ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే? | U19 Men's Asia Cup 2023 Schedule Announced | Sakshi
Sakshi News home page

U19 Asia Cup 2023: ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

Published Wed, Nov 8 2023 5:31 PM | Last Updated on Wed, Nov 8 2023 5:40 PM

U19 Asia Cup 2023 Schedule Announced - Sakshi

భారత అండర్‌-19 జట్టు(ఫైల్‌ ఫోటో)

అండర్‌-19 పురుషుల ఆసియాకప్‌-2023 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ బుధవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ దుబాయ్‌ వేదికగా డిసెంబర్‌ 8 నుంచి అదే నెల 17 వరకు జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. 

ఈ 8 జట్లను మొత్తం రెండు గ్రూపులుగా ఏసీసీ విభజించింది. గ్రూప్‌-ఎలో భారత్‌, నేపాల్‌, ఆఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌ జట్లు ఉన్నాయి. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి.

డిసెంబర్‌ 8న భారత్‌- ఆఫ్గానిస్తాన్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ ఆసియా జెయింట్స్‌ మధ్య పోరులో లీగ్‌ మ్యాచ్‌లు అన్నీ ఐసీసీ అకాడమీలో జరగనున్నాయి. సెమీఫైనల్‌-1, ఫైనల్‌ దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరగనున్నాయి.

ఇక ఈ టోర్నీలో డిసెంబర్‌ 10న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. కాగా ఈవెంట్‌లో భారత్‌ డిఫెండింగ్‌ ఛాపింయన్స్‌ హోదాలో బరిలోకి దిగనుంది.  చివరగా 2021లో జరిగిన ఆసియాకప్‌లో శ్రీలంకను చిత్తు చేసి భారత్‌ టైటిల్‌ను ముద్దాడింది.
చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్‌... హైదరాబాదీలకు బ్యాడ్‌న్యూస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement