‘శత’క్కొట్టిన శ్రీకర్‌ భరత్‌.. అశ్విన్‌ సెంచరీ.. ఆంధ్ర జట్టు విజయం | Vijay Hazare Trophy: Andhra Beat Himachal Pradesh Hyderabad Lost To Uttar Pradesh | Sakshi
Sakshi News home page

KS Bharat - Ashwin Hebbar: ‘శత’క్కొట్టిన శ్రీకర్‌ భరత్‌.. అశ్విన్‌ సెంచరీ.. ఆంధ్ర జట్టు విజయం

Published Mon, Dec 13 2021 7:29 AM | Last Updated on Mon, Dec 13 2021 7:42 AM

Vijay Hazare Trophy: Andhra Beat Himachal Pradesh Hyderabad Lost To Uttar Pradesh - Sakshi

Vijay Hazare Trophy: Andhra Beat Himachal Pradesh Hyderabad Lost To Uttar Pradesh: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌తో ఆదివారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది. భారత జట్టు రిజర్వ్‌ వికెట్‌ కీపర్, ఆంధ్ర జట్టు కెప్టెన్‌ కోన శ్రీకర్‌ భరత్‌ ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 109 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్‌లతో 161 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఓపెనర్‌ అశ్విన్‌ హెబ్బార్‌ (132 బంతుల్లో 100; 10 ఫోర్లు) కూడా సెంచరీ సాధించాడు. ఆంధ్ర జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు సాధించింది. అనంతరం 323 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టు 46 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్‌ రెడ్డి నాలుగు వికెట్లు తీశాడు. 

మళ్లీ ఓడిన హైదరాబాద్‌ 
మరోవైపు మొహాలీలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు ఏడు వికెట్లతో ఓడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 42.5 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్‌ 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. 

చదవండి: Vijay Hazare Trophy MP VS CG: శతక్కొట్టాక రజనీ స్టైల్‌లో ఇరగదీసిన వెంకటేశ్‌ అయ్యర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement