సాక్షి,హైదరాబాద్: బేగంబజార్ పోలీస్టేషన్ పరిధిలోని తొఫ్ఖానాలో దారుణం జరిగింది. సిరాజ్ అనే వ్యక్తి తన భార్య, చిన్న కుమారుడిని హతమార్చాడు. ఆపై తాను ప్రాణాలు తీసుకున్నాడు.
అయితే, తండ్రి తన తమ్ముడి ప్రాణాలు తీస్తుంటే భయాందోళనకు గురైన పెద్ద కొడుకు ఇంటి నుంచి పారిపోయాడు. తండ్రి చేస్తున్న ఘోరాన్ని చూసి తట్టుకోలేక కాపాడండి అంటూ బిగ్గరుగా కేకలు వేశాడు. ఈ దుర్ఘటనపై సమాచారం బేగం బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా, మృతుడు మహమ్మద్ సిరాజ్ అలీ,భార్య హేలియ,కుమారుడు హైజాన్‌లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు సిరాజ్ రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా బాధితులు బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు నిర్ధారించారు.
దేశంలో ప్రతిరోజూ 78 హత్యలు
దేశంలో ప్రతిరోజూ 78 హత్యలు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. క్రైమ్ ఇన్ ఇండియా-2022 పేరిట విడుదల చేసిన నివేదికలో హత్య కేసుల సంఖ్య 2021లో 29,272 కాగా, 2020లో 29,193కి తగ్గిందని హైలెట్ చేసింది.
2022లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 3,491 హత్యల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ (2,930), మహారాష్ట్ర (2,295), మధ్యప్రదేశ్ (1,978), రాజస్థాన్ (1,834), పశ్చిమ బెంగాల్ (1,696)లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్‌సీఆర్‌బీఐ ప్రకారం.. సిక్కిం (9), నాగాలాండ్ (21), మిజోరాం (31), గోవా (44),మణిపూర్ (47) 2022లో హత్య కేసులు తక్కువగా నమోదయ్యాయి.
2022లో అత్యధిక హత్య కేసుల్లో 9,962 కేసులతో వివాదాలే కారణమని డేటా వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,130, తమిళనాడు (1,045), బీహార్ (980), మధ్యప్రదేశ్ (726), ఉత్తరప్రదేశ్ (710) ఈ తరహా కేసులు నమోదయ్యాయి. వివాదాల తర్వాత, 'వ్యక్తిగత పగ లేదా శత్రుత్వం' 2022లో నమోదైన 3,761 కేసులతో జాబితాలో ఉంది. బీహార్ (804), మధ్యప్రదేశ్ (364), కర్ణాటక (353) ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి.
పైన పేర్కొన్న దారుణల్లో వరకట్నం, మంత్రవిద్య, మానవ అక్రమ రవాణ,మత, కులతత్వం, రాజకీయ కారణాలు, వర్గ ఘర్షణలు, పరువు హత్యలు, ప్రేమ వ్యవహారాలే ప్రధాన కారణమని నిర్ధారించింది.
Comments
Please login to add a commentAdd a comment