మిలింద్‌కు చోటు | Hyderabad's CV Milind included in India 'A' team | Sakshi
Sakshi News home page

మిలింద్‌కు చోటు

Published Sun, Jan 29 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

మిలింద్‌కు చోటు

మిలింద్‌కు చోటు

బంగ్లాతో ప్రాక్టీస్‌కు భారత్‌ ‘ఎ’ జట్టు ప్రకటన  
న్యూఢిల్లీ: భారత్‌ ‘ఎ’ జట్టులో హైదరాబాదీ ఆటగాడు సి.వి.మిలింద్‌కు చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసం 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. తమిళనాడుకు చెందిన అభినవ్‌ ముకుంద్‌ ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ వచ్చే నెల 5, 6 తేదీల్లో  జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతుంది.

భారత్‌ ‘ఎ’ జట్టు: ముకుంద్‌ (కెప్టెన్‌), ప్రియాంక్‌ పంచాల్, శ్రేయస్‌ అయ్యర్, ఇషాంక్‌ జగ్గీ, రిషభ్‌ పంత్, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), విజయ్‌ శంకర్, హార్దిక్‌ పాండ్యా, షాబాజ్‌ నదీమ్, జయంత్‌ యాదవ్, కుల్‌దీప్‌ యాదవ్, అనికేత్‌ చౌదరి, సీవీ మిలింద్, నితిన్‌ సైని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement