ్వలేదు. టాపార్డర్ సంయమనంతో ఆడలేదు. ఇక భారత మిడిలార్డర్ ఏం చేస్తుంది? టెయిలెండర్ల ఆట ఎంతసేపు... అని తేలిగ్గా నిట్టూర్చిన క్రికెట్ అభిమానులకు తెలుగు తేజం విహారి, జడేజా షాక్ ఇచ్చే ప్రదర్శన ఇచ్చారు. మొదట కుదురుగా ఆడుకున్నారు. తర్వాత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతుండటంతో ఈ టెస్టు రసకందాయంగా మారింది. ఎటువైపు మొగ్గేది నేటి ఆటతో తేలుతుంది. లండన్: ఇక ఆఖరి టెస్టు ఫలితం ఏకపక్షం కాబోదు. ఆతిథ్య జట్టే గెలుస్తుందన్న అంచనాలు నిలబడవు. గెలిచే బరిలో భారత్ కూడా ఉండే అవకాశముంది. ఇదంతా ఇద్దరి ఆటతీరుతో మారిపోయింది. ఆరు వికెట్లు పారేసుకున్న భారత బ్యాటింగ్‌కు తొలి టెస్టు ఆడుతోన్న తెలుగు తేజం గాదె హనుమ విహారి (124 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్) ఊతమిస్తే... లోయర్ మిడిలార్డర్లో రవీంద్ర జడేజా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్) సత్తా చాటాడు. దీంతో ఇంగ్లండ్ ఆధిపత్యానికి గండిపడింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లలో 292 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే లభించింది. అండర్సన్, స్టోక్స్, మొయిన్ అలీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కెరీర్లో చివరి టెస్టు ఇన్నింగ్స్ ఆడుతోన్న కుక్ (125 బంతుల్లో 46 బ్యాటింగ్; 3 ఫోర్లు)తోపాటు కలిసి కెప్టెన్ రూట్ (43 బంతుల్లో 29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. అర్ధ శతకాలతో... ఓవర్‌నైట్ స్కోరు 174/6తో ఆదివారం ఆట ప్రారంభించిన భారత్‌ను విహారి, జడేజాలిద్దరూ ఆదుకున్నారు. తొలి సెషన్లో వీరిద్దరు నెలకొల్పిన కీలక భాగస్వామ్యం ఇంగ్లండ్ ఆధిక్యాన్ని బాగా తగ్గించింది. ముందుగా క్రీజులో పాతుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన వీరిద్దరు ఆ తర్వాత పరుగులు జోడించడంపై దృష్టి పెట్టారు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఎంత కవ్వించినా షాట్ల జోలికి వెళ్లకుండా నింపాదిగా ఆడారు. తొలి గంటలో 33 పరుగులు వచ్చాయి. అలా 63వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. అడపాదడపా జడేజా బ్యాట్‌కు పనిచెప్పినా... విహారి మాత్రం కుదురుగా ఆడాడు. ఈ క్రమంలోనే తెలుగు కుర్రాడు తన తొలి టెస్టులోనే 104 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తద్వారా కరుణ్ నాయర్‌ను కాదని కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకానికి న్యాయం చేశాడు. ఈ సెషన్ సాగుతున్న కొద్దీ ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైంది. అయితే లంచ్ విరామానికి ముందు ఎట్టకేలకు మొయిన్ అలీ ఈ జోడీని విడగొట్టాడు. జట్టు స్కోరు 237 పరుగుల వద్ద విహారి కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో ఇషాంత్ క్రీజ్‌లోకి రాగా లంచ్ తర్వాత పరుగుల బాధ్యతను పూర్తిగా జడేజా తీసుకున్నాడు. అవతలి బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వకుండా డబుల్స్, బౌండరీలు బాదేందుకు ఉత్సాహం చూపాడు. 113 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జడేజా... ఇషాంత్ (4), షమీ (1), బుమ్రా (0) సాయంతో 55 పరుగులు జోడించడం విశేషం. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 332; భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) కరన్ 37; ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) బ్రాడ్ 3; పుజారా (సి) బెయిర్ స్టో (బి) అండర్సన్ 37; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 49; రహానే (సి) కుక్ (బి) అండర్సన్ 0; విహారి (సి) బెయిర్‌స్టో (బి) మొయిన్ అలీ 56; రిషభ్ పంత్ (సి) కుక్ (బి) స్టోక్స్ 5; జడేజా (నాటౌట్) 86; ఇషాంత్ శర్మ (సి) బెయిర్‌స్టో (బి) మొయిన్ అలీ 4; షమీ (సి) బ్రాడ్ (బి) రషీద్ 1; బుమ్రా (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (95 ఓవర్లలో ఆలౌట్) 292. వికెట్ల పతనం: 1–6, 2–70, 3–101, 4–103, 5–154, 6–160, 7–237, 8–249, 9–260, 10–292. బౌలింగ్: అండర్సన్ 21–7–54–2, బ్రాడ్ 20–6–50–1, స్టోక్స్ 16–2–56–2, కరన్ 11–1–49–1, మొయిన్ అలీ 17–3–50–2, రషీద్ 10–2–19–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: అలిస్టర్ కుక్ (బ్యాటింగ్) 46; జెన్నింగ్స్ (బి) షమీ 10; మొయిన్ అలీ (బి) జడేజా 20; రూట్ (బ్యాటింగ్) 29, ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (43 ఓవర్లలో 2 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–27, 2–62. బౌలింగ్: బుమ్రా 12–4–26–0, ఇషాంత్ శర్మ 7–3–11–0, షమీ 10–3–32–1, జడేజా 14–2–36–1. శభాష్... విహారి దేశవాళీ మ్యాచ్‌ల్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకునే హనుమ విహారి అరంగేట్రం చేసిన అంతర్జాతీయ మ్యాచ్‌లో జట్టును ఆదుకున్నాడు. సరిగ్గా టెస్టులకు సరిపోయే ఇన్నింగ్స్‌ను తన మొదటి టెస్టులోనే పరిచయం చేశాడు. ఆరో నంబర్లో సరిగ్గా నప్పే బ్యాట్స్‌మన్‌గా టీమ్ మేనేజ్మెంట్లో ఆశలు పెంచాడు. జడేజాతో కలిసి తొలి సెషన్లో విహారి చేసిన అర్ధశతక పోరాటం ఏ మాత్రం తీసిపోనిది. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను బాధ్యతాయుత బ్యాటింగ్‌తో గాడిన పెట్టాడు. వికెట్‌ను కాపాడుకుంటూ... ఒక్కో పరుగును జత చేస్తూ... పరుగుల పయనాన్ని అర్ధసెంచరీ దాకా సాగించాడు. జడేజా కూడా విహారికి అండగా నిలువడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఈ జోడీని తొందరగా విడగొట్టేందుకు కెప్టెన్ రూట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా విహారి ఏకాగ్రతను కోల్పోలేదు. ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రం టెస్టులోనే అర్ధసెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా విహారి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ, ద్రవిడ్‌లు ఒకే టెస్టులో ఈ ఘనత సాధించారు. ఈ దిగ్గజాల సరసన విహారి నిలిచాడు. -
భారత ‘ఎ’ జట్టులో విహారి, సిరాజ్, భరత్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగనున్న రెండు అనధికారిక టెస్టుల్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును జాతీయ సెలెక్టర్లు సోమవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి బెల్గామ్, 10 నుంచి బెంగళూరులో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్న ‘ఎ’ జట్టులో హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్, ఆంధ్ర ఆటగాళ్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ కోహ్లి సూచన మేరకు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేశారు. ఆగస్టు 17 నుంచి విజయవాడ వేదికగా దక్షిణాఫ్రికా ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’లతో జరిగే నాలుగు జట్ల వన్డే టోర్నీలో తలపడే భారత్ ‘ఎ’ జట్టుకు అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే సారథ్యం వహిస్తారు. ఇక దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్... ‘రెడ్’కు అభిమన్యు మిథున్... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ‘రెడ్’ జట్టులో ఆంధ్ర పేసర్ ఎర్రా పృథ్వీరాజ్‌కు స్థానం దక్కింది. అయితే, డోపింగ్‌లో పట్టుబడి సెప్టెంబరు 14 వరకు నిషేధంలో ఉన్న పంజాబ్ కీపర్ అభిషేక్ గుప్తాను కూడా ‘రెడ్’కు ఎంపిక చేయడం ఆశ్చర్యపరుస్తోంది. -
రాణించిన విహారి
∙ ఇండియా ‘బ్లూ’ 216/3 ∙ దులీప్ ట్రోఫీ మ్యాచ్ కాన్పూర్: ఇండియా ‘రెడ్’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘బ్లూ’ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆంధ్ర ఆటగాడు గాదె హనుమ విహారి (163 బంతుల్లో 86 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతుండగా... కెప్టెన్ సురేశ్ రైనా (82 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం విహారితో పాటు దీపక్ హుడా (23 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు రెడ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 291/9తో ఆట కొనసాగించిన ఆ జట్టు రెండో రోజు 24.3 ఓవర్లలో మరో 92 పరుగులు జత చేసింది. బాబా ఇంద్రజిత్ (280 బంతుల్లో 200; 20 ఫోర్లు, 6 సిక్సర్లు) తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇంద్రజిత్, విజయ్ గోహిల్ చివరి వికెట్‌కు ఏకంగా 178 పరుగులు జోడించారు. బ్లూ బౌలర్లలో రాజ్‌పుత్‌కు 3 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం బ్లూ తొలి ఇన్నింగ్స్‌లో మరో 167 పరుగులు వెనుకబడి ఉంది. -
విహారి, రోహిత్, అన్షుల్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో స్పోర్టింగ్ ఎలెవన్, ఆర్. దయానంద్ జట్ల మధ్య జరి గిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలిరోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ రెండు రోజులు మాత్రమే జరిగింది. ఓవర్‌నైట్ స్కోరు 247/1తో శుక్రవారం మూడో రోజుతొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆర్. దయానంద్ జట్టు ఆటముగిసే సమయానికి 142.1 ఓవర్లలో 6 వికెట్లకు 630 పరుగుల భారీ స్కోరు చేసింది. దయానంద్ జట్టుకు ప్రాతిని ధ్యం వహిస్తున్న ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (96 బంతుల్లో 136; 10 ఫోర్లు, 12 సిక్సర్లు), పి. రోహిత్ రెడ్డి (92 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీలు చేయగా... జె. అన్షుల్ లాల్ (243 బంతుల్లో 122 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. టి. ఆరోన్ పాల్ (50 నాటౌట్), భగత్ వర్మ (75) అర్ధ సెంచరీలు చేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టుకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ఇతర ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్ మ్యాచ్‌ల వివరాలు ఆంధ్రాబ్యాంక్: 286 (కార్తి్తకేయ 4/86); జై హనుమాన్: 288/6 (రోహిత్ రాయుడు 97 నాటౌట్, విఠల్ అనురాగ్ 42). డెక్కన్ క్రానికల్: 198 (నితీశ్ రెడ్డి 61, బి. రేవంత్ 92; రాజమణి ప్రసాద్ 4/52, అజయ్ దేవ్ 3/51); ఈఎంసీసీ: 179/7 (బెంజ మిన్ థామస్ 68 నాటౌట్; వరుణ్ గౌడ్ 3/43). ఎస్బీఐ: 320/6 (డానీ డెరెక్ ప్రిన్స్ 86, బి. సుమంత్ 99, ఆకాశ్ భండారి 69; ప్రణీత్ రాజ్ 5/63); ఇన్‌కం ట్యాక్స్‌తో మ్యాచ్. కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 337/7 డిక్లేర్డ్; ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 302 (హృషికేశ్ సింహా 110, జయసూర్య 48; మెహదీ హసన్ 4/73, మీర్ ఒమర్ ఖాన్ 3/37). జెమిని ఫ్రెండ్స్: 292 (ఎం. రాధాకృష్ణ 90; శ్రీ చరణ్ 4/106, రాజేంద్ర 5/53); హైదరాబాద్ బాట్లింగ్: 131/2 (జయరామ్ రెడ్డి 37, జి. రోహన్ యాదవ్67 నాటౌట్). కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 190, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 213 (టి. వంశీకృష్ణ 37, జి. చిరంజీవి 40, హేమంత్ సింగ్ 50; ఆకాశ్ సనా 5/32), కాంటినెంటల్ రెండో ఇన్నింగ్స్: 86/4 (సాయి ప్రణయ్ 34; ఎం. సురేశ్ 3/44); -
విహారి, సిరాజ్‌లకు చోటు
దక్షిణాఫ్రికా పర్యటనకు భారత ‘ఎ’ జట్ల ఎంపిక ముంబై: దక్షిణాఫ్రికాలో జరిగే ముక్కోణపు వన్డే టోర్నీ, అనధికారిక టెస్టుల్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్లను గురువారం ప్రకటించారు. వన్డే, టెస్టు జట్లలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు చోటు లభించగా, ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యాడు. జూలై 26నుంచి ఈ పర్యటన సాగుతుంది. ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే టోర్నీ జరుగుతుంది. ఆ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. భారత అండర్–19 తరఫున ఆడిన విహారి ‘ఎ’ టీమ్‌లోకి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. సిరాజ్ గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం ‘ఎ’ జట్టులోకి ఎంపికైనా... మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. వీరిద్దరూ 2016–17 రంజీ ట్రోఫీ సీజన్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విహారి 57.33 సగటుతో 688 పరుగులు చేయగా, సిరాజ్ 41 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ద్వారా సిరాజ్‌కు కూడా గుర్తింపు లభించింది. వన్డే జట్టుకు మనీశ్ పాండే, టెస్టు జట్టుకు కరుణ్ నాయర్ సారథ్యం వహిస్తారు. వీరితో పాటు మరో సీనియర్ జట్టు సభ్యుడు జయంత్ యాదవ్‌కు కూడా ఇరు జట్లలోనూ చోటు లభించింది. ఇండియా ‘ఎ’ జట్ల వివరాలు: వన్డేలకు: మనీశ్ పాండే (కెప్టెన్), మన్దీప్, శ్రేయస్ అయ్యర్, సంజు సామ్సన్, దీపక్ హుడా, కరుణ్ నాయర్, కృనాల్ పాండ్యా, రిషభ్ పంత్, విజయ్ శంకర్, అక్షర్ పటేల్, చహల్, జయంత్ యాదవ్, బాసిల్ థంపి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సిద్ధార్థ్ కౌల్ టెస్టులకు: కరుణ్ నాయర్ (కెప్టెన్), ప్రియాంక్ పాంచల్, ముకుంద్, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్నే, సుదీప్ ఛటర్జీ, ఇషాన్ కిషన్, విహారి, జయం త్ యాదవ్, షాబాజ్ నదీమ్, నవదీప్ సైని, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, అనికేత్ చౌదరి, అంకిత్ రాజ్‌పుత్. -
నిరంతర సాహితీ సంచారి విహారి
విజయవాడ కల్చరల్ : నిరంతర సాహితీ సంచారి విహారి (జేఎస్ మూర్తి) అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విజయవాడ సాహితీ సంస్థలు, సాహితీ మిత్రుల సంయుక్త నిర్వహణలో మొగల్రాజపురంలోని మధుమహాలక్ష్మి కాంప్లెక్స్‌లో ఆదివారం ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత, పదచిత్ర రామాయణకర్త విహారి 60 వసంతాల సాహితీ జీవితం పూర్తి చేసుకున్న నేపథ్యంలో సాహిత్య షష్టిపూర్తి సదస్సును నిర్వహించాయి. సదస్సుకు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షత వహించారు. సాహితీవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ విహారి భావఝరి పదచిత్ర రామాయణం కమనీయంగా సాగుతుందని చెప్పారు. లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్, తెలుగు అధ్యాపకుడు గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ విహారి సాహిత్య జీవితం ఎంతోమంది వర్ధమాన రచయితలను సాహిత్యం వైపు మళ్లించిందని తెలిపారు. చినుకు సంపాదకుడు నండూరి రాజగోపాల్ మాట్లాడుతూ విహారి తెలుగు కథా సాహిత్య విహారి అని అభివర్ణించారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కోశాధికారి కలిమిశ్రీ, కవి పండితులు పువ్వాడ తిక్కన సోమయాజి, ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు, విరసం బాధ్యుడు అరసవల్లి కృష్ణ తదితరులు ప్రసంగించారు. నిర్వాహకులు భావఝరి పదచిత్ర రామాయణం పుస్తకాన్ని ఆవిష్కరించి, విహారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విహారి మాట్లాడుతూ 60 ఏళ్ల సాహిత్య జీవితంలో అనేక అంశాలను ప్రస్థావించారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా కావూరి సత్యవతి, బొడ్డపాటి చంద్రశేఖర్ వ్యవహరించారు. -
విరించి, విహారిల పోస్టుమార్టం పూర్తి
-
చెలరేగిన విహారి
ఆంధ్రా బ్యాంక్ 337 ఎన్స్‌కాన్స్ 295 ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మన్ విహారి (168 బంతుల్లో 111; 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా ఎన్స్‌కాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా బ్యాంక్ 337 పరుగులు చేసి ఆలౌటైంది. నవీన్ రెడ్డి (88) అర్ధ సెంచరీతో రాణించగా, అమోల్ షిండే (40) ఫర్వాలేదనిపించాడు. అంతకుముందు ఎన్స్‌కాన్స్ జట్టు తొలిఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేసి ఆలౌటైంది. హిమాలయ్ అగర్వాల్ (86), తన్మయ్ అగర్వాల్ (56), మెహదీ హసన్ (50) అర్ధసెంచరీలు చేశారు. అబ్దుల్ ఖాదర్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆంధ్రా బ్యాంక్ జట్టుకు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రాహుల్ సింగ్ మెరుపు సెంచరీ బీడీఎల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ బ్యాట్స్‌మన్ రాహుల్ సింగ్ ( 66 బంతుల్లో 101; 23 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు సెంచరీతో విజృంభించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి డెక్కన్ క్రానికల్ 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఆకాశ్ బండారి (54 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రవీందర్ (49) మెరుగ్గా ఆడాడు. అంతకుముందు తొలిరోజు బ్యాటింగ్ చేసిన బీడీఎల్ 332 పరుగుల వద్ద ఆలౌటైంది. సుమంత్ (135), వెంకట్ (105) సెంచరీలతో కదంతొక్కారు. -
చెలరేగిన రవితేజ, విహారి
హైదరాబాద్ 341/4 జమ్మూకాశ్మీర్‌తో రంజీ మ్యాచ్ జమ్మూ: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రవితేజ (217 బంతుల్లో 153 బ్యాటింగ్, 17 ఫోర్లు, 2 సిక్సర్లు), హనుమ విహారి (164 బంతుల్లో 109, 18 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. జమ్మూకాశ్మీర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట పూర్తిగా రద్దు కావడంతో రెండో రోజు సోమవారం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. ఒక్క రోజులోనే నిర్ణీత ఓవర్లు (90) కూడా పూర్తిగా ఆడకుండానే 300 పైచిలుకు పరుగులు చేయడం విశేషం. రవితేజ, విహారి వన్డేను తలపించేలా వీరవిహారం చేశారు. ఈ సీజన్లో చక్కని ఫామ్‌లో ఉన్న వీరిద్దరు ఈ మ్యాచ్‌లో సెంచరీలతో కదంతొక్కారు. మూడో వికెట్‌కు ఈ ఇద్దరు 203 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అంతకుముందు హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (9) విఫలమయ్యాడు. దీంతో జట్టు 22 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (49) అర్ధసెంచరీ అవకాశాన్ని తృటిలో కోల్పోయినా... రవితేజతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. జమ్మూకాశ్మీర్ కెప్టెన్ పర్వేజ్ రసూల్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించినా హైదరాబాద్ దూకుడును అడ్డుకోలేకపోయాడు. సమీవుల్లా బేగ్, రామ్‌దయాళ్ పూనియా, బందీప్ సింగ్ తలా ఓ వికెట్ తీయగలిగారు. ఆట ముగిసే సమయానికి రవితేజతో పాటు అమోల్ షిండే (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: సుమన్ (సి) ఒబేద్ హరూన్ (బి) సమీవుల్లా బేగ్ 9; అక్షత్ రెడ్డి రనౌట్ 49; రవితేజ బ్యాటింగ్ 153; విహారి (స్టంప్డ్) హరూన్ (బి) బందీప్ సింగ్ 109; ఖాద్రీ ఎల్బీడబ్ల్యూ (బి) రామ్‌దయాళ్ 8; షిండే బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (84 ఓవర్లలో 4 వికెట్లకు) 341. వికెట్ల పతనం: 1-22, 2-109, 3-312, 4-337 బౌలింగ్: సమీవుల్లా 16-0-97-1, మహ్మద్ గుజ్రీ 16-3-48-0, రామ్‌దయాళ్ 15-3-51-1, ఉమర్ నజీర్ 11-1-39-0, పర్వేజ్ రసూల్ 14-3-54-0, రిషీ 3-1-10-0, బందీప్ సింగ్ 8-2-24-1, మంజూర్దార్ 1-0-10-0. -
హైదరాబాద్ మ్యాచ్ రంజీ డ్రా
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ చక్కని పోరాటం కనబర్చినప్పటికీ ఆధిక్యం మాత్రం దక్కలేదు. రంజీట్రోఫీ గ్రూప్-సిలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆటలో అహ్మద్ ఖాద్రీ (294 బంతుల్లో 113; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కగా, విహారీ (207 బంతుల్లో 80; 10 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. హబీబ్ (74 బం తుల్లో 44; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 528 పరుగులు చేసింది. మహారాష్ట్రకు 88 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ... హెదరాబాద్ ఆలౌట్ కాకపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. ఖాద్రీ సెంచరీ ఆదివారం 290/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఖాద్రీ, విహారీ నిలబెట్టారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచారు. వికెట్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా ఇద్దరూ బ్యాటింగ్ చేయడంతో పరుగుల వేగం మందగించింది. ఈ క్రమంలోనే విహారీ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ ఐదో వికెట్‌కు 136 పరుగులు జోడించిన తర్వాత విహారిని ఖురానా క్లీన్‌బౌల్డ్ చేయగా, అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన షిండే (2) దరేకర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో హబీబ్‌తో కలిసిన ఖాద్రీ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 460 పరుగుల వద్ద హబీబ్ నిష్ర్కమించగా... ఖాదర్ (19) అండతో ఖాద్రీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ సిక్సర్‌తో సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. మహారాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 616/9 స్కోరు చేసింది. మహారాష్ట్ర బౌలర్ యాక్షన్ సందేహాస్పదం! మరో వైపు మహారాష్ట్ర పేసర్ సచిన్ చౌదరి బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. మ్యాచ్ మూడో రోజు శనివారం అతడిని అంపైర్లు రెండు సార్లు హెచ్చరించారు. అయితే చివరి రోజు లంచ్ తర్వాత మళ్లీ సచిన్ యాక్షన్ైపై సందేహం రావడంతో అతడిని బౌలింగ్ నుంచి తప్పించారు. ఎన్సీఏలో తన యాక్షన్‌ను సరిదిద్దుకునే వరకు ఇకపై అతను మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. -
హైదరాబాద్ 221 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. ఫలితంగా ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆంధ్రతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. హనుమ విహారి (165 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), అమోల్ షిండే (97 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 102 పరుగులు జోడించి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆంధ్ర బౌలర్లలో షాబుద్దీన్ 45 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, శివకుమార్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర రెండో రోజు సోమవారం ఆట ముగిసే సరికి 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (39 బంతుల్లో 29; 7 ఫోర్లు) అవుట్ కాగా, డీబీ ప్రశాంత్ (95 బంతుల్లో 32 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఎం.సురేశ్ (50 బంతుల్లో 17 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కీలక భాగస్వామ్యం... 44/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ అదే స్కోరు వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది. షాబుద్దీన్ వేసిన ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గల్లీలో క్యాచ్ ఇచ్చి సుమన్ (12) వెనుదిరగ్గా...అదే ఓవర్ మూడో బంతికి సందీప్ (0) ఎల్బీగా అవుటయ్యాడు. ఈ దశలో విహారి, షిండే కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆరంభంలో పూర్తిగా నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిచ్చిన ఈ ఇద్దరు ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లతో స్కోరు వేగం పెంచారు. ఈ క్రమంలో 92 బంతుల్లో విహారి, 89 బంతుల్లో షిండే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు భాగస్వామ్యం కూడా వంద పరుగులు దాటింది. షిండేను అవుట్ చేసి శివకుమార్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ వెంటనే ఆశిష్ రెడ్డి (10) కూడా షాబుద్దీన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఈ దశలో ధాటిగా ఆడిన కీపర్ హబీబ్ అహ్మద్ (32 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) కొద్ది సేపు విహారికి అండగా నిలవడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఏడో వికెట్‌గా విహారి వెనుదిరిగాక కొద్ది సేపటికే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. భరత్ దూకుడు... అనంతరం ఆంధ్ర ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు భరత్, ప్రశాంత్ ధాటిగా ఆరంభించారు. మిలింద్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన భరత్, అదే బౌలర్ మూడో ఓవర్లో కూడా మరో రెండు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించిన అనంతరం ఆశిష్‌రెడ్డి హైదరాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆఫ్ స్టంప్ వచ్చిన బంతిని కట్ చేయబోయిన భరత్, కీపర్ హబీబ్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మరో వైపు ప్రశాంత్ మాత్రం ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా సంయమనంతో ఆడాడు. టీ తర్వాత రెండో ఓవర్లో ఓజా బౌలింగ్‌లో స్లిప్స్‌లో ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రవితేజ వదిలేయడం ప్రశాంత్‌కు కలిసొచ్చింది. మిలింద్ బౌలింగ్‌లో మోచేతికి దెబ్బ తగలడంతో కొద్ది సేపు చికిత్స చేయించుకున్న అనంతరం ఆటను కొనసాగించిన ప్రశాంత్...సురేశ్‌తో కలిసి అభేద్యంగా 43 పరుగులు జోడించి రెండో రోజు ఆటను ముగించాడు.