పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టి20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు.
గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా పాకిస్తాన్‌లో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్‌ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది.
అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్‌లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోరీ్నల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment