
ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ లగ్జరీ బ్రాండ్ ‘ఎంజీ సెలెక్ట్’ డీలర్‌గా ‘ఐకానిక్ ఆటోమొబైల్స్’ ఎన్నికైంది. బెంగళూరు కేంద్రంగా కొత్త తరం కొనుగోలుదారులకు నాణ్యమైన సేవలు అందించనుంది.
ఎంజీ సెలెక్ట్ బ్రాండ్‌లో భాగంగా వస్తున్న తొలి విద్యుత్ స్పోర్ట్స్ కారు ‘సైబర్‌స్టర్’, ఎంజీ ఎం9 మోడళ్లను కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని ఎంజీ సెలెక్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మిలింద్ అన్నారు. ఐకానిక్ ఆటోమొబైల్స్‌తో మొత్తం 12 డీలర్లను ఎంజీ సెలెక్ట్ ఎంపిక చేసుకుంది. ఈ డీలర్íÙప్ భాగస్వాములు దేశవ్యాప్తంగా 13 నగరాల్లో నెలకొల్పిన 14 ఎంజీ సెలెక్ట్ టచ్ పాయింట్ల ద్వారా సేవలు అందించనున్నాయి.