ఉత్తర్‌ప్రదేశ్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి.. | uttar pradesh beat hyderabad by 7 wickets In Syed Mushtaq Ali Trophy 2022 | Sakshi
Sakshi News home page

Syed Mushtaq Ali Trophy 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి..

Published Fri, Oct 21 2022 9:02 AM | Last Updated on Fri, Oct 21 2022 10:02 AM

uttar pradesh beat hyderabad by 7 wickets In Syed Mushtaq Ali Trophy 2022 - Sakshi

జైపూర్‌: దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’లో హైదరాబాద్‌కు మూడో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

ఠాకూర్‌ తిలక్‌ వర్మ (37 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరో సారి జట్టు టాప్‌ స్కోరర్‌గా నిలవగా, భవేశ్‌ సేఠ్‌ (27), రవితేజ (18) రెండంకెల స్కోరు చేశారు. కరణ్‌ శర్మ 3, కార్తీక్‌ త్యాగి 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం యూపీ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆర్యన్‌ జుయాల్‌ (58 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో చెలరేగగా, కరణ్‌ శర్మ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించాడు.
చదవండిT20 World Cup 2022: నమీబియాపై యూఏఈ విజయం.. నెదర్లాండ్స్‌ సెలబ్రేషన్స్‌ అదుర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement