ACC Emerging Asia Cup 2023: India A beat Nepal by 9 wickets to enter semi-finals - Sakshi
Sakshi News home page

ACC Emerging Asia Cup 2023: సెమీఫైనల్లో భారత్‌ ‘ఎ’

Published Tue, Jul 18 2023 6:14 AM | Last Updated on Tue, Jul 18 2023 9:48 AM

ACC Emerging Asia Cup 2023: India A beat Nepal by 9 wickets to enter semifinals - Sakshi

కొలంబో: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఎమర్జింగ్‌ కప్‌ క్రికెట్‌ టోరీ్నలో భారత  ‘ఎ’ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్‌ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట నేపాల్‌ 39.2 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (65; 7 ఫోర్లు) రాణించాడు. గుల్షన్‌ ఝా (38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు.

భారత్‌ ‘ఎ’ బౌలర్లలో నిశాంత్‌ సింధు 4, రాజ్‌వర్ధన్‌ 3, హర్షిత్‌ రాణా 2 వికెట్లు తీశారు. తర్వాత సులువైన లక్ష్యాన్ని భారత జట్టు 22.1 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (87; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (58 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. ధ్రువ్‌ (21 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా పరుగులు చేశాడు. ఈ గ్రూపులో బుధవారం తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ ‘ఎ’తో తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement