ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే? | India U-19 squad for Asia Cup announced, Uday Saharan to lead | Sakshi
Sakshi News home page

U19 Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే?

Published Sat, Nov 25 2023 5:45 PM | Last Updated on Sat, Nov 25 2023 5:59 PM

India U-19 squad for Asia Cup announced, Uday Saharan to lead - Sakshi

ఉదయ్ సహారన్ (PC: Instagram)

అండర్‌-19 ఆసియాకప్‌ 2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్ పాండే వ్యవహరించనున్నాడు. ఈ జట్టుతో పాటు ముగ్గురు ట్రావిలింగ్‌ స్టాండ్‌బై ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.

కాగా ఈ మెగా టోర్నీ దుబాయ్‌ వేదికగా డిసెంబర్‌ 8 నుంచి అదే నెల 17 వరకు జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్‌-ఎలో భారత్‌, నేపాల్‌, ఆఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌ జట్లు ఉన్నాయి. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి.

తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?
డిసెంబర్‌ 8న భారత్‌- ఆఫ్గానిస్తాన్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ ఆరంభం కానుంది. ఈ ఆసియా జెయింట్స్‌ మధ్య పోరులో లీగ్‌ మ్యాచ్‌లు అన్నీ ఐసీసీ అకాడమీలో జరగనున్నాయి. సెమీఫైనల్‌-1, ఫైనల్‌ దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇక ఈ టోర్నీలో డిసెంబర్‌ 10న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. 

భారత అండర్‌-19 జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్‌ కీపర్‌), అభిషేక్, ఇన్నేష్ మహాజన్ , ఆరధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.

స్టాండ్‌బై ఆటగాళ్లు: ప్రేమ్ దేవ్‌కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్.
రిజర్వ్ ఆటగాళ్లు: దిగ్విజయ్ పాటిమ్ జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే.

చదవండిIPL 2024: ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం.. 17 కోట్ల ఆటగాడికి గుడ్‌బై!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement