క్షణక్షణం ఉత్కంఠ | vihari, Sherri Agarwal new movie first schedule completed | Sakshi
Sakshi News home page

క్షణక్షణం ఉత్కంఠ

Published Sat, Jun 15 2019 12:17 AM | Last Updated on Sat, Jun 15 2019 12:17 AM

vihari, Sherri Agarwal new movie first schedule completed - Sakshi

షెర్రీ అగర్వాల్, విహారి

విహారి, షెర్రీ అగర్వాల్‌ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వీర గనమాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సందర్భంగా వీర గనమాల మాట్లాడుతూ– ‘‘వినూత్నమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఎవరూ ఊహించని ట్విస్ట్‌లతో, క్షణక్షణం ఉత్కంఠగా సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఉండే ఈ చిత్రంలో ప్రతి మలుపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరిపిన షూటింగ్‌తో ఇప్పటి వరకు 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ని నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. అజయ్, రాజీవ్‌ కనకాల, తనికెళ్ల, చమ్మక్‌ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement