ఆంధ్రా బ్యాంక్ 337
ఎన్స్‌కాన్స్ 295
ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మన్ విహారి (168 బంతుల్లో 111; 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా ఎన్స్‌కాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా బ్యాంక్ 337 పరుగులు చేసి ఆలౌటైంది.
నవీన్ రెడ్డి (88) అర్ధ సెంచరీతో రాణించగా, అమోల్ షిండే (40) ఫర్వాలేదనిపించాడు. అంతకుముందు ఎన్స్‌కాన్స్ జట్టు తొలిఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేసి ఆలౌటైంది. హిమాలయ్ అగర్వాల్ (86), తన్మయ్ అగర్వాల్ (56), మెహదీ హసన్ (50) అర్ధసెంచరీలు చేశారు. అబ్దుల్ ఖాదర్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆంధ్రా బ్యాంక్ జట్టుకు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
రాహుల్ సింగ్ మెరుపు సెంచరీ
బీడీఎల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ బ్యాట్స్‌మన్ రాహుల్ సింగ్ ( 66 బంతుల్లో 101; 23 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు సెంచరీతో విజృంభించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి డెక్కన్ క్రానికల్ 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఆకాశ్ బండారి (54 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రవీందర్ (49) మెరుగ్గా ఆడాడు. అంతకుముందు తొలిరోజు బ్యాటింగ్ చేసిన బీడీఎల్ 332 పరుగుల వద్ద ఆలౌటైంది. సుమంత్ (135), వెంకట్ (105) సెంచరీలతో కదంతొక్కారు.
చెలరేగిన విహారి
Published Thu, Mar 20 2014 12:43 AM | Last Updated on Sat, Jun 2 2018 2:17 PM
Advertisement