Asian Cricket Council
-
‘ఆసియా క్రికెట్’ మ్యాచ్‌లన్నీ ఆ నెట్‌వర్క్‌లోనే లైవ్ స్ట్రీమింగ్..!
భారత్‌కు చెందిన సోనీ పిక్చర్స్ నెట్వర్క్ (ఎస్పీఎన్ఐ) ఆసియా క్రికెట్‌కు సంబంధించి ప్రత్యేక మీడియా హక్కుల్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)తో సోనీ సంస్థ ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది (2024) నుంచి 2031 సీజన్ ముగిసేదాకా ఏసీసీ ఆధ్వర్యంలో జరిగే పురుషులు, మహిళల ఆసియా కప్, అండర్–19 ఆసియా కప్, ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ మ్యాచ్‌లను సోనీ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.ఈ ఒప్పందంలో టెలివిజన్ ప్రసార హక్కులతో పాటు డిజిటల్, ఆడియో మాధ్యమాలకు సంబంధించిన హక్కులు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడించకపోయినప్పటికీ గతంకంటే 70 శాతం ఎక్కువని ఏసీసీ ప్రకటించింది. ఇది ఆసియా క్రికెట్ టోర్నీలకు ఉన్న ఆదరణను తెలియజేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది.ఏసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ ‘క్రికెట్ నైపుణ్యానికి ఆసియా కప్ మూలస్తంభంలా నిలుస్తోంది. మా కొత్త మీడియా భాగస్వామి సోనీ ప్రపంచ శ్రేణి కవరేజీతో ప్రపంచ వ్యాప్తంగా మరెంతో మంది క్రికెట్ వీక్షకుల్ని సంపాదిస్తుందన్న నమ్మకం ఉంది. పెరిగిన మీడియా హక్కుల విలువతో ఆసియా సభ్యదేశాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో క్రికెట్ కార్యక్రమాలు కూడా పెరుగుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. సోనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ దాయాదులు భారత్, పాక్ సహా ఏసీసీ మ్యాచ్‌లు తమ వీక్షకులకు మరింత వినోదాన్ని పంచుతాయని అన్నారు. -
జై షా స్థానాన్ని భర్తీ చేయనున్న పీసీబీ చీఫ్?
భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ పదవి చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1న ఐసీసీ బాస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా త్వరలోనే బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్నారు.అదే విధంగా.. ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగానూ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న చర్చ జరుగుతుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేరు తెరమీదకు వచ్చింది. జై షా స్థానాన్ని నక్వీ భర్తీ చేయనున్నాడని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.కొత్త బాస్‌గా నక్వీ?‘‘వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో.. కొత్త అధ్యక్షుడిగా మొహ్సిన్ నక్వీ ఎంపిక కానున్నారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు’’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కాగా ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.అయితే, పాక్ బోర్డు మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని పట్టుపట్టగా.. జై షా నేతృత్వంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాక్‌తో పాటు శ్రీలంకను ఆతిథ్య దేశంగా ఎంపిక చేసి.. టీమిండియా మ్యాచ్‌లను అక్కడ నిర్వహించింది. భారత్‌తో పాటు లంక ఫైనల్‌కు చేరగా.. టైటిల్ పోరు కూడా శ్రీలంకలోనే జరిగింది. అయితే, జై షా స్థానంలో నక్వీ వస్తే.. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.ఐసీసీ టోర్నీలకు సన్నాహకాలుగాఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది భారత్‌లో పురుషుల ఆసియాకప్ జరుగనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని2025 సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026కు ముందుగా ఈ టోర్నీని నిర్వహించడం వల్ల.. ఆసియా దేశాలకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. అనంతరం.. ఆసియా కప్-2027నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. -
ACC: ఏసీసీ బాస్‌గా పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ?
ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) తదుపరి అధ్యక్షుడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నియమితుడు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. నఖ్వీ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ప్రస్తుతం ఏసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.జై షా వైదొలిగిన వెంటనేరెండేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఈ ఏడాది జనవరిలో.. మరోసారి ఏసీసీ బాస్‌గా బాధ్యతలు చేపట్టాడు జై షా. ఏడాది పాటు అతడి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకున్న క్రమంలో.. ఇప్పటికీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. అయితే, రొటేషన్ పాలసీ ప్రకారం ఈసారి ఈ పదవి పాక్ బోర్డు చైర్మన్‌ను వరించనున్నట్లు ఏసీసీ వర్గాలు తెలిపాయి.‘‘వచ్చే ఏడాది ఏసీసీ సమావేశంలో.. నఖ్వీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తారు. తదుపరి రెండేళ్లపాటు ఏసీసీ ప్రెసిడెంట్‌గా నఖ్వీ కొనసాగే అవకాశం ఉంది. జై షా వైదొలిగిన వెంటనే అతడి స్థానంలో నఖ్వీ బాధ్యతలు చేపడతాడు’’అని సదరు వర్గాలు జాతీయ మీడియాతో వెల్లడించాయి.వచ్చే ఏడాది భారత్లోకాగా వచ్చే ఏడాది భారత్‌లో ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీ పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు.గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా పాకిస్తాన్లో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్‌ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది.అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోర్నీల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది. -
వచ్చే ఏడాది భారత్‌లో ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ
పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు. గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా పాకిస్తాన్లో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్‌ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోరీ్నల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది. -
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా జై షా
-
Jay Shah: 32 ఏళ్ల వయసులో తొలిసారి.. ముచ్చటగా మూడోసారి
బీసీసీఐ కార్యదర్శి జై షా మరోసారి ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో ఏసీసీ బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా జై షాను తమ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 32 ఏళ్ల వయసులో తొలిసారి.. కాగా జై షా ఏసీసీ బాస్‌గా ఎన్నికకావడం ఇది వరుసగా మూడోసారి. నజ్ముల్ హుసేన్ స్థానంలో 2021లో తొలిసారిగా అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. అప్పటికి జై షాకు 32 ఏళ్లు. ఇక తాజా సమావేశంలో సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా జై షా పదవీ కాలం కొనసాగనుంది. కాగా బీసీసీఐలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన.. ఏసీసీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. కోవిడ్ సమయంలో బాస్‌గా బాధ్యతలు స్వీకరించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రతీ విషయంలోనూ తనదైన ముద్ర ఇక గతేడాది ఆసియా కప్-2023 హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్‌కు టీమిండియాను పంపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పాక్ పంతం వీడకపోతే.. ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి శ్రీలంక- పాక్ వేదికగా టోర్నీని నిర్వహించేలా జై షా ఏర్పాట్లు చేశారు. టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నింటికీ లంక ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ దఫా వన్డే ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ ఈవెంట్ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించి విజేతగా అవతరించింది. కాగా భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడే జై షా అన్న విషయం తెలిసిందే. చదవండి: Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్‌కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం -
ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
అండర్-19 ఆసియాకప్ 2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్ పాండే వ్యవహరించనున్నాడు. ఈ జట్టుతో పాటు ముగ్గురు ట్రావిలింగ్ స్టాండ్‌బై ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఈ మెగా టోర్నీ దుబాయ్ వేదికగా డిసెంబర్ 8 నుంచి అదే నెల 17 వరకు జరగనుంది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్-ఎలో భారత్, నేపాల్, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? డిసెంబర్ 8న భారత్- ఆఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ ఆసియా జెయింట్స్ మధ్య పోరులో లీగ్ మ్యాచ్‌లు అన్నీ ఐసీసీ అకాడమీలో జరగనున్నాయి. సెమీఫైనల్-1, ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇక ఈ టోర్నీలో డిసెంబర్ 10న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. భారత అండర్-19 జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), అభిషేక్, ఇన్నేష్ మహాజన్ , ఆరధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. స్టాండ్‌బై ఆటగాళ్లు: ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్. రిజర్వ్ ఆటగాళ్లు: దిగ్విజయ్ పాటిమ్ జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే. చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. 17 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! -
ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
అండర్-19 పురుషుల ఆసియాకప్-2023 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ దుబాయ్ వేదికగా డిసెంబర్ 8 నుంచి అదే నెల 17 వరకు జరగనుంది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. ఈ 8 జట్లను మొత్తం రెండు గ్రూపులుగా ఏసీసీ విభజించింది. గ్రూప్-ఎలో భారత్, నేపాల్, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి. డిసెంబర్ 8న భారత్- ఆఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ ఆసియా జెయింట్స్ మధ్య పోరులో లీగ్ మ్యాచ్‌లు అన్నీ ఐసీసీ అకాడమీలో జరగనున్నాయి. సెమీఫైనల్-1, ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇక ఈ టోర్నీలో డిసెంబర్ 10న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. కాగా ఈవెంట్లో భారత్ డిఫెండింగ్ ఛాపింయన్స్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరగా 2021లో జరిగిన ఆసియాకప్‌లో శ్రీలంకను చిత్తు చేసి భారత్ టైటిల్‌ను ముద్దాడింది. చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్... హైదరాబాదీలకు బ్యాడ్‌న్యూస్! -
ఆసియా కప్-2023 విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్
2023 ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా ఎగరేసుకుపోయింది. ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 🏏🏟️ Big Shoutout to the Unsung Heroes of Cricket! 🙌 The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. 🏆 Their unwavering commitment and… — Jay Shah (@JayShah) September 17, 2023 తెర వెనుక హీరోలకు గుర్తింపు.. 2023 ఆసియా కప్ విజయవంతం కావడంలో కొలొంబో, క్యాండీ మైదానాల సహాయ సిబ్బంది, పిచ్ క్యూరేటర్ల పాత్ర చాలా కీలకమైంది. వీరి కమిట్మెంట్ లేనిది ఆసియా కప్ అస్సలు సాధ్యపడేది కాదు. కీలక మ్యాచ్‌లు జరిగిన సందర్భాల్లో వర్షాలు తీవ్ర ఆటంకాలు కలిగించగా.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్ ఎంతో అంకితభావంతో పని చేసి మ్యాచ్‌లు సాధ్యపడేలా చేశారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గ్రౌండ్స్‌మెన్ సేవలు వెలకట్టలేనివి. Join us in appreciating the Sri Lanka groundsmen 👏👏 pic.twitter.com/0S7jpERgxj — CricTracker (@Cricketracker) September 17, 2023 వారు ఎంతో అప్రమత్తంగా ఉండి, వర్షం పడిన ప్రతిసారి కవర్స్‌తో మైదానం మొత్తాన్ని కప్పేశారు. స్థానికమైన ఎన్నో టెక్నిక్స్‌ను ఉపయోగించి, వీరు మైదానాన్ని ఆర బెట్టిన తీరు అమోఘమని చెప్పాలి. వీరి పనితనానికి దేశాలకతీతంగా క్రికెట్ అభిమానులు ముగ్దులైపోయారు. ఆసియా కప్-2023 నిజమైన విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్ అని సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అంతిమంగా వీరి కష్టానికి తగిన గుర్తింపు దక్కింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ).. కొలొంబో, క్యాండీ మైదానాల గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లకు 50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీని ప్రకటించారు. వారి కమిట్మెంట్, హార్డ్వర్క్లకు ఇది గుర్తింపు అని ఏసీసీ చైర్మన్ జై షా అన్నారు. వీరు లేనిది ఆసియా కప్-2023 సాధ్యపడేది కాదని షా ప్రశంసించారు. కాగా, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ తనకు లభించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. -
Asia Cup 2023: కొలొంబోలో భారీ వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం..!
ఆసియా కప్-2023 సూపర్-4 మ్యాచ్‌లకు వేదిక అయిన కొలొంబోలో భారీ వర్షాలు కురుస్తాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. వేదికను కొలొంబో నుంచి డంబుల్లా లేదా హంబన్‌తోటకు మార్చాలని ఏసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సూపర్-4 దశలో మొదటి మ్యాచ్ (సెప్టెంబర్ 6, లాహోర్) మినహాయించి, మిగతా మ్యాచ్‌లన్నిటికీ కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. సూపర్-4 మ్యాచ్‌లతో పాటు సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరగాల్సి ఉంది. కొలొంబో వాతావరణ శాఖ వారి తాజా హెచ్చరికల నేపథ్యంలో వేదిక మార్చే అంశాన్ని ఏసీసీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, భారత్, పాక్‌ల మధ్య పల్లెకెలెలో నిన్న (సెప్టెంబర్ 2) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సూపర్-4 దశలో భారత్-పాక్‌లు మరోసారి (సెప్టెంబర్ 10) తలపడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకునే ఏసీసీ వేదిక మార్పు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భారత్-నేపాల్‌ల మధ్య రేపు జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా టీమిండియా సూపర్-4కు చేరుకుంటుంది. రేపటి మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగి నేపాల్ గెలిస్తే పాక్‌తో పాటు ఆ జట్టే సూపర్-4కు చేరుకుంటుంది. ఇది ఎలాగూ సాధ్యపడే విషయం కాదు కాబట్టి, సూపర్-4లో మరోసారి భారత్-పాక్ మ్యాచ్ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం. -
ACC Emerging Asia Cup 2023: సెమీఫైనల్లో భారత్ ‘ఎ’
కొలంబో: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోరీ్నలో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట నేపాల్ 39.2 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (65; 7 ఫోర్లు) రాణించాడు. గుల్షన్ ఝా (38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్ ‘ఎ’ బౌలర్లలో నిశాంత్ సింధు 4, రాజ్వర్ధన్ 3, హర్షిత్ రాణా 2 వికెట్లు తీశారు. తర్వాత సులువైన లక్ష్యాన్ని భారత జట్టు 22.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (87; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (58 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. ధ్రువ్ (21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా పరుగులు చేశాడు. ఈ గ్రూపులో బుధవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ‘ఎ’తో తలపడుతుంది. -
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ తేదీలు వచ్చేశాయి
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎట్టకేలకు ఆసియాకప్-2023 నిర్వహణపై ఉత్కంఠ వీడింది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన తేదీలను, వేదికలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్, శ్రీలంక వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్ జరగనుంది. కాగా మొత్తం ఈవెంట్లో ఫైనల్‌తో కలిపి మొత్తం 13 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్లో, తొమ్మిది మ్యాచ్‌లో శ్రీలంకలో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. ఇక వాస్తవానికి ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీకి పూర్తిగా పాకిస్థాన్ అతిథ్యం ఇవ్వాల్సింది. అయితే పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. ఏసీసీ హైబ్రిడ్ మోడల్‌కే మొగ్గు చూపింది. ఇక ఏడాది వన్డే ఫార్మాట్లో జరగనున్న ఆసియాకప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతీ గ్రూప్‌లో మూడు టీమ్‌లు ఉంటాయి. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ స్టేజ్‌కి అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్ స్టేజ్‌లోని మొదటి రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. చదవండి: Ashes 2023: యాషెస్ సిరీస్‌కు సర్వం సిద్దం.. ఇరు జట్ల బలాబలాలు ఇలా..! Dates and venues have been finalised for the Asia Cup 2023! The tournament will be held from 31st August to 17th September in a hybrid model - with 4 matches being held in Pakistan and the rest in Sri Lanka! https://t.co/bvkfSSAp9w#AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) June 15, 2023 -
Ind Vs Pak: మరోసారి దాయాదుల పోరు.. ఒకే గ్రూపులో భారత్- పాక్
Asian Cricket Council- cricket calendars- India Vs Pakistan: ఆసియా క్రికెట్ టోర్నీకి సంబంధించి 2023-24 క్యాలెండర్ గురువారం విడుదలైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పురుషుల ఆసియా కప్ ఈవెంట్ ఈ సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా మెగా టోర్నీలో దాయాదులు భారత్- పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇక శ్రీలంక కూడా ఇదే గ్రూపులో ఉండగా.. క్వాలిఫైయర్స్‌లో గెలిచిన జట్టు బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లతో చేరనుంది. ఈ మేరకు 2023- 24 క్రికెట్ క్యాలెండర్స్ పేరిట జై షా ట్వీట్ చేశారు. అది మాత్రం చెప్పలేదు! కాగా ఆసియా వన్డే కప్-2023 ఎప్పుడన్న విషయం చెప్పిన జై షా.. వేదిక గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. నిజానికి పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదంటూ జై షా గతంలో వ్యాఖ్యానించారు. దీంతో బీసీసీఐ- పీసీబీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ- పీసీబీ చైర్మన్ నజీమ్ సేతీ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేయడం విశేషం. పురుషుల ఛాలెంజర్స్ కప్‌తో ఆరంభం ఇక కొత్త క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది ఆసియా టోర్నీ పురుషుల ఛాలెంజర్స్ కప్(వన్డే)తో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొంటాయి. వీటిలో బహ్రెయిన్, సౌదీ అరేబియా, భూటాన్, చైనా, మయన్మార్, మాల్దీవులు, థాయిలాండ్, ఇరాన్ ఉండగా.. మరో రెండు జట్ల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. ఐదు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చిలో మెన్స అండర్-16 రీజినల్ టోర్నమెంట్ జరుగనుంది. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. ఇదిలా ఉంటే.. చాలెంజర్స్ కప్ విన్నర్, రన్నరప్ ఏప్రిల్‌లో జరిగే మెన్స్ ప్రీమియర్ కప్(వన్డే ఫార్మాట్)కు అర్హత సాధిస్తాయి. మొత్తంగా 24 మ్యాచ్‌లు ఆడతాయి. ఇక జూన్‌లో వుమెన్స్ టీ20 ఎమెర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ జరుగనుంది. ఇందులో రెండు గ్రూపుల్లో నాలుగేసి జట్ల చొప్పున ఎనిమిది జట్లు ఉంటాయి. ఒక గ్రూపులో ఇండియా- ఎ, పాకిస్తాన్- ఎ, థాయ్‌లాండ్, హాంకాంగ్ ఉంటాయి. మరో గ్రూపులో బంగ్లాదేశ్- ఎ, శ్రీలంక- ఎ, యూఈఏ, మలేషియా టీమ్‌లు ఉంటాయి. దీని తర్వాత మెన్స్ ఎమెర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ జరుగుతుంది. మేజర్ టోర్నీ ఇక వీటన్నిటిలో మేజర్ టోర్నీ అయిన పురుషుల ఆసియా వన్డే 2023 కప్ సెప్టెంబరులో జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఒక గ్రూపులో.. మరో గ్రూపులో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, క్వాలిఫైయర్ జట్టు ఉంటుంది. మొత్తంగా 13 మ్యాచ్‌లు జరుగుతాయి. PC: Jay Shah Twitter/ ACC PC: Jay Shah Twitter/ ACC Presenting the @ACCMedia1 pathway structure & cricket calendars for 2023 & 2024! This signals our unparalleled efforts & passion to take this game to new heights. With cricketers across countries gearing up for spectacular performances, it promises to be a good time for cricket! pic.twitter.com/atzBO4XjIn — Jay Shah (@JayShah) January 5, 2023 -
Asia Cup 2023: జై షా వ్యాఖ్యలపై పీసీబీ స్పందన.. ఏకపక్షంగా..
Asia Cup 2023- BCCI Jay Shah- PCB: ‘‘ఆసియా కప్-2023 టోర్నీ నిర్వహణను తటస్థ వేదికకు మార్చనున్నామంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు పీసీబీని ఆశ్చర్యపరిచాయి. నిరాశకు గురిచేశాయి. ఏసీసీలోని సభ్యులతో గానీ.. ఆతిథ్య దేశ బోర్డుతో గానీ చర్చించకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’’ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించింది. కాగా ముంబైలో జరిగిన 91వ సర్వసభ్య సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తటస్థ వేదికపైనే ఆసియా కప్-2023ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాం ఈ ప్రకటనపై తాజాగా స్పందించిన పీసీబీ.. ‘‘ఏసీసీ బోర్డు, సభ్యుల సహకారంతో ఆసియా కప్ నిర్వహించేందుకు పాక్ సిద్ధమైంది. ఎంతో సంతోషించింది. కానీ.. షా మాత్రం ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. 1983, సెప్టెంబరులో రూపుదిద్దుకున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిబంధనల స్ఫూర్తికి ఆయన ప్రకటన విరుద్ధంగా ఉంది. ఆసియా క్రికెట్ మండలి సభ్య దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా.. ఆసియా ఖండంలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పడింది. కానీ ఇలాంటి ప్రకటనలు ఆసియా క్రికెట్ దేశాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయి. తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో పాకిస్తాన్.. ఇండియా పర్యటన.. అదే విధంగా 2024-2031 సైకిల్‌కు సంబంధించిన ఐసీసీ ఈవెంట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏసీసీ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు సంబంధించి పీసీబీకి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ విషయంలో ఏసీసీ జోక్యం చేసుకుని.. సున్నితమైన ఈ అంశం గురించి చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసియా కప్-2023 పాక్‌లో నిర్వహించాల్సి ఉండగా.. వన్డే వరల్డ్‌కప్-2023కు భారత్ వేదిక కానున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఏసీసీ, ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు పోటీపడుతున్నాయి. చదవండి: Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ కోచ్ ఘాటు వ్యాఖ్యలు.. పొట్టలు వేలాడేసుకుని, ఒళ్లు సహకరించక T20 World Cup 2022: ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ సహా ఆ మ్యాచ్‌లన్నీ వర్షార్పణం