రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో హిమాచల్ ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. షేక్ రషీద్ (69), హనుమ విహారి (66), శ్రీకర్ భరత్ (65) అర్ద సెంచరీలతో రాణించారు. హిమాచల్ బౌలర్లలో దినేశ్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బరిలోకి దిగిన హిమాచల్ తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు ఆలౌటైంది. రిషి ధవన్ (195) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆకాశ్ వశిస్ట్ (85), అంకిత్ కల్సి (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ ఐదు వికెట్లు సత్తా చాటాడు.
156 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర.. వినయ్ గలేటియా (5/49), మయాంక్ డాగర్ (4/23) ధాటికి 118 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో షేక్ రషీద్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
హైదరాబాద్ విజయం
పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. తన్మయ్ అగర్వాల్ (173) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 536 పరుగులు చేసింది. అభిరత్ రెడ్డి (68), రోహిత్ రాయుడు (84), హిమతేజ (60), త్యాగరాజన్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.
అనంతరం బరిలోకి దిగిన పుదుచ్చేరి.. అనికేత్ రెడ్డి (6/56) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు తరఫున అజయ్ రొహెరా (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
383 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుదుచ్చేరి.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరుగా ప్రతిఘటించినప్పటికీ (333 ఆలౌట్) ఉపయోగం లేకుండా పోయింది. త్యాగరాజన్ (7/106) పుదుచ్చేరిని దెబ్బకొట్టాడు. పుదుచ్చేరి సెకెండ్ ఇన్నింగ్స్‌లో గంగ శ్రీధర్ రాజు (106) సెంచరీతో రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment