Ranji Trophy 2022: హైదరాబాద్‌ 347 ఆలౌట్‌ | Ranji Trophy 2022 Hyd Vs Chgrh: Hyderabad All Out For 347 1st Innings | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2022: హైదరాబాద్‌ 347 ఆలౌట్‌

Published Sat, Feb 19 2022 8:10 AM | Last Updated on Sat, Feb 19 2022 8:20 AM

Ranji Trophy 2022 Hyd Vs Chgrh: Hyderabad All Out For 347 1st Innings - Sakshi

Ranji Trophy 2022 Hyd Vs Chgrh: - భువనేశ్వర్‌: చండీగఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 270/7తో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ మరో 77 పరుగులు జోడిం చి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది.

తనయ్‌ త్యాగరాజన్‌ (38; 6 ఫోర్లు), సీవీ మిలింద్‌ (28; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఇక మొదటి రోజు భారత క్రికెటర్‌ హనుమ విహారి (59; 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చండీగఢ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. మనన్‌ వొహ్రా (110; 13 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రక్షణ్‌ రెడ్డి 4 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement