Ranji Trophy 2022- Hyderabad Vs Chandigarh:- భువనేశ్వర్: చండీగఢ్‌తో గురువారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ సారథ్యంలో ఆడుతున్న భారత క్రికెటర్ హనుమ విహారి (59; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
తిలక్ వర్మ (32; 5 ఫోర్లు), ప్రతీక్ రెడ్డి (36; 5 ఫోర్లు), రవితేజ (32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. విహారి మూడో వికెట్‌కు తిలక్‌తో 51 పరుగులు... నాలుగో వికెట్‌కు హిమాలయ్ అగర్వాల్‌తో 51 పరుగులు జత చేశాడు. చండీగఢ్ బౌలర్లలో జగ్జీత్ (3/50), రాజ్ అంగద్ బావా (2/43), గౌరవ్ గంభీర్ (2/66) రాణించారు.
చదవండి: Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా!
Ranji Trophy 2022: మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం
Ranji Trophy 2022: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే
Comments
Please login to add a commentAdd a comment