ఇండియా ‘ఎ’ జట్టు ఎంపిక నేడు
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును బుధవారం సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. బంగ్లాదేశ్‌తో త్వరలో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపికై, ఇంగ్లండ్ పర్యటనకు స్థానం దక్కని ఆటగాళ్లకు ప్రధానంగా ఇందులో అవకాశం లభించవచ్చు. ఇటీవల ఐపీఎల్-7లో అద్భుతంగా రాణించి బంగ్లా సిరీస్‌లో ఆడనున్న రాబిన్ ఉతప్ప ఈ జాబితాలో ముందున్నాడు.
అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్‌కూ అవకాశం దక్కవచ్చు. రంజీ ట్రోఫీలో నిలకడైన ప్రదర్శనతో కర్ణాటకను గెలిపించిన మనీశ్ పాండేకు కూడా స్థానం లభించే అవకాశం ఉంది. జూలై 6 నుంచి ఆగస్టు 12 వరకు ఈ పర్యటన కొనసాగుతుంది.
అక్షర్, పాండేలకు అవకాశం!
Published Wed, Jun 11 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM
Advertisement
Advertisement