Emerging Cup
-
'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో ఇండియా-ఏ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీఫైనల్లో ఇండియా-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే సెమీఫైనల్ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎక్కడా తగ్గలేదు. మొదట టీమిండియా బ్యాటింగ్ సమయంలో వికెట్ పడ్డ ప్రతీసారి బంగ్లా ఆటగాళ్లు టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ పెవిలియన్ సిగ్నల్ చూపించారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు.. పదే పదే అదే చర్యకు పాల్పడుతూ శ్రుతి మించారు. ఇదంతా టీమిండియా ఆటగాళ్లు గమనిస్తూనే వచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా సైలెంట్‌గా ఉన్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఇండియా- ఏ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. బంగ్లా వికెట్ కోల్పోయిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్, ఇండియా-ఏ ఆటగాడు హర్షిత్ రానాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకోవడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 26వ ఓవర్ యువరాజ్‌సిన్హ్ దోదియా వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సౌమ్యా సర్కర్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న నికిన్ జోస్‌కు దొరికిపోయాడు. కీలక వికెట్ కావడంతో ఇండియా-ఏ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. అయితే హర్షిత్ రానా సౌమ్యా సర్కర్ మొహం ముందు గట్టిగా అరుస్తూ పంచ్‌లు గుద్దుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది నచ్చిన సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాతో గొడవకు దిగాడు. ఇద్దరు మాటమాట అనుకున్నారు. అంపైర్ వచ్చేలోపే ఇద్దరు దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ వచ్చి సౌమ్యా సర్కార్‌ను వెళ్లమంటూ పక్కకు తీసుకెళ్లాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న సమయంలోనూ సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాపై మాటల యుద్దం కొనసాగించాడు. అయితే హర్షిత్ రానా ఇంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో యష్‌దుల్ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసి శ్రుతి మించాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్ రానా సౌమ్యా సర్కార్ ఔటవ్వగానే బదులు తీర్చుకున్నాడు. ''నువ్వు మొదలుపెట్టావ్..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది'' అంటూ కామెంట్ చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. India vs Bangladesh - never short of some heat 🔥 . .#EmergingAsiaCup2023 #INDAvBANA pic.twitter.com/xxnMx8Arez — FanCode (@FanCode) July 21, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా Lionel Messi: మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా -
సాయి సుదర్శన్ అజేయ సెంచరీ
కొలంబో: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 క్రికెట్ టోర్నీ లీగ్ దశలో భారత్ ‘ఎ’ జట్టు అజేయంగా నిలిచింది. పాకిస్తాన్ ‘ఎ’తో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ‘ఎ’ 48 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఖాసిమ్ అక్రమ్ (48; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్వర్ధన్ హంగార్గేకర్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు, మానవ్ సుథర్ 36 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత ‘ఎ’ జట్టు 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) పాక్ బౌలర్ల భరతంపట్టి అజేయ సెంచరీ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ తొలి వికెట్‌కు అభిõÙక్ శర్మ (20; 4 ఫోర్లు)తో 58 పరుగులు... రెండో వికెట్‌కు నికిన్ జోస్ (64 బంతుల్లో 53; 7 ఫోర్లు)తో 99 పరుగులు... మూడో వికెట్‌కు కెపె్టన్ యశ్ ధుల్ (21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో 53 పరుగులు జోడించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం పొందింది. నాలుగు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంక ‘ఎ’తో పాకిస్తాన్ ‘ఎ’; బంగ్లాదేశ్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడతాయి. ఫైనల్ 23న జరుగుతుంది. -
పాక్‌తో మ్యాచ్.. సంచలన స్పెల్‌తో మెరిసిన సీఎస్కే బౌలర్
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో బుధవారం ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఏదైనా చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అది జూనియర్ లేదా సీనియర్ మ్యాచ్ కావొచ్చ.. ఉత్కంఠ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. తాజాగా మ్యాచ్‌లో సీఎస్కే పేసర్.. యువ బౌలర్ రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ చేయడం విశేషం. పాక్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ హంగర్గేకర్ వేశాడు. ఓవర్లో రెండో బంతికి సయీమ్ అయూబ్‌ను డకౌట్గాపెవిలియన్ చేర్చాడు. మూడు డాట్‌బాల్స్ అనంతరం ఆఖరి బంతికి ఒమెర్ యూసఫ్ కూడా ద్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. అలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్-ఏ జట్టు 36 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ 26, ముబాసిర్ ఖాన్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఎవరీ రాజ్‌వర్దన్ హంగర్గేకర్? నవంబర్ 10, 2002లో జన్మించిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ప్రస్తుతం ఇండియా-ఏ టీమ్‌లో ప్రామిసింగ్ క్రికెటర్‌గా ఉన్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో అనతి కాలంలోనే డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున హంగర్గేకర్ దేశవాలీ టి20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత లిస్ట్-ఏలోనూ అరంగేట్రం చేసిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ఇప్పుడిప్పుడే దేశవాలీలో సత్తా చాటుతున్నాడు. 2022 ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌కు హంగర్గేకర్ జట్టులో చోటు సంపాదించాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న హంగర్గేకర్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. సీఎస్కే 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. ఇక 31 మార్చి 2023న రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సీఎస్కే తరపున ఐపీఎల్లో ఆడాడు. అయితే మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. Pace is Pace Yaar, right? 😉 Hangargekar with two wickets early in the game!#INDvPAK #LIVEonFanCode pic.twitter.com/WCqF7vO4bS — FanCode (@FanCode) July 19, 2023 చదవండి: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్‌చేస్తే సూపర్‌మార్కెట్ ఓనర్‌గా Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్‌డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి' -
ACC Emerging Asia Cup 2023: సెమీఫైనల్లో భారత్ ‘ఎ’
కొలంబో: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోరీ్నలో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట నేపాల్ 39.2 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (65; 7 ఫోర్లు) రాణించాడు. గుల్షన్ ఝా (38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్ ‘ఎ’ బౌలర్లలో నిశాంత్ సింధు 4, రాజ్వర్ధన్ 3, హర్షిత్ రాణా 2 వికెట్లు తీశారు. తర్వాత సులువైన లక్ష్యాన్ని భారత జట్టు 22.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (87; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (58 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. ధ్రువ్ (21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా పరుగులు చేశాడు. ఈ గ్రూపులో బుధవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ‘ఎ’తో తలపడుతుంది. -
భారత మహిళలదే ఎమర్జింగ్ కప్
కొలంబో: ఆసియా కప్ మహిళల ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. శ్రీలంక మహిళల జట్టుతో మంగళవారం జరిగిన ఫైనల్లో దేవిక వైద్య నాయకత్వంలోని టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 14 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. తనుశ్రీ సర్కార్ (47; 4 ఫోర్లు), సిమ్రన్ బహదూర్ (34; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతితో శ్రీలంక లక్ష్యాన్ని 35 ఓవర్లలో 150 పరుగులుగా సవరించారు. శ్రీలంక 34.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో తనుజా కన్వర్ (4/15), దేవిక వైద్య (4/29) నాలుగేసి వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. -
ఏసీసీ ఎమర్జింగ్ కప్ ఫైనల్‌కి
సింగపూర్: బ్యాటింగ్‌లో మన్‌ప్రీత్ జునేజా (76), బౌలిం గ్లో అక్షర్ పటేల్ (4/29) చెలరేగడంతో... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ టోర్నీలో భారత్ అండర్-23 జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం కళింగ మైదానంలో జరిగిన సెమీఫైనల్లో 46 పరుగుల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 49.5 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. లోకేష్ రాహుల్ (43) రాణించాడు. యూఏఈ స్పిన్నర్ నాజిర్ అజీజ్ ఐదు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 48.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై ఓడింది. అన్వర్ (44) టాప్ స్కోరర్. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ 4, సందీప్ శర్మ, అపరాజిత్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్.. పాక్‌తో తలపడుతుంది. రెండో సెమీస్‌లో పాక్ ఒక వికెట్ తేడాతో శ్రీలంకను ఓడించింది.