Milind CV
-
తొలిరోజే దంచికొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు.. 302 రన్స్ ఆధిక్యం
Hyderabad vs Sikkim Day 1 - Hyderabad lead by 302 runs: టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ రంజీల్లో తిరిగి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్లో హైదరాబాద్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆరంభమైన తర్వాత దేశవాళీ జట్టుకు దూరమయ్యాడు. మొహాలీ వేదికగా అఫ్గన్‌తో జరిగిన తొలి టీ20లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్ 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20తో విరాట్ కోహ్లి పునరాగమనం చేసిన నేపథ్యంలో తిలక్‌పై వేటు పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు ఈ హైదరాబాద్ బ్యాటర్. ఈ క్రమంలో శుక్రవారం నాటి హైదరాబాద్- సిక్కిం మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. 79 పరుగులకే సిక్కిం ఆలౌట్ ఈ మ్యాచ్‌లో సిక్కిం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, హైదరాబాద్ బౌలర్లు టి.త్యాగరాజన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సీవీ మిలింద్ 4 వికెట్లతో సత్తా చాటాడు. వీరిద్దరి దెబ్బకు సిక్కిం 79 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(137), గహ్లోత్ రాహుల్ సింగ్(83) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వన్‌డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు సైతం 75 పరుగులతో రాణించాడు. వరుసగా రెండు విజయాలు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ తిలక్ వర్మ 66 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్న చందన్ సహానీ 8 పరుగులు చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి వీరిద్దరు అజేయంగా నిలవగా.. హైదరాబాద్ ఏకంగా 302 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. రంజీ తాజా సీజన్లో ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్ జట్టు ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. తిలక్(అజేయ సెంచరీ) సారథ్యంలో నాగాలాండ్‌పై, గహ్లోత్ రాహుల్ సింగ్ కెప్టెన్సీలో మేఘాలయపై గెలుపొందింది. తాజాగా మళ్లీ తిలక్ నేతృత్వంలో ఆడుతున్న హైదరాబాద్ ఈసారి సిక్కింను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. ఇక రంజీ సీజన్-2024లో హైదరాబాద్‌కు ఇది మూడో మ్యాచ్! చదవండి: Ranji Trophy 2024: బ్యాట్‌తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై! -
Ranji Trophy 2022: హైదరాబాద్ 347 ఆలౌట్
Ranji Trophy 2022 Hyd Vs Chgrh: - భువనేశ్వర్: చండీగఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 270/7తో ఆట కొనసాగించిన హైదరాబాద్ మరో 77 పరుగులు జోడిం చి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. తనయ్ త్యాగరాజన్ (38; 6 ఫోర్లు), సీవీ మిలింద్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇక మొదటి రోజు భారత క్రికెటర్ హనుమ విహారి (59; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చండీగఢ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. మనన్ వొహ్రా (110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! -
IPLAuction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్.. ఇంకా..
IPL 2022 Mega Auction: ఐపీఎల్ వేలం-2022 తుది జాబితా ఖరారైంది. 217 స్థానాలకు 590 మంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది క్రికెటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ వేలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నుంచి 8 మంది (అంబటి రాయుడు, అశ్విన్ హెబర్, రికీ భుయ్, హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్, స్టీఫెన్, బండారు అయ్యప్ప, గిరినాథ్ రెడ్డి) పాల్గొనబోతున్నారు. అదే విధంగా... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నుంచి 15 మంది (హనుమ విహారి, తిలక్ వర్మ, బి.సందీప్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, సీవీ మిలింద్, రాహుల్ బుద్ధి, యుధ్వీర్, కార్తికేయ, భగత్ వర్మ, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, మికిల్ జైస్వాల్, మొహమ్మద్ అఫ్రిది) ఈ మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చదవండి: ICC U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా 🚨 NEWS 🚨: IPL 2022 Player Auction list announced The Player Auction list is out with a total of 590 cricketers set to go under the hammer during the two-day mega auction which will take place in Bengaluru on February 12 and 13, 2022. More Details 🔽https://t.co/z09GQJoJhW pic.twitter.com/02Miv7fdDJ — IndianPremierLeague (@IPL) February 1, 2022 -
ఆడిన 5 మ్యాచ్‌లలో రెండే విజయాలు.. టోర్నీ నుంచి అవుట్!
Hyderabad Out Of Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌లలో 2 మాత్రమే గెలిచింది. తద్వారా ఎలైట్ గ్రూప్ ‘సి’లో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో జార్ఖండ్ చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ జట్టు 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ పేసర్ సీవీ మిలింద్ 63 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం హైదరాబాద్ 48.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. తద్వారా ఓటమి మూటగట్టుకుని పరాజయంతోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: Srikar Bharat: 138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 156.. ప్చ్.. గెలిచినా నిరాశే! -
ఆంధ్ర 190 ఆలౌట్
లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు సీవీ మిలింద్ (5/28), రవికిరణ్ (4/33) నిప్పులు చెరిగారు. తొలి రోజు ఆటలో ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. దీంతో బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్సలో 59 ఓవర్లలో 190 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్లో ప్రణీత్ (88 బంతుల్లో 63; 11 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (63 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సలో వికెట్ కోల్పోకుండా 10 పరుగులు చేసింది.