తిలక్‌ వర్మ విఫలం.. అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ విధ్వంసం | SMAT 2024 PUN Vs HYD: Tilak Varma Fails Milind Innings Goes In Vain As Hyd Loss To Punjab, Check Out Full Score Details | Sakshi
Sakshi News home page

SMAT 2024 PUN Vs HYD: తిలక్‌ వర్మ విఫలం.. అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ విధ్వంసం

Published Mon, Dec 2 2024 1:37 PM | Last Updated on Mon, Dec 2 2024 3:21 PM

SMAT 2024: Tilak Varma Fails Miling Innings Goes In Vain As Hyd Loss To Punjab

టీమిండియా జెర్సీలో తిలక్‌ వర్మ(ఫైల్‌ ఫొటో)

దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు మూడో పరాజయం నమోదు చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండర్‌ చామా మిలింద్‌ (22 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ విధ్వంసం
గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోరులో .. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసింది పంజాబ్. ‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధశతకం సాధించగా... రమణ్‌దీప్‌ సింగ్‌ (11 బంతుల్లో 39 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), నేహల్‌ వధేరా (31; ఒక ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.

హైదరాబాద్‌ బౌలర్లలో రవితేజ, అజయ్‌దేవ్‌ గౌడ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. చామా మిలింద్, రోహిత్‌ రాయుడు (37 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో రాణించగా... మికిల్‌ జైస్వాల్‌ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.

తిలక్‌ వర్మ విఫలం
కెప్టెన్‌ తిలక్‌ వర్మ (9), తన్మయ్‌ అగర్వాల్‌ (9), రాహుల్‌ బుద్ధి (5), అజయ్‌దేవ్‌ గౌడ్‌ (6), రవితేజ (0), ప్రతీక్‌ రెడ్డి (4) విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌ చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన మిలింద్‌ భారీ సిక్స్‌లతో విరుచుకుపడినా... జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాడు. పంజాబ్‌ బౌలర్లలో నమన్‌ ధీర్‌ 5 వికెట్లు పడగొట్టాడు. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్‌ తలపడనుంది.  

స్కోరు వివరాలు 
పంజాబ్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (బి) అజయ్‌దేవ్‌ గౌడ్‌ 21; ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) తిలక్‌ వర్మ (బి) మిలింద్‌ 1; అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (సి) ప్రతీక్‌ రెడ్డి (బి) అజయ్‌దేవ్‌ గౌడ్‌ 60; నేహల్‌ వధేరా (సి) మిలింద్‌ (బి) నితిన్‌సాయి యాదవ్‌ 31; నమన్‌ ధీర్‌ (సి) రాహుల్‌ బుద్ధి (బి) రవితేజ 9; సానీ్వర్‌ సింగ్‌ (సి) రోహిత్‌ రాయుడు (బి) రవితేజ 24; రమణ్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 39; అర్ష్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–13, 2–28, 3–115, 4–115, 5–149, 6–151. 

బౌలింగ్‌: రవితేజ 4–0–49–2; మిలింద్‌ 4–0–28–1; అజయ్‌దేవ్‌ గౌడ్‌ 4–0–38–2; రక్షణ్‌ రెడ్డి 2–0–26–0, నితిన్‌సాయి యాదవ్‌ 4–0–40–1; రోహిత్‌ రాయుడు 2–0–13–0.  

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (సి) జసిందర్‌ సింగ్‌ (బి) నమన్‌ 9; రోహిత్‌ రాయుడు (సి) సాన్వీర్‌ సింగ్‌ (బి) నమన్‌ 56; తిలక్‌ వర్మ (సి) అర్ష్‌దీప్‌ (బి) జసిందర్‌ 9; మికిల్‌ జైస్వాల్‌ (సి) అన్‌మోల్‌ప్రీత్‌ (బి) మయాంక్‌ మార్కండే 39; రాహుల్‌ బుద్ధి (సి) అభిషేక్‌ శర్మ (బి) జసిందర్‌ 5; అజయ్‌దేవ్‌ గౌడ్‌ (సి) రమణ్‌దీప్‌ సింగ్‌ (బి) నమన్‌ 6; రవితేజ (ఎల్బీ) (బి) నమన్‌ 0; ప్రతీక్‌ రెడ్డి (స్టంప్డ్‌) ప్రభ్‌సిమ్రన్‌ (బి) నమన్‌ 4; మిలింద్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) అర్ష్‌దీప్‌ 55; నితిన్‌సాయి యాదవ్‌ (రనౌట్‌) 0; రక్షణ్‌ రెడ్డి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 189. వికెట్ల పతనం: 1–25, 2–57, 3–118, 4–120, 5–127, 6–127, 7–133, 8–141, 9–142, 10–189. 

బౌలింగ్‌: అభిషేక్‌ 1–0–10–0; అర్‌‡్షదీప్‌ 4–0–47–1; బల్తేజ్‌ సింగ్‌ 3–0–35–0; నమన్‌ ధీర్‌ 4–0–19–5; జసిందర్‌ సింగ్‌ 4–0–44–2; మయాంక్‌ మార్కండే 2–0–22–1; సాన్వీర్‌ 
సింగ్‌ 2–0–14–0.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement