Asia Cup 2023 Schedule: Dates and Venues Announced - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఆసియా కప్ తేదీలు వచ్చేశాయి

Published Thu, Jun 15 2023 5:39 PM | Last Updated on Thu, Jun 15 2023 5:56 PM

Dates And Venues For Asia Cup 2023 Announced - Sakshi

క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఎట్టకేలకు ఆసియాకప్‌-2023 నిర్వహణపై ఉత్కంఠ వీడింది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన తేదీలను, వేదికలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఆసియాకప్‌ పాకిస్తాన్, శ్రీలంక వేదికలగా హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్ జరగనుంది.

కాగా మొత్తం ఈవెంట్‌లో ఫైనల్‌తో కలిపి మొత్తం 13 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో, తొమ్మిది మ్యాచ్‌లో  శ్రీలంకలో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. ఇక వాస్తవానికి ఈ ఏడాది ఆసియా కప్‍ టోర్నీకి పూర్తిగా పాకిస్థాన్ అతిథ్యం ఇవ్వాల్సింది.

అయితే పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. ఏసీసీ హైబ్రిడ్ మోడల్‍కే మొగ్గు చూపింది. ఇ‍క ఏడాది వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఆసియాకప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు.

ప్రతీ గ్రూప్‍లో మూడు టీమ్‍లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌ నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ స్టేజ్‌కి అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్ స్టేజ్‌లోని మొదటి రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయి.
చదవండి: Ashes 2023: యాషెస్ సిరీస్‌కు సర్వం సిద్దం.. ఇరు జట్ల బలాబలాలు ఇలా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement