IPL Mega Auction Players List 2022: 23 Players From Aca Hca Hanuma Vihari Ambati Rayudu Includes - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్‌, మనీశ్ రెడ్డి.. ఇంకా..

Published Wed, Feb 2 2022 7:42 AM | Last Updated on Thu, Feb 3 2022 11:12 AM

IPL 2022 Mega Auction: 23 Players From ACA HCA Hanuma Vihari Ambati Rayudu Includes - Sakshi

హనుమ విహారి, తిలక్‌ వర్మ, తన్మయ్‌ అగర్వాల్‌, అంబటి రాయుడు

IPL 2022 Mega Auction: ఐపీఎల్‌ వేలం-2022 తుది జాబితా ఖరారైంది. 217 స్థానాలకు 590 మంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది క్రికెటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌ వేలంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) నుంచి 8 మంది (అంబటి రాయుడు, అశ్విన్‌ హెబర్, రికీ భుయ్, హరిశంకర్‌ రెడ్డి, పృథ్వీ రాజ్, స్టీఫెన్, బండారు అయ్యప్ప, గిరినాథ్‌ రెడ్డి) పాల్గొనబోతున్నారు.

అదే విధంగా... హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నుంచి 15 మంది (హనుమ విహారి, తిలక్‌ వర్మ, బి.సందీప్,  తన్మయ్‌ అగర్వాల్, తనయ్‌ త్యాగరాజన్, సీవీ మిలింద్, రాహుల్‌ బుద్ధి, యుధ్‌వీర్, కార్తికేయ, భగత్‌ వర్మ, రక్షణ్‌ రెడ్డి, మనీశ్‌ రెడ్డి, అజయ్‌ దేవ్‌ గౌడ్, మికిల్‌ జైస్వాల్, మొహమ్మద్‌ అఫ్రిది) ఈ మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

చదవండి: ICC U 19 World Cup 2022: మరో ఫైనల్‌ వేటలో.. అండర్‌-19 టీమిండియా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement