ఆసీస్‌ మహిళల ‘ఎ’ జట్టుదే సిరీస్‌ | Australia A Women Team Win ODI Series By 2-1 | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ మహిళల ‘ఎ’ జట్టుదే సిరీస్‌

Published Tue, Dec 17 2019 1:49 AM | Last Updated on Tue, Dec 17 2019 1:49 AM

Australia A Women Team Win ODI Series By 2-1 - Sakshi

అరుంధతి రెడ్డి

బ్రిస్బేన్‌: సిరీస్‌ విజేతను నిర్ణయించే అనధికారిక మూడో వన్డేలో భారత మహిళల ‘ఎ’ జట్టు సమష్టిగా విఫలమైంది. దీంతో చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు  3 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి (70 బంతుల్లో 45; 2 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్‌ వేద కృష్ణమూర్తి (61 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఆకట్టుకుంది.

ఓపెనర్‌ షఫాలీ వర్మ (0) నిరాశ పరిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్ట్రానో 3 వికెట్టు తీయగా... అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ , తహిలా మెక్‌గ్రాత్‌ చెరో రెండు వికెట్లతో రాణించారు. అనంతరం స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ 39.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. 119/7తో కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను బర్న్స్‌ (52 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), స్ట్రానో (37 బంతుల్లో 22 నాటౌట్‌; 2 ఫోర్లు) ఆదుకున్నారు. వీరు అజేయంగా ఎనిమిదో వికెట్‌కు 58 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లు, తనూజా కన్వర్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement