దేశవాలీ క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టును ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ జట్టులో టీమిండియా ఆటగాళ్లు రింకూ సింగ్, నితీశ్ రాణా, పియూశ్ చావ్లా, శివమ్ మావికి చోటు దక్కింది. ఈ జట్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సోదరుడు కార్తికేయ జైస్వాల్ కూడా ఉన్నాడు. ఈ టోర్నీలో భువీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) మాధవ్ కౌశిక్ వ్యవహరిస్తాడు.
టోర్నీ విషయానికొస్తే.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024-25 నవంబర్ 23 నుంచి మొదలవుతుంది. 38 జట్లు పాల్గొనే ఈ టోర్నీ దేశంలోని 12 వేర్వేరు వేదికలపై జరుగనుంది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో యూపీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మణిపూర్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్ జట్లు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆడనుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో యూపీ ఢిల్లీని ఢీకొట్టనుంది.
కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ విషయానికొస్తే.. భువీకి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. భువీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారధిగా వ్యవహరించాడు. భువీ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీని నాయకత్వం వహించాడు. ఇందులో ఆరెంజ్ ఆర్మీ రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ఆరింట ఓడింది.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టు..
భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), మాధవ్ కౌశిక్ (వైస్ కెప్టెన్), కరణ్ శర్మ, రింకూ సింగ్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, స్వస్తిక్ చికార, ప్రియమ్ గార్గ్, ఆర్యన్ జుయల్, పియూశ్ చావ్లా, విప్రాజ్ నిగమ్, కార్తికేయ జైస్వాల్, శివమ్ శఱ్మ, యవ్ దయాల్, మొహిసిన్ ఖాన్, ఆకిబ్ ఖాన్, శివమ్ మావి, వినీత్ పన్వర్
Comments
Please login to add a commentAdd a comment