India Tour Of Bangladesh 2022: న్యూజిలాండ్ పర్యటన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌కు పయనం కానుంది. కివీస్ టూర్‌కు గైర్హాజరైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఈ క్రమంలో డిసెంబరు 4 నుంచి రోహిత్ సారథ్యంలో వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే అంతకంటే ముందు అంటే.. మంగళవారం నుంచి భారత- ఏ జట్టు బంగ్లా-ఏ జట్టుతో తలపడనుంది.
ఇక ఈ పర్యటనలో భారత ఏ జట్టు రెండు టెస్టులు ఆడనుండగా.. రోహిత్ సేన మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బంగ్లా పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, ప్రత్యక్ష ప్రసారాలు, జట్లు తదితర వివరాలు
బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన భారత- ఏ జట్టు
బంగ్లాదేశ్-ఏ జట్టుతో నాలుగు రోజుల టెస్టులు ఆడనున్న భారత- ఏ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో తెలుగు యువ కెరటం తిలక్ వర్మకు చోటు దక్కింది.
జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కన్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ షేత్.
షెడ్యూల్ ఇలా
మొదటి టెస్టు: నవంబరు 29- డిసెంబరు 2- కాక్స్ బజార్
రెండో టెస్టు: డిసెంబరు 6- డిసెంబరు 9- సెహ్లెట్ స్టేడియం
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్- షెడ్యూల్
మొదటి వన్డే: డిసెంబరు 4- ఆదివారం- షేర్- ఏ బంగ్లా నేషనల్ స్టేడియం- ఢాకా
రెండో వన్డే: డిసెంబరు 7- బుధవారం- షేర్- ఏ బంగ్లా నేషనల్ స్టేడియం- ఢాకా
మూడో వన్డే: డిసెంబరు 10- శనివారం- షేర్- ఏ బంగ్లా నేషనల్ స్టేడియం- ఢాకా
భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఆరంభం
జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.
టెస్టు సిరీస్
తొలి టెస్టు డిసెంబరు 14- 18: జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చట్టోగ్రామ్
రెండో టెస్టు డిసెంబరు 22- 26: షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా
భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మ్యాచ్‌లు ఆరంభం
జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ,మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్.
లైవ్ స్ట్రీమింగ్
భారత్‌లో- సోనీ లివ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం
టీవీ బ్రాడ్‌కాస్టర్- సోనీ స్పోర్ట్స్ 3(హిందీ)
సోనీ స్పోర్ట్స్ 4(తమిళ్/తెలుగు)
సోనీ స్పోర్ట్స్ 5(ఇంగ్లిష్)
బంగ్లాదేశ్‌లో- టీవీ బ్రాడ్‌కాస్టర్ గాజీ టీవీ
చదవండి: NZ vs IND: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. పంత్‌కు నో ఛాన్స్! దీపక్ వైపే మొగ్గు
IPL 2023: యువ బ్యాటర్ కోసం సంజూ శాంసన్ ప్లాన్! భారీ ధర పలికే అవకాశం?
Comments
Please login to add a commentAdd a comment