వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమవుతోంది. ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది. జూలై 12 నుంచి డొమెనికా వేదికగా భారత్-విండీస్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా స్ధానిక జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ రెండు రోజులు(జూలై 5, 6) పాటు జరగనుంది.
ఇక ఈ విషయం పక్కన పెడితే.. విండీస్ తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడం భారత జట్టుకు పెద్ద సవాలుగా మారింది. ఎందకంటే ఈ సిరీస్‌కు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను పక్కన పెట్టడంతో ఆ స్ధానాన్ని ఎవరితో భర్తీ చేయాలో ఆర్ధంకాక మెనెజ్‌మెంట్ తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.
ఆ స్ధానంలో యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్ లేదా రుత్‌రాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వాలో తెలియక సందిగ్థంలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ దేశావాళీ క్రికెట్‌లో ఓపెనర్లగా ఆడిన అనుభవం ఉంది గానీ టాపర్డర్‌లో అంతగా ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ వీరిద్దరూలో ఎవరో ఒకరు విండీస్ తొలి టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయం. అది ఎవరన్నది తొలి టెస్టు వరకు వేచి చూడక తప్పదు
కిషన్ అరంగేట్రం..
ఇక విండీస్‌తో తొలి టెస్టుతో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో యువ వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ విండీస్ టెస్టులకు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం అనుమానమే. భరత్ వికెట్లు వెనుక అద్భుతంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన భరత్.. ఆ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కేవలం 101 పరుగులు చేశాడు. దీంతో పాటు ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా కేఎస్ భరత్‌కి ఫైనల్‌లో అవకాశం లభించింది. అక్కడ కూడా బ్యాట్‌తో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడిని పక్కన పెట్టి కిషన్‌కు ఓ అవకాశం ఇచ్చి చూడాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
చదవండి: Kohli And Rohit Sharma: ‘అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్..’
Comments
Please login to add a commentAdd a comment