
ఇంగ్లండ్‌లో పర్యటించే భారత ‘ఎ’ జట్లను కూడా సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. వన్డే టీమ్‌కు శ్రేయస్ అయ్యర్, అనధికారిక టెస్టులు ఆడే జట్టుకు కెప్టెన్‌గా కరుణ్ నాయర్ వ్యవహరిస్తారు. ఆంధ్ర బ్యాట్స్‌మన్ గాదె హనుమ విహారికి ఈ రెండు టీమ్‌లలోనూ స్థానం లభించగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ నాలుగు రోజుల మ్యాచ్‌ల (అనధికారిక టెస్టులు)లో తలపడే జట్టులో చోటు దక్కింది. ఈ టూర్‌లో భారత ‘ఎ’ జట్టు... ఇంగ్లండ్ ‘ఎ’, వెస్టిండీస్ ‘ఎ’లతో తలపడుతుంది.
వన్డే ‘ఎ’ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, విహారి, సంజు శామ్సన్, దీపక్ హుడా, రిషభ్ పంత్, విజయ్ శంకర్, గౌతమ్, అక్షర్ పటేల్, కృనాల్ పాండ్యా, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్.
టెస్టు ‘ఎ’ జట్టు: కరుణ్ నాయర్ (కెప్టెన్), ఆర్.సమర్థ్, మయాంక్ అగర్వాల్, ఈశ్వరన్, పృథ్వీ షా, అంకిత్ బావ్నే, విజయ్ శంకర్, కేఎస్ భరత్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అంకిత్ రాజ్‌పుత్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, రజనీశ్ గుర్బాని.
Comments
Please login to add a commentAdd a comment